< Deuteronomy 16 >
1 Observe the month of Abib, and keep the Passover to Yahweh your God, for in the month of Aviv Yahweh your God brought you out of Egypt by night.
౧“మీరు ఆబీబు నెలలో పండగ ఆచరించి మీ యెహోవా దేవునికి పస్కా పండగ జరిగించాలి. ఎందుకంటే ఆబీబు నెలలో రాత్రివేళ మీ యెహోవా దేవుడు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించాడు.
2 You will sacrifice the Passover to Yahweh your God with some of the flock and the herd in the place that Yahweh will choose as his sanctuary.
౨యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలంలోనే మీ యెహోవా దేవునికి పస్కా ఆచరించి, గొర్రెలను, మేకలను, ఆవులను బలి అర్పించాలి.
3 You will eat no leavened bread with it; seven days will you eat unleavened bread with it, the bread of affliction; for you came out of the land of Egypt in haste. Do this all the days of your life so that you may call to mind the day when you came out of the land of Egypt.
౩పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి.
4 No yeast must be seen among you within all your borders during seven days; nor must any of the meat that you sacrifice in the evening on the first day remain until the morning.
౪మీ పరిసరాల్లో ఏడు రోజులపాటు పొంగినది ఏదీ కనిపించకూడదు. అంతేకాదు, మీరు మొదటి రోజు సాయంత్రం వధించిన దాని మాంసంలో కొంచెం కూడా ఉదయం వరకూ మిగిలి ఉండకూడదు.
5 You may not sacrifice the Passover within any of your city gates that Yahweh your God is giving you.
౫మీ దేవుడు యెహోవా మీకిస్తున్న పట్టణాల్లో ఏదో ఒక దానిలో పస్కా పశువును వధించకూడదు.
6 Instead, sacrifice at the place that Yahweh your God will choose as his sanctuary. There you will perform the sacrifice of the Passover in the evening at the going down of the sun, at the time of year that you came out of Egypt.
౬మీ దేవుడు యెహోవా తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకునే స్థలం లోనే, మీరు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే సాయంత్రం వేళలో పస్కా పశువును వధించాలి.
7 You must roast it and eat it at the place that Yahweh your God will choose; in the morning you will turn and go to your tents.
౭అదే స్థలం లో దాన్ని కాల్చి, తిని, ఉదయాన్నే తిరిగి మీ గుడారాలకు వెళ్ళాలి. ఆరు రోజులపాటు మీరు పొంగని రొట్టెలు తినాలి.
8 For six days you will eat unleavened bread; on the seventh day there will be a solemn assembly for Yahweh your God; on that day you must do no work.
౮ఏడవరోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు.
9 You will count seven weeks for yourselves; from the time you begin to put the sickle to the standing grain you must start counting seven weeks.
౯మీరు ఏడు వారాలు లెక్కబెట్టండి. పంట చేను మీద కొడవలి వేసింది మొదలు ఏడు వారాలు లెక్కబెట్టండి.
10 You must keep the Festival of Weeks for Yahweh your God with the contribution of a freewill offering from your hand that you will give, according as Yahweh your God has blessed you.
౧౦మీ యెహోవా దేవునికి వారాల పండగ ఆచరించడానికి మీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచాలి. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ దాన్ని ఇవ్వాలి.
11 You will rejoice before Yahweh your God—you, your son, your daughter, your male servant, your female servant, the Levite who is within your city gates, and the foreigner, the fatherless, and the widow who are among you, at the place that Yahweh your God will choose for his sanctuary.
౧౧అప్పుడు మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉన్న లేవీయులు, మీ మధ్య ఉన్న పరదేశులు, అనాథలు, వితంతువులు మీ యెహోవా దేవుడు తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం లో ఆయన సన్నిధిలో సంతోషించాలి.
12 You will call to mind that you were a slave in Egypt; you must observe and do these statutes.
౧౨మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని, ఈ కట్టడలను పాటించి అమలు జరపాలి.
13 You must keep the Festival of Shelters for seven days after you have gathered in the harvest from your threshing floor and from your winepress.
౧౩మీ కళ్ళంలో నుండి ధాన్యాన్ని, మీ తొట్టిలో నుండి ద్రాక్షరసాన్ని తీసినప్పుడు పర్ణశాలల పండగను ఏడు రోజులపాటు ఆచరించాలి.
14 You will rejoice during your festival—you, your son, your daughter, your male servant, your female servant, the Levite, and the foreigner, and the fatherless and the widow who are within your gates.
౧౪ఈ పండగలో మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఆవరణలో నివసించే లేవీయులు, పరదేశులు, అనాథలు, వితంతువులు సంతోషించాలి.
15 For seven days you must observe the festival for Yahweh your God at the place that Yahweh will choose, because Yahweh your God will bless you in all your harvest and all the work of your hands, and you must be completely joyful.
౧౫మీ యెహోవా దేవుడు మీ రాబడి అంతటిలో, మీ చేతిపనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వస్తాడు. కనుక ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీ యెహోవా దేవునికి ఏడురోజులు పండగ చేసుకుని మీరు అధికంగా సంతోషించాలి.
16 Three times in a year all your males must appear before Yahweh your God at the place that he will choose: at the Festival of Unleavened Bread, at the Festival of Weeks, and at the Festival of Shelters. No one will appear before Yahweh empty-handed;
౧౬సంవత్సరానికి మూడుసార్లు, అంటే పొంగని రొట్టెల పండగలో, వారాల పండగలో, పర్ణశాలల పండగలో మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలం లో మీలో ఉన్న పురుషులందరూ ఆయన సన్నిధిలో కనిపించాలి.
17 instead, every man will give as he is able, that you might know the blessing that Yahweh your God has given to you.
౧౭వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనిపించకుండా, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన ప్రకారం ప్రతివాడూ తన శక్తి కొలదీ ఇవ్వాలి.
18 You must make judges and officers within all your city gates that Yahweh your God is giving you; they will be taken from each of your tribes, and they must judge the people with righteous judgment.
౧౮మీ యెహోవా దేవుడు మీకు ఇస్తున్న మీ పట్టణాలన్నిటిలో మీ గోత్రాలకు న్యాయాధిపతులనూ నాయకులనూ నియమించుకోవాలి. వారు న్యాయంగా ప్రజలకు తీర్పుతీర్చాలి.
19 You must not take justice away by force; you must not show partiality nor take a bribe, for a bribe blinds the eyes of the wise and perverts the words of the righteous.
౧౯మీరు న్యాయం తప్పి తీర్పుతీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఎందుకంటే లంచం జ్ఞానులను గుడ్డివారుగా చేసి, నీతిమంతుల మాటలను వక్రీకరిస్తుంది.
20 You must follow after justice, after justice alone, so that you may live and inherit the land that Yahweh your God is giving you.
౨౦మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని జీవించగలిగేలా మీరు కేవలం న్యాయాన్నే జరిగించాలి.
21 You must not set up for yourselves an Asherah, any sort of pole, beside the altar of Yahweh your God that you will make for yourself.
౨౧యెహోవా దేవునికి మీరు కట్టే బలిపీఠం దగ్గరగా ఏ విధమైన చెట్టును నాటకూడదు, దేవతా స్తంభాన్నీ నిలబెట్టకూడదు.
22 Neither must you set up for yourself any sacred stone pillar, which Yahweh your God hates.
౨౨మీ యెహోవా దేవుడు విగ్రహాన్ని ద్వేషించేవాడు కాబట్టి మీరు ఏ స్తంభాన్నీ నిలబెట్టకూడదు.”