< Job 39 >
1 Do you know at what time the wild goats in the rocks bear their young? Can you watch when the deer are having their fawns?
౧అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా?
2 Can you count the months that they gestate? Do you know the time when they bear their young?
౨అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా?
3 They crouch down and birth their young, and then they finish their labor pains.
౩అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి.
4 Their young ones become strong and grow up in the open fields; they go out and do not come back again.
౪వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు.
5 Who let the wild donkey go free? Who has untied the bonds of the swift donkey,
౫అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? గంతులు వేసే గాడిద కట్లు విప్పిన వాడెవడు?
6 whose home I have made in the Arabah, his house in the salt land?
౬నేను అడివిని దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాసస్థలంగాను నియమించాను.
7 He laughs in scorn at the noises in the city; he does not hear the driver's shouts.
౭పట్టణపు రణగొణధ్వనులను చూసి అది తిరస్కారంగా నవ్వుతుంది. తోలేవాడి అదిలింపులు అది వినదు.
8 He roams over the mountains as his pastures; there he looks for every green plant to eat.
౮పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది.
9 Will the wild ox be happy to serve you? Will he consent to stay by your manger?
౯అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా?
10 Can you use ropes to hold the wild ox in the furrows? Will he harrow the valleys as he follows after you?
౧౦పగ్గం వేసి అడివి దున్నను నాగలి దున్నించ గలవా? దాన్ని తోలుకుపోయి పల్లాలను చదును చేయించగలవా?
11 Will you trust him because his strength is great? Will you leave your work to him to do?
౧౧అది మహా బలిష్ఠమైనదని దాన్ని నువ్వు నమ్ముతావా? చెయ్యమని దానికి నీ పని అప్పగిస్తావా?
12 Will you depend on him to bring your grain home, to gather the grain for your threshing floor?
౧౨అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా?
13 The wings of the ostrich wave proudly, but are they the pinions and plumage of love?
౧౩నిప్పుకోడి గర్వంగా రెక్కలు ఆడిస్తుంది. కానీ అవి ప్రేమపూర్వకమైన రెక్కలా, ఈకలా?
14 For she leaves her eggs on the earth, and she lets them keep warm in the dust;
౧౪లేదు సుమా, అది దాని గుడ్లు నేలపై పెడుతుంది. ఇసుకే వాటిని పొదుగుతుంది.
15 she forgets that a foot might crush them or that a wild beast might trample them.
౧౫దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవిజంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది.
16 She deals roughly with her young ones as if they were not hers; she does not fear that her labor might have been in vain,
౧౬తన పిల్లలు తనవి కానట్టు వాటి పట్ల అది కఠినంగా ఉంటుంది. దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి చింత లేదు.
17 because God has deprived her of wisdom and has not given her any understanding.
౧౭దేవుడు దాన్ని తెలివిలేనిదిగా చేశాడు. ఆయన దానికి వివేచనాశక్తి ఇవ్వలేదు.
18 When she runs swiftly, she laughs in scorn at the horse and its rider.
౧౮అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది.
19 Have you given the horse his strength? Did you clothe his neck with his flowing mane?
౧౯గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా?
20 Have you ever made him jump like a locust? The majesty of his snorting is fearsome.
౨౦మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం.
21 He paws in might and rejoices in his strength; he rushes out to meet the weapons.
౨౧అది కాలు దువ్వి తన బలాన్నిబట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోడానికి ముందుకు దూకుతుంది.
22 He mocks fear and is not dismayed; he does not turn back from the sword.
౨౨అది భయాన్ని వెక్కిరిస్తుంది. హడలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు.
23 The quiver rattles against his flank, along with the flashing spear and the javelin.
౨౩దాని వీపుపై అంబుల పొది, తళతళలాడే ఈటెలు బల్లేలు గలగలలాడినప్పుడు,
24 He swallows up ground with fierceness and rage; at the trumpet's sound, he cannot stand in one place.
౨౪పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది.
25 Whenever the trumpet sounds, he says, 'Aha!' He smells the battle from far away— the thunderous shouts of the commanders and the outcries.
౨౫బాకా ధ్వని వినబడినప్పుడెల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదనఘోషను వింటుంది.
26 Is it by your wisdom that the hawk soars, that he stretches out his wings for the south?
౨౬డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా?
27 Is it at your orders that the eagle mounts up and makes his nest in high places?
౨౭గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా?
28 He lives on cliffs and makes his home on the peaks of cliffs, a stronghold.
౨౮అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది.
29 From there he searches for victims; his eyes see them from very far away.
౨౯అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి.
30 His young also drink up blood; where killed people are, there he is.”
౩౦దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైనవారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది.