< 2 Kings 24 >
1 In days his he came up Nebuchadnezzar [the] king of Babylon and he was of him Jehoiakim a subject three years and he turned back and he rebelled against him.
౧యెహోయాకీము రోజుల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చాడు. యెహోయాకీము అతనికి లోబడి మూడు సంవత్సరాలు సేవించిన తరువాత అతని మీద తిరుగుబాటు చేశాడు.
2 And he sent Yahweh - on him [the] marauding bands of [the] Chaldeans and [the] marauding bands of Aram and - [the] marauding bands of Moab and [the] marauding bands of [the] people of Ammon and he sent them on Judah to destroy it according to [the] word of Yahweh which he had spoken by [the] hand of servants his the prophets.
౨యెహోవా అతని మీదకి, తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను చెప్పిన మాట ప్రకారం యూదాదేశాన్ని నాశనం చెయ్యడానికి దాని మీదకి కల్దీయుల సైన్యాలను, సిరియనుల సైన్యాలను, మోయాబీయుల సైన్యాలను, అమ్మోనీయుల సైన్యాలను రప్పించాడు.
3 Surely - on [the] mouth of Yahweh it happened in Judah to remove [it] from on face his for [the] sins of Manasseh according to all that he had done.
౩మనష్షే చేసిన పనుల కారణంగా, అతడు నిరపరాధులను హతం చేసిన కారణంగా, యూదావారు యెహోవా సముఖం నుంచి తొలగి పోయేలా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ వల్లే ఇది వాళ్లకు జరిగింది.
4 And also [the] blood of the innocent which he had shed and he filled Jerusalem blood innocent and not he was willing Yahweh to forgive.
౪అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా, దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది.
5 And [the] rest of [the] matters of Jehoiakim and all that he did ¿ not [are] they written on [the] scroll of [the] matters of the days of [the] kings of Judah.
౫యెహోయాకీము చేసిన ఇతర పనుల గురించి, అతడు జరిగించిన వాటన్నిటి గురించి, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
6 And he lay down Jehoiakim with ancestors his and he became king Jehoiachin son his in place of him.
౬యెహోయాకీము తన పూర్వీకులతోబాటు చనిపోగా అతని కొడుకు యెహోయాకీను అతని స్థానంలో రాజయ్యాడు.
7 And not he repeated again [the] king of Egypt to come out from own land his for he had taken [the] king of Babylon from [the] wadi of Egypt to [the] river of Euphrates all that it had belonged to [the] king of Egypt.
౭బబులోనురాజు ఐగుప్తు నదికీ, యూఫ్రటీసు నదికీ మధ్య ఐగుప్తురాజు ఆధీనంలో ఉన్న భూమి అంతటినీ పట్టుకొన్న తరువాత, ఐగుప్తురాజు ఇక ఏ ప్రాంతం మీదకీ యుద్ధానికి వెళ్ళలేదు.
8 [was] a son of Eight-teen year[s] Jehoiachin when became king he and three months he reigned in Jerusalem and [the] name of mother his [was] Nehushta [the] daughter of Elnathan from Jerusalem.
౮యెహోయాకీను పరిపాలన ఆరంభించినప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు. అతడు యెరూషలేములో మూడు నెలలు ఏలాడు. యెరూషలేమువాడు ఎల్నాతాను కూతురు నెహుష్తా అతని తల్లి.
9 And he did the evil in [the] eyes of Yahweh according to all that he had done father his.
౯అతడు తన తండ్రి చేసినట్టే చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
10 At the time that (they went up *Q(K)*) [the] servants of Nebuchadnezzar [the] king of Babylon Jerusalem and it came the city in state of siege.
౧౦ఆ కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు.
11 And he came Nebuchadnezzar [the] king of Babylon to the city and servants his [were] laying siege on it.
౧౧వారు పట్టణానికి ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు, బబులోను రాజు నెబుకద్నెజరు స్వయంగా తానే దాని మీదకి వచ్చాడు.
12 And he went out Jehoiachin [the] king of Judah to [the] king of Babylon he and mother his and servants his and officials his and court-officials his and he took him [the] king of Babylon in year eight of reigning his.
౧౨అప్పుడు యూదారాజు యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులూ, అతని పరివారం, బయలుదేరి బబులోనురాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు.
13 And he brought out from there all [the] treasures of [the] house of Yahweh and [the] treasures of [the] house of the king and he cut up all [the] articles of gold which he had made Solomon [the] king of Israel for [the] temple of Yahweh just as he had spoken Yahweh.
౧౩ఇంకా అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ, యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్ళిపోయాడు.
14 And he took into exile all Jerusalem and all the officials and - all [the] mighty [men] of strength (ten *Q(K)*) thousand exile[s] and every craftsman and smith not anyone was left except [the] poor people of [the] people of the land.
౧౪ఇంకా, అతడు దేశపు ప్రజల్లో అతి పేదవారు తప్ప ఇంక ఎవరూ లేకుండా యెరూషలేము పట్టణమంతట్లో ఉన్న అధిపతులూ, పరాక్రమవంతులూ పదివేలమందినీ, వీళ్ళు కాకుండా కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను బందీలుగా తీసుకుపోయాడు.
15 And he took into exile Jehoiachin Babylon towards and [the] mother of the king and [the] wives of the king and court-officials his and ([the] leaders of *Q(K)*) the land he led away exile[s] from Jerusalem Babylon towards.
౧౫అతడు యెహోయాకీను రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారాన్ని, దేశంలో ఉన్న గొప్పవాళ్ళను యెరూషలేము నుంచి బబులోను పట్టణానికి బందీలుగా తీసుకు వెళ్ళాడు.
16 And all [the] men of strength seven thousand and the craftsman and the smith one thousand everyone warriors makers of war and he brought them [the] king of Babylon exile[s] Babylon towards.
౧౬ఏడు వేలమంది పరాక్రమవంతులను, వెయ్యిమంది కంసాలివాళ్ళను, కమ్మరివాళ్ళను, యుద్ధంలో ఆరితేరిన శక్తిమంతులందర్నీ బబులోనురాజు బందీలుగా బబులోను పట్టణానికి తీసుకొచ్చాడు.
17 And he made king [the] king of Babylon Mattaniah uncle his in place of him and he changed name his Zedekiah.
౧౭ఇంకా బబులోను రాజు యెహోయాకీను బాబాయి మత్తన్యాకు సిద్కియా అనే మారుపేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాడు.
18 [was] a son of Twenty and one year[s] Zedekiah when became king he and one [plus] ten year[s] he reigned in Jerusalem and [the] name of mother his ([was] Hamutal *Q(K)*) [the] daughter of Jeremiah from Libnah.
౧౮సిద్కియా పరిపాలన ఆరంభించినప్పుడు అతనికి 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు.
19 And he did the evil in [the] eyes of Yahweh according to all that he had done Jehoiakim.
౧౯అతని తల్లి లిబ్నా ఊరివాడు యిర్మీయా కూతురు హమూటలు. యెహోయాకీము చేసినట్టే సిద్కియా చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
20 For - on [the] anger of Yahweh it happened in Jerusalem and in Judah until threw he them from on face his and he rebelled Zedekiah against [the] king of Babylon.
౨౦సిద్కియా బబులోనురాజు మీద తిరుగబాటు చేశాడు. యూదావాళ్ళ మీద, యెరూషలేమువాళ్ళ మీద యెహోవాకు ఉన్న కోపం కారణంగా ఆయన తన సముఖంలోనుంచి వాళ్ళను తోలివేయడానికి ఇది దోహదం చేసింది.