< Psalms 70 >

1 For the chief musician. A psalm of David; to bring to remembrance. Save me, God! Yahweh, come quickly and help me.
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు రాసిన జ్ఞాపకార్థ కీర్తన. దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.
2 Let those who try to take my life be ashamed and humiliated; let them be turned back and brought to dishonor, those who take pleasure in my pain.
నన్ను చంపాలని, బాధించాలని చూసేవారు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక.
3 Let them be turned back because of their shame, those who say, “Aha, aha.”
ఆహా ఆహా అని పలికేవారు సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్తారు గాక.
4 Let all those who seek you rejoice and be glad in you; let those who love your salvation always say, “May God be praised.”
నిన్ను వెతికే వారంతా నీలో ఆనందించి సంతోషిస్తారు గాక. నీ రక్షణను ప్రేమించే వారంతా దేవునికే మహిమ కలగాలి అని ఎప్పుడూ చెప్పుకుంటారు గాక.
5 But I am poor and needy; hurry to me, God; you are my help and you rescue me. Yahweh, do not delay.
నేను పేదవాణ్ణి. అక్కరలో ఉన్నవాణ్ణి. నన్ను రక్షించడానికి వేగమే రా. నాకు సహాయం నువ్వే. నా రక్షణకర్తవు నువ్వే. యెహోవా, ఆలస్యం చేయవద్దు.

< Psalms 70 >