< Genesis 39 >
1 Joseph was brought down to Egypt. Potiphar, an official of Pharaoh who was captain of the guard and an Egyptian, bought him from the Ishmaelites, who had brought him down there.
౧యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు.
2 Yahweh was with Joseph and he became a prosperous man. He lived in the house of his Egyptian master.
౨యెహోవా యోసేపుతో ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ తన యజమాని అయిన ఐగుప్తీయుని ఇంట్లో ఉన్నాడు.
3 His master saw that Yahweh was with him and that Yahweh prospered everything that he did.
౩యెహోవా అతనికి తోడై ఉన్నాడనీ, అతడు చేసేదంతా యెహోవా సఫలం చేస్తున్నాడనీ అతని యజమాని గమనించాడు.
4 Joseph found favor in his sight. He served Potiphar. Potiphar made Joseph manager over his house, and everything that he possessed, he put under his care.
౪యోసేపు అతని దృష్టిలో దయ పొందాడు. అతడు పొతీఫరుకు సేవ చేశాడు. పొతీఫరు తన ఇంటి మీద యోసేపును కార్యనిర్వాహకునిగా నియమించి తనకు కలిగినదంతా అతని అధీనంలో ఉంచాడు.
5 It came about from the time that he made him manager over his house and over everything he possessed, that Yahweh blessed the Egyptian's house because of Joseph. The blessing of Yahweh was on everything that Potiphar had in the house and in the field.
౫అతడు తన ఇంటి మీదా తనకు ఉన్న దానంతటి మీదా అతన్ని కార్యనిర్వహకునిగా నియమించిన దగ్గరనుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. యెహోవా దీవెన అతని ఇంట్లో, పొలంలో, అతనికి ఉన్న దానంతటి మీదా ఉంది.
6 Potiphar put everything that he had under Joseph's care. He did not have to think about anything except the food that he ate. Now Joseph was handsome and attractive.
౬అతడు తనకు కలిగినదంతా యోసేపుకు అప్పగించి, తాను భోజనం చేయడం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకొనేవాడు కాడు. యోసేపు అందగాడు, చూడడానికి బావుంటాడు.
7 It came about after this that his master's wife lusted for Joseph. She said, “Sleep with me.”
౭ఆ తరువాత అతని యజమాని భార్య యోసేపును మోహించింది. “నాతో సుఖపడు” అని అతనిని అడిగింది.
8 But he refused and said to his master's wife, “Look, my master does not pay attention to what I do in the house, and he has put everything that he owns under my care.
౮అయితే అతడు తిరస్కరించి “నా యజమాని తనకు కలిగినదంతా నా వశంలో ఉంచాడు. నేను ఇక్కడ ఉండడం వలన ఇంట్లో ఏ విషయాన్నీ అతడు చూసుకోవడం లేదు.
9 No one is greater in this house than I am. He has not kept back anything from me but you, because you are his wife. How then can I do this great wickedness and sin against God?”
౯ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నువ్వు అతని భార్యవు కాబట్టి నిన్ను మినహాయించి మిగతా అంతటినీ అతడు నా అధీనంలో ఉంచాడు. కాబట్టి నేనెలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేస్తాను?” అని తన యజమాని భార్యతో అన్నాడు.
10 She spoke to Joseph day after day, but he refused to sleep with her or to be with her.
౧౦ప్రతిరోజూ ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది గానీ అతడు ఆమెతో ఉండడానికి గానీ పాపం చేయడానికి గానీ ఒప్పుకోలేదు.
11 It came about one day that he went into the house to do his work. None of the men of the house were there in the house.
౧౧అలా ఉండగా ఒక రోజు అతడు పని మీద ఇంటి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళెవరూ అక్కడ లేరు.
12 She caught him by his clothes and said, “Sleep with me.” He left his clothing in her hand, fled, and went outside.
౧౨అప్పుడామె అతని పై వస్త్రాన్ని పట్టుకుని “నాతో పండుకో” అని అడిగింది. అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.
13 It came about, when she saw that he had left his clothing in her hand and had fled outside,
౧౩అతడు తన పై వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవడం ఆమె చూసి,
14 that she called to the men of her house and told them, “See, Potiphar has brought in a Hebrew to mock us. He came in to me to sleep with me, and I screamed.
౧౪తన ఇంట్లో పనిచేసే వారిని పిలిచి “చూడండి, పోతీఫరు మనలను ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు. నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను.
15 It came about when he heard me scream, that he left his clothing with me, fled, and went outside.”
౧౫నేను పెద్దగా కేకవేయడం వాడు విని నా దగ్గర తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు” అని వారితో చెప్పింది.
16 She set his clothing next to her until his master came home.
౧౬అతని యజమాని ఇంటికి వచ్చే వరకూ ఆమె అతని వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంది.
17 She told him this explanation, “The Hebrew servant whom you brought to us, came in to mock me.
౧౭ఆమె తన భర్తతో ఇలా వివరించింది. “నువ్వు మన దగ్గరికి తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వచ్చాడు.
18 It came about that when I screamed, he left his clothing with me and fled outside.”
౧౮నేను బిగ్గరగా కేక వేస్తే వాడు తన పై వస్త్రాన్ని నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు.”
19 It came about that, when his master heard the explanation his wife told him, “This is what your servant did to me,” he became very angry.
౧౯“నీ దాసుడు నాకిలా చేశాడు” అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పొతీఫరు, కోపంతో మండిపడ్డాడు.
20 Joseph's master took him and put him in prison, the place where the king's prisoners were confined. He was there in the prison.
౨౦యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలను బంధించే చెరసాలలో వేయించాడు. అతడు చెరసాలలో ఉన్నాడు.
21 But Yahweh was with Joseph and showed covenant faithfulness to him. He gave him favor in the sight of the prison warden.
౨౧అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి, అతని మీద నిబంధన సంబంధమైన విశ్వాస్యతను చూపించాడు. చెరసాల అధిపతి అతన్ని అభిమానంగా చూసుకోనేలా చేశాడు.
22 The prison warden gave into Joseph's hand all the prisoners who were in the prison. Whatever they did there, Joseph was in charge of it.
౨౨చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపుకు అప్పగించాడు. వారక్కడ చేసే పనులన్నీ యోసేపే చేయించేవాడు.
23 The prison warden did not worry about anything that was in his hand, because Yahweh was with him. Whatever he did, Yahweh prospered.
౨౩యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధిపతి యోసేపుకు తాను అప్పగించిన దేనినీ ఇక పట్టించుకునేవాడు కాదు. అతడు చేసేదంతా యెహోవా సఫలం చేశాడు.