< Esther 10 >
1 King Xerxes required that all the people in his empire pay taxes. Even the people who lived on the islands [in the Mediterranean Sea] (OR, in coastal areas) were required to pay taxes.
౧రాజైన అహష్వేరోషు తన రాజ్యం మీదా సముద్ర తీర ప్రాంతాల మీదా పన్ను విధించాడు.
2 And all the great and powerful things that Xerxes did were written in the scroll called/entitled ‘The record of the things done by the kings of Media and Persia’. In this book were also written [the things done] by Mordecai, the man whom the king had greatly honored.
౨అతని బలప్రభావాల మూలంగా కలిగిన విజయాల గురించీ, రాజు మొర్దెకైని గొప్ప పదవుల్లో ఉంచిన కారణంగా మొర్దెకై ఎంత ఘనత పొందాడో ఆ విషయాల గురించీ మాదీయుల, పారసీకుల రాజ్య సమాచార గ్రంథంలో రాశారు.
3 Mordecai, who was a Jew, became the king’s most important official, and [all] the Jews also considered him to be a very great man. They [all] respected him, because he did many good things for the Jews, and he often asked [the king] to do good things for them.
౩యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతి గాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకొంటూ తనవారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.