< Ezekiel 21 >
1 Yahweh gave me another message. [He said, ]
౧అప్పుడు నాకు యెహోవా వాక్కు వచ్చి ఇలా అన్నాడు,
2 “You human, turn toward Jerusalem. Preach about what will happen to the temple [there]. Preach about what will happen to the Israeli people.
౨“నరపుత్రుడా, యెరూషలేము వైపు నీ ముఖం తిప్పుకుని, వాళ్ళ పవిత్రస్థలాలకూ, ఇశ్రాయేలీయుల దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించు.
3 Say to them, ‘This is what Yahweh says: I am opposed to you.
౩యెహోవా చెప్పేదేమంటే, నేను నీకు విరోధిని. నీతిమంతుడుగాని, దుష్టుడుగాని నీలో ఎవరూ ఉండకుండాా అందరినీ నీనుంచి తెంచివేయడానికి నా కత్తి దూసి ఉన్నాను.
4 [what I will do to you will be as though] [MET] I will pull my sword from its sheath [and strike you]. I will kill everyone, including righteous people and wicked people [DOU]. I will get rid of everyone, from the south to the north.
౪నీతిమంతుడుగాని, దుష్టుడుగాని ఎవరూ నీలో ఉండకుండాా దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ అందరినీ నేను తెంచివేయడానికి నా కత్తి శరీరులందరికీ విరోధంగా బయలుదేరింది.
5 Then everyone will know [it is as though] I, Yahweh, have struck people with my sword, and I will not put it back in its sheath again.’
౫యెహోవానైన నేను నా కత్తి మళ్ళీ ఒరలో పెట్టకుండా దాన్ని దూసి ఉన్నానని ప్రజలందరూ తెలుసుకుంటారు.
6 Therefore, you human, groan! Groan in front of the Israeli people very sadly and sorrowfully [IDM, DOU].
౬కాబట్టి నరపుత్రుడా, మూలుగు. వాళ్ళు చూస్తూ ఉండగా నీ నడుము విరిగేలా దుఃఖంతో మూలుగు.
7 And when they ask you, ‘Why are you groaning?’ tell them, ‘Because of the news that they soon will hear. Everyone will be very fearful [IDM], and their knees will become as weak as [SIM] water. [A great disaster] will soon occur. That is what Yahweh the Lord is promising.’”
౭అప్పుడు ‘నువ్వు ఎందుకు మూలుగుతున్నావు?’ అని వారు అడుగుతారు. అప్పుడు నువ్వు వాళ్ళతో, ‘కష్టదినం వచ్చేస్తోందనే దుర్వార్త నాకు వినిపించింది. అందరి గుండెలూ కరిగిపోతాయి. అందరి చేతులూ బలహీనం అవుతాయి. అందరి మనస్సులూ సొమ్మసిల్లిపోతాయి, అందరి మోకాళ్లు నీరుగారిపోతాయి. ఇంతగా కీడు వస్తూ ఉంది. అది వచ్చేసింది’ అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు.”
8 Yahweh gave me another message. [He said],
౮యెహోవా నాకు ఈ సంగతి మళ్ళీ తెలియజేశాడు.
9 “You human, prophesy and say [to them], ‘This is what Yahweh says: I have sharpened my sword and polished it.
౯“నరపుత్రుడా, ప్రవచించి ఇలా చెప్పు, ‘ప్రభువు చెప్పేదేమంటే, ఒక కత్తి, ఒక కత్తి! అది పదునుపెట్టి ఉంది. అది మెరుగుపెట్టి ఉంది.
10 It is sharpened in order that I can [many people with it]; it is polished so that it will flash like lightning. The people of Judah will not [their being punished like this], but they did not repent [I only struck them] with a stick.
౧౦అది భారీ ఎత్తున వధ చెయ్యడానికి పదును పెట్టి ఉంది! తళతళలాడేలా అది మెరుగుపెట్టి ఉంది! నా కుమారుడి రాజదండం విషయంలో మనం ఆనందించాలా? రాబోతున్న రాబోయే కత్తి అలాంటి ప్రతి దండాన్నీ ద్వేషిస్తుంది!
11 A sword should be polished, and be grasped [in someone’s hand]. It should be sharpened and polished, ready for someone to use it to kill people.
౧౧కాబట్టి ఆ కత్తిని మెరుగు పెట్టడానికి అప్పగించడం జరుగుతుంది. ఆ తరువాత అది చేతికి వస్తుంది. ఆ కత్తి పదునుపెట్టి ఉంది! హతం చేసేవాడి చేతికి ఇవ్వడానికి ఆ కత్తి మెరుగు పెట్టి ఉంది.
12 [So, ] you human, cry and wail, because I will use my sword to kill my people, including the leaders of Israel. They and all the other people, my people, will be killed by swords, so beat your [to show that you are sad].
౧౨నరపుత్రుడా, శోకించు, సాయం కోసం కేకలుపెట్టు! ఆ కత్తి నా ప్రజల మీదకీ, ఇశ్రాయేలీయుల నాయకుల మీదకీ వచ్చింది. కత్తి భయం నా ప్రజలకు కలిగింది గనుక శోకంతో నీ తొడ చరుచుకో!
13 I am about to test my people, and the kings [MTY] of Judah will not escape being punished. That is what I, Yahweh the Lord, say.
౧౩పరీక్ష వచ్చింది. కాని రాజదండం నిలిచి ఉండకపోతే ఎలా?’ ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
14 So, you human, prophesy; clap your [to show that you are very happy about what is going to happen]. My sword will strike them again and again; it is a sword for slaughtering many people, while I attack them from every side.
౧౪నరపుత్రుడా, ప్రవచించి నీ రెండు చేతులు చరుచుకో. కత్తి మూడోసారి కూడా దాడి చేస్తుంది! అది భారీ ఎత్తున వధ కొరకైన కత్తి! అది అనేకమందిని హతం చెయ్యడానికీ, వాళ్ళను అన్నిచోట్లా పొడవడానికీ సిద్ధంగా ఉంది!
15 In order that people will be very much afraid [IDM] and many people will be killed, I have [soldiers holding] my swords at every [city] gate, ready to slaughter people. Those swords will flash like lightning, as the [soldiers] grasp them to slaughter people.
౧౫వాళ్ళ గుండెలు కరిగిపోయేలా, అడ్డంకులు అధికం అయ్యేలా వాళ్ళ గుమ్మాలకు విరోధంగా నేను కత్తి దూసి భారీ ఎత్తున వధ సిద్ధం చేశాను! బాధ! అది మెరుపులా ఉంది. వధ చెయ్యడానికి సిద్ధంగా ఉంది.
16 Their swords [APO] will slash to the right and [then] to the left, whichever way they turn the blades.
౧౬ఓ కత్తీ! కుడివైపు దెబ్బ కొట్టు! ఎడమవైపు దెబ్బ కొట్టు! నీ పదునైన అంచు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లనివ్వు.
17 Then I will clap my [triumphantly]; and [then] I will no longer be angry. [That will surely happen because] I, Yahweh, have said it.’”
౧౭నేను కూడా నా రెండు చేతులు చరుచుకుని, నా ఉగ్రత తీర్చుకుంటాను! యెహోవానైన నేనే ప్రకటిస్తున్నాను.”
18 Yahweh gave me another message. [He said, ]
౧౮యెహోవా నాకీ విషయం మళ్ళీ చెప్పాడు,
19 “You human, [a map], and on it mark two roads for the King of Babylonia to march [along with his army, carrying] their swords. When they depart from their country, they will come to a sign post where the road divides.
౧౯“నరపుత్రుడా, బబులోను రాజు కత్తి రావడానికి రెండు రహదారులు కేటాయించు. ఆ రెండూ, ఒకే దేశంలోనుంచి బయలుదేరుతాయి. ఆ రెండు రహదారుల్లో ఒకటి, ఒక పట్టణానికి వెళ్తుందన్న సూచన రాసి ఉంటుంది.
20 [If they continue on the one road, ] they will attack [city], the capital of the Ammon people-group. [If they continue on the other road, ] they will come to Judah and to Jerusalem, [a city] with walls around it.
౨౦ఒక రహదారి, అమోనీయుల పట్టణమైన రబ్బాకు బబులోను సైన్యం వెళ్ళే మార్గంగా సూచన రాసి పెట్టు. ఇంకొక రహదారి యూదా దేశంలోని ప్రాకారాలుగల పట్టణమైన యెరూషలేముకు ఆ సైన్యాన్ని నడిపించేదిగా సూచన రాసి పెట్టు.
21 [When the army of] Babylonia comes to where the road divides, [they will stop], and the king will perform magic rituals [to decide which road to go on]. He will throw arrows; [then] consult his [about which road to go on], and he will (examine/look at) the [of a sheep].
౨౧రహదారులు చీలే చోట రెండు దారులు చీలే కూడలిలో శకునం చూడడానికి బబులోను రాజు ఆగాడు. అతడు బాణాలు ఇటు అటు ఆడిస్తూ, విగ్రహాలను అడుగుతున్నాడు. అతడు కాలేయం శకునం పరీక్షించి చూస్తున్నాడు!
22 With his right hand he will pick up the arrow marked ‘Jerusalem’. He will [command his soldiers to go to Jerusalem. When they arrive there, they] will set up (rams/devices to [down the walls], ) and [then] the king will give the command for them to slaughter [the people]. They will shout [a battle-cry], and they will set up the rams against the [city] gates. They will build a dirt ramp [against the walls around the city], and set up things to bash those walls.
౨౨యెరూషలేము ఎదుట ద్వారాలను పడగొట్టే పరికరాలు సిద్ధం చెయ్యమనీ, ఊచ కోత ఆరంభించమనీ, యుద్ధధ్వని చెయ్యమనీ, ముట్టడి దిబ్బలు కట్టమనీ అడుగుతున్నాడు. యెరూషలేముగూర్చి తన కుడివైపు శకునం కనిపించింది!
23 The [in Jerusalem] who had promised [to be loyal to the King of Babylonia will think that those rituals must be wrong. They will think that his army should not be attacking them]. But he will remind them of the sins [MTY] that they had committed, [his army] will capture them.
౨౩బబులోనీయులతో ఒప్పందం చేసుకున్న వాళ్ల కళ్ళకు ఈ శకునం వ్యర్ధంగా కనిపిస్తుంది! కాని ఆ రాజు వాళ్ళను పట్టుకోవడం కోసం, వాళ్ళు ఆ ఒప్పందం మీరారు అన్న నెపం వాళ్ళ మీద మోపుతాడు.”
24 Therefore, [tell the Israeli people that] this is what Yahweh the Lord says: ‘You people have allowed everyone to see that you are openly [against the King of Babylonia], and by doing that you have shown that everything that you do is sinful. Therefore you will be captured and [to Babylonia].’
౨౪కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీ దోషం మీరు నా జ్ఞాపకానికి తెచ్చిన కారణంగా మీ అతిక్రమం వెల్లడి ఔతుంది. మీ క్రియలన్నిట్లో మీ పాపం కనిపిస్తుంది. ఈ కారణంగా, మీ శత్రువు చేతికి మీరు దొరుకుతారని మీరు అందరికీ గుర్తు చేస్తారు!
25 Also, say, ‘You very wicked [DOU] king of Israel, it is your [to die]. It is the time for you to be punished.’
౨౫అపవిత్రుడా నీ శిక్షా దినం దగ్గర పడింది. ఇశ్రాయేలీయుల పాలకుడా, అపవిత్రం చేసే కాలం ముగింపుకు వచ్చిన వాడా,
26 And this is what Yahweh the Lord says [to you soldiers from Babylonia]: ‘Take off [the king’s] turban and his crown, because now things will be different than they were [before]. [in Jerusalem] who had no authority will now be given authority, and those who had authority will have their authority taken from them.
౨౬ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నీ తలపాగా, నీ కిరీటం తీసివేయి. సంగతులు ఇదివరకులాగా ఇకపై ఉండవు. ఇక తక్కువ వాళ్ళను గొప్ప వాళ్ళనుగానూ, గొప్ప వాళ్ళను తక్కువ వాళ్ళనుగానూ చెయ్యి.
27 [Jerusalem] will be completely ruined. I will cause it to be ruined, and it will not be rebuilt/restored until the king to whom the city truly belongs comes; I will give it to [to rule it].’”
౨౭నేను అంతటినీ శిథిలం చేస్తాను! శిథిలం చేస్తాను! ఆ కిరీటం ఇంక ఉనికిలో ఉండదు. దానికి రాజుగా ఉండే అసలైన హక్కు ఉన్నవాడు వచ్చే వరకూ అది కనిపించదు. అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.”
28 “And, you human, prophesy and say [this]: 'This is what Yahweh the Lord says about the Ammon people-group, and about what they have said to insult [Israel]: [“The King of Babylon says, ] ‘[My soldiers have] swords’ [APO]; they have pulled out those swords to slaughter many people. They have polished them in order to kill people, and to make those swords flash like lightning.
౨౮నరపుత్రుడా నువ్వు ప్రవచించి ఇలా చెప్పు. “అమ్మోనీయులను గూర్చీ, వాళ్ళ అపకీర్తిని గూర్చీ ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఒక కత్తి! ఒక కత్తి దూసి ఉంది! పదును పెట్టిన కత్తి భారీగా వధ చెయ్యడానికి దూసి ఉంది, అది ఒక మెరుపులా ఉంది!
29 [Your prophets] have given you false visions about [what will happen to] you, and they have given you messages that are not true. So swords will strike the necks of those wicked people; it is time for them to be killed; it is the day when they will be [for their sins].
౨౯శకునం చూసేవాళ్ళు నీ కోసం దొంగ దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు వ్యర్థమైన వాటిని నీకు చెప్తూ ఉన్నప్పుడు, ఈ కత్తి చావడానికి సిద్ధంగా ఉన్న ఆ దుష్టుల మెడల మీద ఉంటుంది. ఆ దుష్టుల శిక్షా దినం వచ్చింది. వాళ్ళు అతిక్రమం చేసే సమయం ముగిసింది.
30 You must put your swords back in their sheaths [because the days for you to slaughter your enemies are ended]. I will judge those people in the country where they were born.
౩౦మళ్ళీ కత్తి ఒరలో పెట్టు. నువ్వు సృష్టి అయిన స్థలంలోనే, నువ్వు పుట్టిన దేశంలోనే నేను నీకు తీర్పు తీరుస్తాను!
31 I will pour out my punishment [MTY] on them. Because I am very angry with them, my breath on them will scorch them [like] fire [MET]. I will allow brutal men to capture them, men who are experts in killing people.
౩౧నా కోపం నీ మీద కుమ్మరిస్తాను. నా ఉగ్రతాగ్నిని నీ మీద రాజేస్తాను. నాశనం చెయ్యడంలో ప్రవీణులైన క్రూరులకు నిన్ను అప్పగిస్తాను.
32 You will be [like] fuel [MET] [that is burned] in a fire. Your blood will be shed in your own land. No one will remember you any more. [That will surely happen because] I, Yahweh, have said it.” '”
౩౨ఆ అగ్నికి నువ్వు ఇంధనం ఔతావు. దేశంలో నీ రక్తం కారుతుంది. నువ్వు ఎప్పటికీ జ్ఞాపకానికి రావు. యెహోవానైన నేనే ఇది ప్రకటించాను.”