< 2 Corinthians 12 >
1 I am compelled to boast. It is not a profitable employment, but I will proceed to visions and revelations granted me by the Lord.
౧నేను అతిశయించాలి, అయితే దాని వలన ప్రయోజనమేమీ రాదు. ప్రభువు దర్శనాలూ ప్రత్యక్షతలూ మీకు తెలియజేస్తాను.
2 I know a Christian man who fourteen years ago-- whether in the body I do not know, or out of the body I do not know; God knows--was caught up (this man of whom I am speaking) even to the highest Heaven.
౨క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
3 And I know that this man-- whether in the body or apart from the body I do not know;
౩అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
4 God knows--was caught up into Paradise and heard unspeakable things which no human being is permitted to repeat.
౪దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు.
5 Of such a one I will boast; but of myself I will not boast, except in my weaknesses.
౫అలాంటి వ్యక్తి తరపున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరపున నేను అతిశయించను.
6 If however I should choose to boast, I should not be a fool for so doing, for I should be speaking the truth. But I forbear, lest any one should be led to estimate me more highly than what his own eyes attest, or more highly than what he hears from my lips.
౬ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.
7 And judging by the stupendous grandeur of the revelations--therefore lest I should be over-elated there has been sent to me, like the agony of impalement, Satan's angel dealing blow after blow, lest I should be over-elated.
౭నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత.
8 As for this, three times have I besought the Lord to rid me of him;
౮అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను.
9 but His reply has been, "My grace suffices for you, for power matures in weakness." Most gladly therefore will I boast of my infirmities rather than complain of them--in order that Christ's power may overshadow me.
౯అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.
10 In fact I take pleasure in infirmities, in the bearing of insults, in distress, in persecutions, in grievous difficulties--for Christ's sake; for when I am weak, then I am strong.
౧౦బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.
11 It is foolish of me to write all this, but you have compelled me to do so. Why, you ought to have been my vindicators; for in no respect have I been inferior to these superlatively great Apostles, even though in myself I am nothing.
౧౧నేను బుద్ధిహీనుడినయ్యాను! మీరే నన్ను బలవంతం చేశారు. వాస్తవానికి మీరు నన్ను మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే నేను వట్టివాడినైనా ఆ “గొప్ప అపొస్తలుల” కంటే ఏ మాత్రం తక్కువ వాణ్ణి కాను.
12 The signs that characterize the true Apostle have been done among you, accompanied by unwearied fortitude, and by tokens and marvels and displays of power.
౧౨నాలో అసలైన అపొస్తలుని గురుతులు ఎంతో సహనంతో మీ మధ్య దేవుడు కనిపింపజేశాడు. సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ కనపరిచాడు.
13 In what respect, therefore, have you been worse dealt with than other Churches, except that I myself never hung as a dead weight upon you? Forgive the injustice I thus did you!
౧౩నేను మీకు భారంగా లేను అనే విషయంలో తప్ప, ఇతర సంఘాలకంటే మీరు ఏ విషయంలో తక్కువ వారయ్యారు? ఈ నా తప్పు క్షమించండి మరి!
14 See, I am now for the third time prepared to visit you, but I will not be a dead weight to you. I desire not your money, but yourselves; for children ought not to put by for their parents, but parents for their children.
౧౪ఇప్పుడు ఈ మూడవసారి మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీకేముందో అది నాకు అక్కరలేదు. నాకు మీరే కావాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు దాచరు. కానీ తల్లిదండ్రులే పిల్లల కోసం దాచాలి.
15 And as for me, most gladly will I spend all I have and be utterly spent for your salvation.
౧౫కాబట్టి మీ ఆత్మల కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం ఖర్చయిపోతాను. నేను మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తుంటే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా?
16 If I love you so intensely, am I the less to be loved? Be that as it may: I was not a burden to you. But being by no means scrupulous, I entrapped you, they say!
౧౬అదలా ఉంచండి. నేను మీకు భారంగా ఉండలేదు గానీ నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకున్నాను అని చెబుతారేమో!
17 Have I gained any selfish advantage over you through any one of the messengers I have sent to you?
౧౭నేను మీ దగ్గరికి పంపినవారి ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకున్నానా?
18 I begged Titus to visit you, and sent our other brother with him. Did Titus gain any selfish advantage over you? Were not he and I guided by one and the same Spirit, and did we not walk in the same steps?
౧౮మీ దగ్గరికి వెళ్ళమని తీతును ప్రోత్సహించాను. అతనితో వేరొక సోదరుని పంపాను. తీతు మీ దగ్గర ఏమైనా సంపాదించాడా? మేము ఏక మనసుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా?
19 You are imagining, all this time, that we are making our defense at your bar. In reality it is as in God's presence and in communion with Christ that we speak; but, dear friends, it is all with a view to your progress in goodness.
౧౯మేమింత వరకూ మా పక్షంగా మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తును బట్టి మీ క్షేమాభివృద్ధి కోసం ఇవన్నీ చెబుతున్నాం.
20 For I am afraid that perhaps when I come I may not find you to be what I desire, and that you may find me to be what you do not desire; that perhaps there may be contention, jealousy, bitter feeling, party spirit, ill-natured talk, backbiting, undue eulogy, unrest;
౨౦ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో.
21 and that upon re-visiting you I may be humbled by my God in your presence, and may have to mourn over many whose hearts still cling to their old sins, and who have not repented of the impurity, fornication, and gross sensuality, of which they have been guilty.
౨౧నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయంలో పశ్చాత్తాపం పొందని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.