< Joshua 10 >
1 and to be like/as to hear: hear Adoni-zedek Adoni-zedek king Jerusalem for to capture Joshua [obj] [the] Ai and to devote/destroy her like/as as which to make: do to/for Jericho and to/for king her so to make: do to/for Ai and to/for king her and for to ally to dwell Gibeon with Israel and to be in/on/with entrails: among their
౧యెహోషువ యెరికోనూ, దాని రాజునూ నిర్మూలం చేసినట్టు హాయినీ దాని రాజునూ నిర్మూలం చేసిన సంగతీ గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతీ యెరూషలేం రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడూ అతని ప్రజలూ చాలా భయపడ్డారు.
2 and to fear much for city great: large Gibeon like/as one city [the] kingdom and for he/she/it great: large from [the] Ai and all human her mighty man
౨ఎందుకంటే గిబియోనును నాటి రాజధానుల్లో ప్రధాన పట్టణంగా ఎంచేవారు. అది హాయి కంటే పెద్దది, అక్కడి ప్రజలందరూ శూరులు. కాబట్టి యెరూషలేము రాజైన అదోనీసెదెకు “గిబియోనీయులు యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు. మీరు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తే మనం వారి పట్టణాన్ని నాశనం చేద్దాం” అని
3 and to send: depart Adoni-zedek Adoni-zedek king Jerusalem to(wards) Hoham king Hebron and to(wards) Piram king Jarmuth and to(wards) Japhia king Lachish and to(wards) Debir king Eglon to/for to say
౩హెబ్రోను రాజు హోహాముకూ యర్మూతు రాజు పిరాముకూ
4 to ascend: rise to(wards) me and to help me and to smite [obj] Gibeon for to ally with Joshua and with son: descendant/people Israel
౪లాకీషురాజు యాఫీయకూ ఎగ్లోను రాజు దెబీరుకూ వార్త పంపాడు.
5 and to gather and to ascend: rise five king [the] Amorite king Jerusalem king Hebron king Jarmuth king Lachish king Eglon they(masc.) and all camp their and to camp upon Gibeon and to fight upon her
౫కాబట్టి అమోరీయుల ఐదుగురు రాజులూ కలిసి, తమ సేనలతో బయలుదేరి, గిబియోను ముందు దిగి, గిబియోనీయులతో యుద్ధం చేశారు.
6 and to send: depart human Gibeon to(wards) Joshua to(wards) [the] camp [the] Gilgal [to] to/for to say not to slacken hand your from servant/slave your to ascend: rise to(wards) us haste and to save [emph?] to/for us and to help us for to gather to(wards) us all king [the] Amorite to dwell [the] mountain: hill country
౬అప్పుడు “గిబియోనీయుల కొండ ప్రాంతాల్లో నివసించే అమోరీయుల రాజులందరూ ఏకమై మాపైకి దండెత్తి వచ్చారు, కాబట్టి నీ దాసుల చెయ్యి విడిచిపెట్టక త్వరగా వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించు” అని గిల్గాలులో శిబిరంలో ఉన్న యెహోషువకు వార్త పంపారు.
7 and to ascend: rise Joshua from [the] Gilgal he/she/it and all people [the] battle with him and all mighty man [the] strength
౭వెంటనే యెహోషువ, అతని దగ్గరున్న యోధులూ, పరాక్రమవంతులైన శూరులూ అందరూ గిల్గాలు నుండి బయలుదేరారు.
8 and to say LORD to(wards) Joshua not to fear from them for in/on/with hand: power your to give: give them not to stand: stand man: anyone from them in/on/with face: before your
౮అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు” అని యెహోషువతో చెప్పగానే,
9 and to come (in): come to(wards) them Joshua suddenly all [the] night to ascend: rise from [the] Gilgal
౯యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతా నడచి వారి మీద హఠాత్తుగా దాడి చేశాడు.
10 and to confuse them LORD to/for face: before Israel and to smite them wound great: large in/on/with Gibeon and to pursue them way: road ascent Beth-horon Beth-horon and to smite them till Azekah and till Makkedah
౧౦అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.
11 and to be in/on/with to flee they from face: before Israel they(masc.) in/on/with descent Beth-horon Beth-horon and LORD to throw upon them stone great: large from [the] heaven till Azekah and to die many which to die in/on/with stone [the] hail from whence to kill son: descendant/people Israel in/on/with sword
౧౧వారు ఇశ్రాయేలీయుల నుండి బేత్‌హోరోనుకు దిగిపోయే తోవలో పారిపోతుండగా, వారు అజేకాకు వచ్చే వరకూ యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగళ్ళను వారి మీద కురిపించాడు. కాబట్టి వారు దాని వల్ల చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తితో చంపిన వారికంటే ఆ వడగండ్ల వలన చచ్చినవారు ఎక్కువమంది అయ్యారు.
12 then to speak: speak Joshua to/for LORD in/on/with day to give: give LORD [obj] [the] Amorite to/for face: before son: descendant/people Israel and to say to/for eye: seeing Israel sun in/on/with Gibeon to silence: stationary and moon in/on/with valley Aijalon
౧౨యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.”
13 and to silence: stationary [the] sun and moon to stand: stand till to avenge nation enemy his not he/she/it to write upon scroll: book [the] Jashar and to stand: stand [the] sun in/on/with half [the] heaven and not to hasten to/for to come (in): (sun)set like/as day unblemished: complete
౧౩“ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
14 and not to be like/as day [the] he/she/it to/for face: before his and after him to/for to hear: hear LORD in/on/with voice man for LORD to fight to/for Israel
౧౪యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
15 and to return: return Joshua and all Israel with him to(wards) [the] camp [the] Gilgal [to]
౧౫అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.
16 and to flee five [the] king [the] these and to hide in/on/with cave in/on/with Makkedah
౧౬ఆ రాజులు ఐదు గురూ పారిపోయి మక్కేదాలో ఉన్న గుహలో దాక్కున్నారు.
17 and to tell to/for Joshua to/for to say to find five [the] king to hide in/on/with cave in/on/with Makkedah
౧౭మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
18 and to say Joshua to roll stone great: large to(wards) lip [the] cave and to reckon: overseer upon her human to/for to keep: guard them
౧౮యెహోషువ “ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.
19 and you(m. p.) not to stand: stand to pursue after enemy your and to cut off the tail [obj] them not to give: allow them to/for to come (in): come to(wards) city their for to give: give them LORD God your in/on/with hand: power your
౧౯మీరు అక్కడే ఆగిపోకండి. మీ దేవుడు యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు కాబట్టి వారిని తమ పట్టణాల్లోకి తిరిగి వెళ్లనీయకుండా వారిని తరిమి, వెనుక ఉన్న వారిని కూల్చండి” అని చెప్పాడు.
20 and to be like/as to end: finish Joshua and son: descendant/people Israel to/for to smite them wound great: large much till to finish they and [the] survivor to escape from them and to come (in): come to(wards) city [the] fortification
౨౦వారు పూర్తిగా నశించే వరకూ యెహోషువ, ఇశ్రాయేలీయులు గొప్ప జనసంహారం చేసి వారిని వధించిన తరువాత వారిలో తప్పించుకొన్న కొద్దిమంది, ప్రాకారాలు ఉన్న పట్టణాల్లోకి చొరబడిపోయారు.
21 and to return: return all [the] people to(wards) [the] camp to(wards) Joshua Makkedah in/on/with peace: well-being not to decide to/for son: descendant/people Israel to/for man: anyone [obj] tongue his
౨౧ప్రజలందరూ మక్కేదాలో శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి సురక్షితంగా తిరిగి వచ్చారు. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడటానికి ఎవరికీ గుండెల్లేక పోయాయి.
22 and to say Joshua to open [obj] lip [the] cave and to come out: send to(wards) me [obj] five [the] king [the] these from [the] cave
౨౨యెహోషువ “ఆ గుహకు అడ్దం తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నాదగ్గరికి తీసుకు రండి” అని చెప్పగానే,
23 and to make: do so and to come out: send to(wards) him [obj] five [the] king [the] these from [the] cave [obj] king Jerusalem [obj] king Hebron [obj] king Jarmuth [obj] king Lachish [obj] king Eglon
౨౩వారు అలా చేసి, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు-ఈ ఐదుగురినీ ఆ గుహలో నుండి అతని దగ్గరికి తీసుకువచ్చారు.
24 and to be like/as to come out: send they [obj] [the] king [the] these to(wards) Joshua and to call: call to Joshua to(wards) all man Israel and to say to(wards) chief human [the] battle [the] to go: went with him to present: come to set: put [obj] foot your upon neck [the] king [the] these and to present: come and to set: put [obj] foot their upon neck their
౨౪వారు ఆ రాజులను యెహోషువ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, తనతో యుద్ధానికి వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో “మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడలపై మీ పాదాలను ఉంచండి” అని చెప్పగా, వారు దగ్గరికి వచ్చి వారి మెడలపై తమ పాదాలను ఉంచారు.
25 and to say to(wards) them Joshua not to fear and not to to be dismayed to strengthen: strengthen and to strengthen for thus to make: do LORD to/for all enemy your which you(m. p.) to fight [obj] them
౨౫అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.
26 and to smite them Joshua after so and to die them and to hang them upon five tree and to be to hang upon [the] tree till [the] evening
౨౬తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరితీశాడు, వారి శవాలు సాయంకాలం వరకూ ఆ చెట్ల మీద వేలాడుతూనే ఉన్నాయి.
27 and to be to/for time to come (in): (sun)set [the] sun to command Joshua and to go down them from upon [the] tree and to throw them to(wards) [the] cave which to hide there and to set: make stone great: large upon lip [the] cave till bone: same [the] day [the] this
౨౭పొద్దుగుంకే సమయంలో యెహోషువ అనుమతి ఇయ్యగా ప్రజలు చెట్ల మీద నుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడేసి ఆ గుహ ద్వారం దగ్గర పెద్ద రాళ్లను వేశారు. ఆ రాళ్లు ఈ రోజు వరకూ ఉన్నాయి.
28 and [obj] Makkedah to capture Joshua in/on/with day [the] he/she/it and to smite her to/for lip: edge sword and [obj] king her to devote/destroy [obj] them and [obj] all [the] soul: person which in/on/with her not to remain survivor and to make: do to/for king Makkedah like/as as which to make: do to/for king Jericho
౨౮ఆ రోజు యెహోషువ మక్కేదాను వశం చేసుకుని దాని రాజుతో సహా అందులోని వారందరినీ కత్తితో చంపేశాడు. అతడు దానిలో ఎవరినీ ప్రాణాలతో వదలకుండా నిర్మూలం చేసాడు. యెరికో రాజుకు చేసినట్టు మక్కేదా రాజుకూ చేశాడు.
29 and to pass Joshua and all Israel with him from Makkedah Libnah and to fight with Libnah
౨౯యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నావారితో యుద్ధం చేశారు.
30 and to give: give LORD also [obj] her in/on/with hand: power Israel and [obj] king her and to smite her to/for lip: edge sword and [obj] all [the] soul: person which in/on/with her not to remain in/on/with her survivor and to make: do to/for king her like/as as which to make: do to/for king Jericho
౩౦యెహోవా దానినీ, దాని రాజునూ, ఇశ్రాయేలీయులకు అప్పగించగా వారు ఎవ్వరూ మిగలకుండా దాన్నీ, దానిలో ప్రాణాలతో ఉన్నవారందరినీ కత్తితో చంపేశారు. అతడు యెరికో రాజుకు చేసినట్టు దాని రాజుకూ చేశారు.
31 and to pass Joshua and all Israel with him from Libnah Lachish [to] and to camp upon her and to fight in/on/with her
౩౧తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులందరితో లిబ్నా నుండి లాకీషుకు వచ్చి అక్కడ దిగి లాకీషు వారితో యుద్దం చేయగా
32 and to give: give LORD [obj] Lachish in/on/with hand: power Israel and to capture her in/on/with day [the] second and to smite her to/for lip: edge sword and [obj] all [the] soul: person which in/on/with her like/as all which to make: do to/for Libnah
౩౨యెహోవా లాకీషుని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. వారు రెండవ రోజు దాన్ని ఆక్రమించుకుని తాము లిబ్నాకు చేసినట్టే దాన్నీ, దానిలో ఉన్న వారందరినీ కత్తితో చంపేశారు.
33 then to ascend: rise Horam king Gezer to/for to help [obj] Lachish and to smite him Joshua and [obj] people his till lest to remain to/for him survivor
౩౩లాకీషుకు సహాయం చేయడానికి గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ అతన్నీ అతని ప్రజలనూ హతం చేశాడు.
34 and to pass Joshua and all Israel with him from Lachish Eglon [to] and to camp upon her and to fight upon her
౩౪తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ లాకీషు నుండి ఎగ్లోనుకు వచ్చి దాని ముందు దిగి దాని నివాసులతో యుద్ధం చేసి
35 and to capture her in/on/with day [the] he/she/it and to smite her to/for lip: edge sword and [obj] all [the] soul: person which in/on/with her in/on/with day [the] he/she/it to devote/destroy like/as all which to make: do to/for Lachish
౩౫ఆ రోజు దాన్ని ఆక్రమించుకుని, కత్తితో వారిని హతం చేశారు. అతడు లాకీషుకు చేసినట్టే వారు దానిలో ఉన్నవారందరినీ ఆ రోజు నిర్మూలం చేశారు.
36 and to ascend: rise Joshua and all Israel with him from Eglon [to] Hebron [to] and to fight upon her
౩౬అప్పుడు యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని ప్రజలతో యుద్ధం చేసి
37 and to capture her and to smite her to/for lip: edge sword and [obj] king her and [obj] all city her and [obj] all [the] soul: person which in/on/with her not to remain survivor like/as all which to make: do to/for Eglon and to devote/destroy [obj] her and [obj] all [the] soul: person which in/on/with her
౩౭దాన్ని స్వాధీనం చేసుకుని దాన్నీ దాని రాజునూ దాని పట్టణాలన్నిటినీ దానిలో ఉన్న వారందరినీ కత్తితో హతం చేశారు. అతడు ఎగ్లోనుకు చేసినట్టే దాన్నీ దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేశారు.
38 and to return: return Joshua and all Israel with him Debir [to] and to fight upon her
౩౮అక్కడి నుండి యెహోషువ, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరు దెబీరు వైపు తిరిగి దానితో యుద్ధం చేసి
39 and to capture her and [obj] king her and [obj] all city her and to smite them to/for lip: edge sword and to devote/destroy [obj] all soul: person which in/on/with her not to remain survivor like/as as which to make: do to/for Hebron so to make: do to/for Debir [to] and to/for king her and like/as as which to make: do to/for Libnah and to/for king her
౩౯దానినీ దాని రాజునూ దాని సమస్త పట్టణాలనూ పట్టుకుని కత్తి చేత హతం చేసి దానిలో ఉన్న వారినందరినీ నిర్మూలం చేశారు. అతడు హెబ్రోనుకూ లిబ్నాకూ దాని రాజుకూ చేసినట్లు, దెబీరుకూ దాని రాజుకూ చేశాడు.
40 and to smite Joshua [obj] all [the] land: country/planet [the] mountain: hill country and [the] Negeb and [the] Shephelah and [the] slope and [obj] all king their not to remain survivor and [obj] all [the] breath to devote/destroy like/as as which to command LORD God Israel
౪౦తరువాత యెహోషువ పర్వత ప్రాంతాలనూ, దక్షిణ ప్రదేశాన్నీ షెఫేలా ప్రదేశాన్నీ చరియల ప్రదేశాన్నీ వాటి రాజులందరినీ జయించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన విధంగా అతడు ఏదీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్నీ నిర్మూలం చేశాడు.
41 and to smite them Joshua from Kadesh-barnea Kadesh-barnea and till Gaza and [obj] all land: country/planet Goshen and till Gibeon
౪౧కాదేషు బర్నేయ మొదలు గాజా వరకూ గిబియోను వరకూ గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు.
42 and [obj] all [the] king [the] these and [obj] land: country/planet their to capture Joshua beat one for LORD God Israel to fight to/for Israel
౪౨ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.
43 and to return: return Joshua and all Israel with him to(wards) [the] camp [the] Gilgal [to]
౪౩తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.