< Titus 2 >
1 But you, speak what fits with faithful instruction.
౧అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు.
2 Teach older men to be temperate, dignified, sensible, sound in faith, in love, and in perseverance.
౨వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలుగుతూ విశ్వాసం, ప్రేమ, సహనంలో శుద్ధంగా ఉండాలి.
3 Teach older women likewise to be reverent in behavior, not slanderers or being slaves to much wine, but to be teachers of what is good.
౩అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి.
4 In this way they may train the younger women to love their own husbands and children,
౪దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.
5 to be sensible, pure, good housekeepers, and obedient to their own husbands. They should do these things so that God's word may not be insulted.
౫
6 In the same way, encourage the younger men to use good sense.
౬అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు.
7 In all ways present yourself as an example of good works. In your teaching, show integrity, dignity,
౭నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో.
8 and a correct message, so that anyone who opposes you may be ashamed because they have nothing bad to say about us.
౮నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి.
9 Teach slaves to obey their masters in everything, to please them and not argue with them,
౯మన రక్షకుడైన దేవుని గూర్చిన బోధ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా దాసులు అన్నివిషయాల్లో తమ యజమానులకు విధేయులై ఉండాలి. తమ యజమానులను ఎదిరించక అన్ని విషయాల్లో వారిని సంతోషపెట్టాలి.
10 to not steal from them, but instead to demonstrate all good faith, so that in every way they may bring credit to the teaching about God our Savior.
౧౦పనివారు యజమానులకు ఎదురు చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. సంపూర్ణ విశ్వాసపాత్రులుగా ఉండాలి. మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని ఇతరులకు ఆకర్షణీయంగా చేయాలి. ఈ సంగతులు వారికి బోధించు.
11 For the grace of God has appeared for the salvation of all people.
౧౧చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది.
12 It trains us to reject godlessness and worldly passions, and to live self-controlled, upright, and godly lives in this age, (aiōn )
౧౨మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది. (aiōn )
13 while we look forward to receiving our blessed hope, the appearance of the glory of our great God and Savior Jesus Christ.
౧౩
14 Jesus gave himself for us in order to redeem us from all lawlessness and to make pure, for himself, a special people who are eager to do good works.
౧౪ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.
15 Speak of these things, encourage people to do them, and give correction with all authority. Let no one disregard you.
౧౫వీటిని గూర్చి బోధించు. సంపూర్ణమైన అధికారంతో హెచ్చరించు, ఖండించు. ఎవరూ నిన్ను నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.