< Psalms 127 >
1 song [the] step to/for Solomon if: until LORD not to build house: home vanity: vain to toil to build him in/on/with him if: until LORD not to keep: guard city vanity: vain to watch to keep: guard
౧సొలొమోను రాసిన యాత్రల కీర్తన యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టే వారు పాటుబడడం వ్యర్ధం. యెహోవా పట్టణానికి కావలిగా ఉండకపోతే దాన్ని కాపలా కాసేవాళ్ళు నిలబడి ఉండడం వ్యర్ధం.
2 vanity: vain to/for you to rise to arise: rise to delay to dwell to eat food: bread [the] toil so to give: give to/for beloved his sleep
౨మీరు తెల్లారే లేచి చాలా ఆలస్యంగా ఇంటికి వస్తూ, కష్టపడి పని చేసి ఆహారం తింటూ ఉండడం వ్యర్ధం. దేవుడు తనకిష్టమైన వారికి నిద్రనిస్తున్నాడు.
3 behold inheritance LORD son: child wages fruit [the] belly: womb
౩చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.
4 like/as arrow in/on/with hand mighty man so son: child [the] youth
౪యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు శూరుడి చేతిలోని బాణాల వంటివాళ్ళు.
5 blessed [the] great man which to fill [obj] quiver his from them not be ashamed for to speak: speak with enemy in/on/with gate
౫వారితో తన అంబులపొది నింపుకున్న మనిషి ధన్యుడు. వాళ్ళు గుమ్మంలో తమ విరోధులను ఎదిరించి నిలబడినప్పుడు అవమానం పాలు కారు.