< 2 Chronicles 28 >

1 Ahaz was twenty years old when he began to reign, and he reigned sixteen years in Jerusalem. He did not do what was right in the eyes of Yahweh, as David his ancestor had done.
ఆహాజు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు 20 ఏళ్ళు. అతడు యెరూషలేములో 16 ఏళ్ళు పాలించాడు. అతడు తన పూర్వికుడు దావీదులాగా యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించలేదు.
2 Instead, he walked in the ways of the kings of Israel; he also made cast metal figures for the Baals.
అతడు ఇశ్రాయేలు రాజుల విధానాల్లోనే నడిచి, బయలు దేవుడికి పోతవిగ్రహాలను చేయించాడు.
3 In addition, he burned incense in the Valley of Ben Hinnom and he caused his children to pass through the fire, according to the idolatrous practices of the people that Yahweh forced out of their land before the people of Israel.
బెన్‌ హిన్నోము లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటనుంచి యెహోవా తోలివేసిన ప్రజల నీచమైన అలవాట్ల ప్రకారం తన కొడుకులను దహనబలిగా అర్పించాడు.
4 He sacrificed and burned incense at the high places and on the hills and under every green tree.
అతడు ఎత్తయిన పూజా స్థలాలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కింద, బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చాడు.
5 Therefore Yahweh the God of Ahaz gave him into the hand of the king of Aram. The Arameans defeated him and carried away from him a great crowd of prisoners, bringing them to Damascus. Ahaz was also given into the hand of the king of Israel who defeated him in a great slaughter.
అందుచేత అతని దేవుడైన యెహోవా అతణ్ణి అరాము రాజు చేతికి అప్పగించాడు. అరామీయులు అతణ్ణి ఓడించి అతని ప్రజల్లో చాలమందిని బందీలుగా తీసుకుని దమస్కు తీసుకుపోయారు. యెహోవా అతణ్ణి ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించాడు. ఆ రాజు అతణ్ణి ఓడించాడు.
6 For Pekah son of Remaliah in one day killed 120,000 soldiers in Judah and all of them were powerful men, because they had forsaken Yahweh the God of their ancestors.
రెమల్యా కొడుకు పెకహు ఇశ్రాయేలు రాజు యూదా సైనికుల్లో పరాక్రమశాలురైన 1, 20,000 మందిని ఒక్కరోజే చంపేసాడు. యూదా వారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టినందువల్ల అలా జరిగింది.
7 Zicri, a powerful man from Ephraim, killed Maaseiah the king's son, Azrikam, the official over the palace, and Elkanah, who was next to the king.
జిఖ్రీ అనే పరాక్రమశాలియైన ఎఫ్రాయిమీయుడు రాజ కుమారుడు మయశేయానూ రాజ భవన అధికారి అజ్రీకామునూ రాజు తరువాత ప్రముఖుడు ఎల్కనానూ చంపేసాడు.
8 The army of Israel took captive from their relatives 200,000 wives, sons, and daughters. They also took much plunder, which they carried back to Samaria.
ఇశ్రాయేలువారు తమ సోదరులైన యూదావారి దగ్గరనుంచి వారి భార్యలనూ కొడుకులనూ కూతుళ్ళనూ 2,00,000 మందిని బందీలుగా తీసుకుపోయారు. వారి దగ్గర నుంచి విస్తారమైన కొల్లసొమ్ము దోచుకుని దాన్ని షోమ్రోనుకు తెచ్చారు.
9 But a prophet of Yahweh was there, his name was Oded. He went out to meet the army coming into Samaria. He said to them, “Because Yahweh, the God of your ancestors, was angry with Judah, he gave them into your hand. But you have slaughtered them in a rage that reached up to heaven.
అయితే యెహోవా ప్రవక్త ఒకడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఓదేదు. అతడు షోమ్రోనుకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్ళాడు. వారితో ఇలా చెప్పాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించాడు. కాబట్టి ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. అయితే మీరు మిన్నంటే క్రోధంతో వారిని చంపేశారు.
10 Now you intend to keep the men and women of Judah and Jerusalem as your slaves. But are you not guilty of sins of your own against Yahweh your God?
౧౦ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము నివాసులను బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకుండా ఉంటారా?
11 Now then, listen to me: Send the prisoners back, those whom you have taken of your own brothers, for Yahweh's fierce wrath is on you.”
౧౧అయితే ఇప్పుడు నా మాట వినండి. యెహోవా కోపం మీ మీద తీవ్రంగా ఉంది కాబట్టి, మీ సొంత సోదరుల్లోనుంచి మీరు బందీలుగా తెచ్చిన వీరిని విడిచిపెట్టండి.”
12 Then certain leaders of the people of Ephraim—Azariah son of Jehohanan, Berechiah son of Meshillemoth, Jehizkiah son of Shallum, and Amasa son of Hadlai, stood up against those who came back from the war.
౧౨అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దల్లో యోహానాను కొడుకు అజర్యా, మెషిల్లేమోతు కొడుకు బెరెక్యా, షల్లూము కొడుకు యెహిజ్కియా, హద్లాయి కొడుకు అమాశా అనేవారు యుద్ధం నుంచి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇలా అన్నారు.
13 They said to them, “You must not bring the prisoners here, for you intend something that will bring on us sin against Yahweh, to add to our sins and trespasses, for our trespass is great, and there is fierce wrath against Israel.”
౧౩“యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించేలా మీరు చేశారు. బందీలుగా పట్టుకున్న వీరిని మీరు ఇక్కడికి రప్పించ వద్దు. మన పాపాలను, అపరాధాలను ఇంకా ఎక్కువ చేసుకోడానికి మీరు చూస్తున్నట్టుంది. ఇప్పటికే మనం ఎంతో పాపం చేశాము. ఇశ్రాయేలు మీద యెహోవా, తీవ్రమైన కోపంతో ఉన్నాడు.”
14 So the armed men left the prisoners and the plunder before the leaders and all the assembly.
౧౪కాబట్టి పెద్దల సమక్షంలో, సమాజమంతటి సమక్షంలో సైనికులు ఆ బందీలనూ కొల్లసొమ్మునూ విడిచిపెట్టారు.
15 The men who were assigned by name got up and took the prisoners, and clothed all who were naked among them with the plunder. They clothed them and gave them sandals. They gave them food to eat and drink. They treated their wounds and put the weak ones on donkeys. They took them back to their families in Jericho, (called the City of Palms). Then they returned to Samaria.
౧౫పేరును బట్టి పని అప్పగించబడిన వారు లేచి బందీల్లో నగ్నంగా ఉన్న వారందరికీ బట్టలు వేయించి చెప్పులు ఇచ్చారు. వారికి భోజనం, మంచినీళ్ళు ఇచ్చారు. వారి గాయాలు కడిగి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించారు. వారిని తమ ఖర్జూర చెట్ల పట్టణం అయిన యెరికోకు, వారి కుటుంబాలకు చేర్చారు. తరువాత వారు షోమ్రోనుకు తిరిగి వెళ్ళారు.
16 At that time King Ahaz sent messengers to the kings of Assyria to ask them to help him.
౧౬ఆ కాలంలో ఎదోమీయులు మళ్ళీ వచ్చి యూదాదేశాన్ని పాడుచేసి కొందరిని బందీలుగా తీసుకుపోయారు.
17 For once again the Edomites had come and attacked Judah, carrying prisoners away.
౧౭రాజైన ఆహాజు తనకు సహాయం చేయమని అష్షూరు రాజుల దగ్గరికి కబురు పంపాడు.
18 The Philistines also invaded the cities of the lowlands and of the Negev of Judah. They took Beth Shemesh, Aijalon, Gederoth, Soko with its villages, Timnah with its villages, and also Gimzo with its villages. They went to live in those places.
౧౮ఫిలిష్తీయులు మైదానాల ప్రాంతంలోని పట్టణాలనూ యూదాలోని నెగేవునూ ఆక్రమించారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో దాని గ్రామాలనూ తిమ్నా దాని గ్రామాలనూ గిమ్జో దాని గ్రామాలనూ ఆక్రమించుకుని అక్కడ నివసించారు.
19 For Yahweh brought Judah low because of Ahaz, king of Israel; for he had acted wickedly in Judah and had sinned against Yahweh very heavily.
౧౯ఆహాజు యూదాదేశంలో విగ్రహాలను పూజించి యెహూవా పట్ల ద్రోహం చేశాడు కాబట్టి యెహోవా ఇశ్రాయేలు రాజు ఆహాజు చేసిన దాన్నిబట్టి యూదాను అణచివేశాడు.
20 Tiglath-Pileser, king of Assyria, came to him and troubled him instead of strengthening him.
౨౦అష్షూరురాజు తిగ్లతు పిలేసెరు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి బలపరచడానికి బదులు బాధపరచాడు.
21 For Ahaz plundered the house of Yahweh and the houses of the king and the leaders, to give the valuable things to the kings of Assyria. But doing this did not benefit him.
౨౧ఆహాజు, యెహోవా మందిరంలో నుంచి, రాజ భవనంలో నుంచి, అధికారుల దగ్గర నుంచి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకిచ్చాడు, కానీ దాని వల్ల కూడా అతనికి ఏ ప్రయోజనమూ లేక పోయింది.
22 This same King Ahaz sinned even more against Yahweh in his time of suffering.
౨౨తనకు కలిగిన ఆపద సమయంలో ఆహాజు రాజు యెహోవా దృష్టిలో ఇంకా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించాడు.
23 For he sacrificed to the gods of Damascus, gods that had defeated him. He said, “Because the gods of the kings of Aram helped them, I will sacrifice to them, so that they might help me.” But they were the ruin of him and of all Israel.
౨౩ఎలాగంటే “అరాము రాజుల దేవుళ్ళు వారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వాటి సహాయం నాకు కూడా కలిగేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అనుకుని, తనను ఓడించిన దమస్కు వారి దేవుళ్ళకు బలులు అర్పించాడు. అయితే అవి అతనికీ ఇశ్రాయేలు వారికీ నాశనం కలిగించాయి.
24 Ahaz gathered together the furnishings of the house of God and cut them to pieces. He shut the doors of the house of Yahweh and he made for himself altars in every corner of Jerusalem.
౨౪ఆహాజు దేవుని మందిరపు సామాను పోగు చేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు.
25 In every city of Judah he made high places to burn sacrifices to other gods. He provoked Yahweh, the God of his ancestors, to anger.
౨౫యూదాదేశంలోని పట్టణాలన్నిటిలో అతడు అన్యుల దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి, తన పూర్వీకుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించాడు.
26 Now the rest of his deeds, and all his ways, first and last, see, they are written in the book of the kings of Judah and Israel.
౨౬అతని గురించిన ఇతర విషయాలు, అతని పద్ధతులను గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉన్నాయి.
27 Ahaz slept with his ancestors, and they buried him in the city, in Jerusalem, but they did not bring him into the tombs of the kings of Israel. Hezekiah, his son, became king in his place.
౨౭ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరాడు. అతణ్ణి యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు, గానీ ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతణ్ణి తేలేదు. అతని కొడుకు హిజ్కియా అతనికి బదులు రాజయ్యాడు.

< 2 Chronicles 28 >