< Deuteronomy 1 >
1 These are the words that Moses spoke to all Israel beyond the Jordan in the wilderness, in the plain of the Jordan River valley over against Suph, between Paran, Tophel, Laban, Hazeroth, and Dizahab.
౧యొర్దాను నదికి తూర్పున ఉన్న ఎడారిలో, అంటే పారాను, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబు అనే ప్రదేశాల మధ్య సూపుకు ఎదురుగా ఉన్న ఆరాబా ఎడారిలో మోషే, ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు.
2 It is eleven days' journey from Horeb by the way of Mount Seir to Kadesh Barnea.
౨హోరేబు నుండి శేయీరు ఎడారి దారిలో కాదేషు బర్నేయ వరకూ ప్రయాణ సమయం 11 రోజులు.
3 It happened in the fortieth year, in the eleventh month, on the first day of the month, that Moses spoke to the people of Israel, telling them all that Yahweh commanded him concerning them.
౩హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజు సీహోనునూ అష్తారోతులో నివసించిన బాషాను రాజు ఓగునూ ఎద్రెయీలో చంపిన తరువాత 40 వ సంవత్సరంలో 11 వ నెల మొదటి రోజున మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు.
4 This was after Yahweh had attacked Sihon the king of the Amorites, who lived in Heshbon, and Og the king of Bashan, who lived in Ashtaroth at Edrei.
౪
5 Beyond the Jordan, in the land of Moab, Moses began to announce these instructions, saying,
౫యొర్దాను ఇవతల ఉన్న మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు,
6 “Yahweh our God spoke to us at Horeb, saying, 'You have lived long enough in this hill country.
౬“మన దేవుడు యెహోవా హోరేబులో మనకిలా చెప్పాడు, ఈ కొండ దగ్గర మీరు నివసించింది చాలు.
7 Turn and take your journey, and go to the hill country of the Amorites and to all the places near there in the plain of the Jordan River valley, in the hill country, in the lowland, in the Negev, and by the seashore—the land of the Canaanites, and in Lebanon as far as the great river, the Euphrates.
౭మీరు బయలుదేరి అమోరీయుల కొండ ప్రాంతానికీ అరాబా లోయలో దక్షిణ దిక్కున సముద్రతీరంలో ఉన్న స్థలాలన్నిటికీ కనాను దేశానికీ లెబానోనుకూ యూఫ్రటీసు మహానది వరకూ వెళ్ళండి.
8 Look, I have set the land before you; go in and possess the land that Yahweh swore to your fathers—to Abraham, to Isaac, and to Jacob—to give to them and to their descendants after them.'
౮ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.”
9 I spoke to you at that time, saying, 'I am not able to carry you myself alone.
౯ఆ సమయంలో, నేను మీతో “నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను.
10 Yahweh your God has multiplied you, and, look, you are today as the multitude of the stars of heaven.
౧౦యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు.
11 May Yahweh, the God of your fathers, make you a thousand times as many as you are, and bless you, as he has promised you!
౧౧మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక.
12 But how can I myself alone carry your loads, your burdens, and your disputes?
౧౨నేనొక్కడినే మీ కష్టాన్ని, భారాన్ని, మీ వివాదాలను ఎలా తీర్చగలను?
13 Take wise men, understanding men, and men of good repute from each tribe, and I will make them heads over you.'
౧౩జ్ఞానం, తెలివి కలిగి మీ గోత్రాల్లో పేరు పొందిన మనుషులను ఎన్నుకోండి. వారిని మీకు నాయకులుగా నియమిస్తాను” అని చెప్పాను.
14 You answered me and said, 'The thing that you have spoken is good for us to do.'
౧౪అప్పుడు మీరు “నీ మాట ప్రకారం చేయడం మంచిది” అని నాకు జవాబిచ్చారు.
15 So I took the heads of your tribes, wise men, and men of good repute, and made them heads over you, captains of thousands, captains of hundreds, captains of fifties, captains of tens, and officers, tribe by tribe.
౧౫కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను.
16 I commanded your judges at that time, saying, 'Hear the disputes between your brothers, and judge righteously between a man and his brother, and the foreigner who is with him.
౧౬అప్పుడు నేను వారితో “మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి.
17 You will not show partiality to anyone in a dispute; you will hear the small and the great alike. You will not be afraid of the face of man, for the judgment is God's. The dispute that is too hard for you, you will bring to me, and I will hear it.'
౧౭అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను” అని ఆజ్ఞాపించాను.
18 I commanded you at that time all the things that you should do.
౧౮అలాగే మీరు చేయాల్సిన పనులన్నిటిని గూర్చి మీకు ఆజ్ఞాపించాను.
19 We journeyed away from Horeb and went through all that great and terrible wilderness that you saw, on our way to the hill country of the Amorites, as Yahweh our God had commanded us; and we came to Kadesh Barnea.
౧౯మనం హోరేబు నుండి ప్రయాణించి యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించినట్టు మీరు చూసిన ఘోరమైన ఎడారి ప్రాంతం నుండి వచ్చి, అమోరీయుల కొండ ప్రాంతం మార్గంలో కాదేషు బర్నేయ చేరాం.
20 I said to you, 'You have come to the hill country of the Amorites, which Yahweh our God is giving to us.
౨౦అప్పుడు నేను “మన దేవుడైన యెహోవా మనకిస్తున్న అమోరీయుల కొండ ప్రాంతానికి వచ్చాం.
21 Look, Yahweh your God has set the land before you; go up, take possession, as Yahweh, the God of your fathers, has spoken to you; do not be afraid, neither be discouraged.'
౨౧ఇదిగో, మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు అప్పగించాడు. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీతో చెప్పినట్టు దాన్ని స్వాధీనం చేసుకోండి. భయపడవద్దు, నిరుత్సాహం వద్దు” అని మీతో చెప్పాను.
22 Every one of you came to me and said, 'Let us send men ahead of us, so that they may search out the land for us, and bring us word about the way by which we should attack, and about the cities to which we will come.'
౨౨అప్పుడు మీరంతా నా దగ్గరికి వచ్చి “ముందుగా మన మనుషులను పంపుదాం, వాళ్ళు మన కోసం ఈ దేశాన్ని పరిశీలించి తిరిగి వచ్చి దానిలో మనం వెళ్ళాల్సిన మార్గం గురించీ మనం చేరాల్సిన పట్టణాలను గురించీ మనకు సమాచారం తెస్తారు” అన్నారు.
23 The advice pleased me well; I took twelve men of you, one man for every tribe.
౨౩ఆ మాట అంగీకరించి ఒక్కొక్క గోత్రానికి ఒక్కరు చొప్పున పన్నెండు మందిని పంపాను.
24 They turned and went up into the hill country, came to the Valley of Eshkol, and scouted it.
౨౪వాళ్ళు ఆ కొండ ప్రదేశానికి వెళ్ళి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు. ఆ దేశంలో దొరికే పండ్లు కొన్నిటిని మన దగ్గరికి తెచ్చి,
25 They took some of the produce of the land in their hands and brought it down to us. They also brought us word and said, 'It is a good land that Yahweh our God is giving to us.'
౨౫“మన దేవుడు యెహోవా మనకిస్తున్న దేశం మంచిది” అని మనకు చెప్పారు.
26 Yet you refused to attack, but rebelled against the commandment of Yahweh your God.
౨౬అయితే మీరు వెళ్లడానికి ఇష్టపడలేదు. మీ దేవుడైన యెహోవా మాటకు తిరగబడ్డారు.
27 You complained in your tents and said, “It is because Yahweh hated us that he has brought us out of the land of Egypt, to give us into the hand of the Amorites to destroy us.
౨౭మీ గుడారాల్లో సణుక్కుంటూ “యెహోవా మన మీద పగబట్టి మనలను చంపడానికి, అమోరీయులకు అప్పగించడానికి ఐగుప్తు దేశం నుండి మనలను రప్పించాడు.
28 Where can we go now? Our brothers have made our heart to melt, saying, 'Those people are bigger and taller than we are; their cities are large and are fortified up to the heavens; moreover, we have seen the sons of the Anakim there.'”
౨౮మనమెక్కడికి వెళ్లగలం? అక్కడి ప్రజలు మన కంటే బలిష్ఠులు, ఎత్తయినవారు. ఆ పట్టణాలు గొప్పవి, ఆకాశాన్నంటే ప్రాకారాలతో ఉన్నాయి. అక్కడ అనాకీయులను చూశాం” అని మన సోదరులు చెప్పి మా హృదయాలు కరిగిపోయేలా చేశారు అని అన్నారు.
29 Then I said to you, 'Do not be terrified, neither be afraid of them.
౨౯అప్పుడు నేను మీతో “దిగులు పడొద్దు, భయపడొద్దు.
30 Yahweh your God, who goes before you, he will fight for you, like everything that he did for you in Egypt before your eyes,
౩౦మీకు ముందు నడుస్తున్న మీ యెహోవా దేవుడు మీరు చూస్తుండగా
31 and also in the wilderness, where you have seen how Yahweh your God carried you, as a man carries his son, everywhere you went until you came to this place.'
౩౧ఐగుప్తులో, అరణ్యంలో చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చేవరకూ దారిలో మీ యెహోవా దేవుడు ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకున్నట్టు మిమ్మల్ని ఎత్తుకుని వచ్చాడని మీకు తెలుసు” అన్నాను.
32 Yet in spite of this word you did not believe Yahweh your God,
౩౨అయితే మీకు దారి చూపించి మీ గుడారాలకు స్థలం సిద్ధపరిచేలా
33 who went before you on the way to find a place for you to make camp, in fire by night and in a cloud by day.
౩౩రాత్రి అగ్నిలో, పగలు మేఘంలో మీ ముందు నడిచిన మీ యెహోవా దేవుని మీద మీరు విశ్వాసముంచలేదు.
34 Yahweh heard the sound of your words and was angry; he swore and said,
౩౪కాబట్టి యెహోవా మీ మాటలు విని,
35 'Surely not one of these men of this evil generation will see the good land that I swore to give to your ancestors,
౩౫బాగా కోపం తెచ్చుకుని “నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన ఈ మంచి దేశాన్ని ఈ చెడ్డతరంలో
36 save Caleb son of Jephunneh; he will see it. To him I will give the land that he has stepped on, and to his children, because he has wholly followed Yahweh.'
౩౬యెఫున్నె కొడుకు కాలేబు తప్ప మరెవరూ చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించాడు కాబట్టి కేవలం అతడు మాత్రమే దాన్ని చూస్తాడు. అతడు అడుగుపెట్టిన భూమిని నేను అతనికీ అతని సంతానానికీ ఇస్తాను” అని ప్రమాణం చేశాడు.
37 Also Yahweh was angry with me because of you, saying, 'You also will not go in there;
౩౭అంతేగాక యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి “నీ సేవకుడు, నూను కొడుకు యెహోషువ దానిలో అడుగు పెడతాడు గాని నువ్వు అడుగు పెట్టవు.
38 Joshua son of Nun, who stands before you, he will go in there; encourage him, for he will lead Israel to inherit it.
౩౮అతడే దాన్ని ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేస్తాడు. కాబట్టి అతణ్ణి ప్రోత్సహించు.
39 Moreover, your little children, the ones you said would be victims, who today have no knowledge of good or evil—they will go in there. To them I will give it, and they will possess it.
౩౯అయితే మంచీ చెడూ తెలియని మీ కొడుకులు, అంటే అన్యాయానికి గురౌతారు అని మీరు చెప్పే మీ పిల్లలు దానిలో అడుగు పెడతారు. దాన్ని వారికిస్తాను. వారు దాన్ని స్వాధీనం చేసుకుంటారు.
40 But as for you, turn and take your journey into the wilderness along the way to the Sea of Reeds.'
౪౦మీరు మాత్రం వెనక్కి ఎర్రసముద్రం వైపుకు తిరిగి ఎడారిలోకి ప్రయాణించండి” అని చెప్పాడు.
41 Then you answered and said to me, 'We have sinned against Yahweh; we will go up and fight, and we will follow all that Yahweh our God has commanded us to do.' Every man among you put on his weapons of war, and you were ready to attack the hill country.
౪౧అందుకు మీరు “మేము యెహోవాకు విరోధంగా పాపం చేశాం. మా యెహోవా దేవుడు మాకాజ్ఞాపించిన ప్రకారం మేము వెళ్ళి యుద్ధం చేస్తాం” అని నాతో చెప్పి, మీ ఆయుధాలతో ఆ కొండ ప్రాంతానికి బయలుదేరారు.
42 Yahweh said to me, 'Say to them, “Do not attack and do not fight, for I will not be with you, and you will be defeated by your enemies.'
౪౨అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు “యుద్ధానికి వెళ్లొద్దు. నేను మీతో ఉండను కాబట్టి మీరు వెళ్లినా మీ శత్రువుల చేతిలో ఓడిపోతారని వారితో చెప్పు.”
43 I spoke to you in this way, but you did not listen. You rebelled against the commandment of Yahweh; you were arrogant and attacked the hill country.
౪౩ఆ మాటలు నేను మీతో చెప్పినా మీరు వినకుండా యెహోవా మాటకు ఎదురు తిరిగి మూర్ఖంగా ఆ కొండ ప్రాంతానికి వెళ్ళారు.
44 But the Amorites, who lived in that hill country, came out against you and chased you like bees, and struck you down in Seir, as far as Hormah.
౪౪అప్పుడు అక్కడ ఉన్న అమోరీయులు మీకెదురు వచ్చి, కందిరీగల్లాగా మిమ్మల్ని హోర్మా వరకూ తరిమి శేయీరులో మిమ్మల్ని హతం చేశారు.
45 You returned and wept before Yahweh; but Yahweh did not listen to your voice, nor did he pay attention to you.
౪౫తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిలో ఏడ్చారు. అయినా యెహోవా మిమ్మల్ని లెక్కచేయలేదు, మీ మాట వినలేదు.
46 So you stayed in Kadesh many days, all the days that you stayed there.
౪౬కాబట్టి మీరు కాదేషులో చాలా రోజులు ఉండిపోయారు. అక్కడ ఎన్ని రోజులు నివసించారో మీకు తెలుసు.