< 1 Peter 3 >
1 Married women, in the same way, be submissive to your husbands, so that even if some of them disbelieve the Message, they may, apart from the Message, be won over by the daily life of their wives, after watching your daily life--
౧భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది.
2 so full of reverence, and so blameless!
౨ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.
3 Your adornment ought not to be a merely outward thing--one of plaiting the hair, putting on jewelry, or wearing beautiful dresses.
౩జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు.
4 Instead of that, it should be a new nature within--the imperishable ornament of a gentle and peaceful spirit, which is indeed precious in the sight of God.
౪వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది.
5 For in ancient times also this was the way the holy women who set their hopes upon God used to adorn themselves, being submissive to their husbands.
౫పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు.
6 Thus, for instance, Sarah obeyed Abraham, acknowledging his authority over her. And you have become Sarah's children if you do what is right and permit nothing whatever to terrify you.
౬ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు.
7 Married men, in the same way, live with your wives with a clear recognition of the fact that they are weaker than you. Yet, since you are heirs with them of God's free gift of Life, treat them with honour; so that your prayers may not be hindered.
౭అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు.
8 In conclusion, all of you should be of one mind, quick to sympathize, kind to the brethren, tenderhearted, lowly-minded,
౮చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.
9 not requiting evil with evil nor abuse with abuse, but, on the contrary, giving a blessing in return, because a blessing is what you have been called by God to inherit.
౯కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
10 For "He who wishes to be well-satisfied with life and see happy days-- let him restrain his tongue from evil, and his lips from deceitful words;
౧౦జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి.
11 Let him turn from evil, and do good; Let him inquire for peace and go in pursuit of it.
౧౧అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి.
12 For the eyes of the Lord are upon the righteous, and His ears are open to their supplication; but the face of the Lord is set against evil-doers."
౧౨ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
13 And who will be able to harm you, if you show yourselves zealous for that which is good?
౧౩మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు?
14 But even if you suffer for righteousness' sake, you are to be envied. So do not be alarmed by their threats, nor troubled;
౧౪మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.
15 but in your hearts consecrate Christ as Lord, being always ready to make your defence to any one who asks from you a reason for the hope which you cherish.
౧౫దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
16 Yet argue modestly and cautiously, keeping your consciences free from guilt, so that, when you are spoken against, those who slander your good Christian lives may be put to shame.
౧౬మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు.
17 For it is better that you should suffer for doing right, if such be God's will, than for doing evil;
౧౭కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.
18 because Christ also once for all died for sins, the innocent One for the guilty many, in order to bring us to God. He was put to death in the flesh, but made alive in the spirit,
౧౮క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు.
19 in which He also went and proclaimed His Message to the spirits that were in prison,
౧౯ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు.
20 who in ancient times had been disobedient, while God's longsuffering was patiently waiting in the days of Noah during the building of the Ark, in which a few persons--eight in number--were brought safely through the water.
౨౦ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు.
21 And, corresponding to that figure, the water of baptism now saves you--not the washing off of material defilement, but the craving of a good conscience after God--through the resurrection of Jesus Christ,
౨౧దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే.
22 who is at God's right hand, having gone into Heaven, angels and authorities and powers having been made subject to Him.
౨౨ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.