< 2 Chronicles 20 >

1 And it was after this they came [the] people of Moab and [the] people of Ammon and with them - some of the Ammonites on Jehoshaphat for battle.
ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు.
2 And people came and they told to Jehoshaphat saying [is] coming on you a multitude great from [the] other side of the sea from Aram and there they [are] in Hazezon Tamar it [is] En Gedi.
అంతలో కొంతమంది వచ్చి “మృత సముద్రం అవతల ఉండే అరాము వైపు నుంచి ఒక గొప్ప సైన్యం నీ మీదికి వస్తూ ఉంది. గమనించండి. వారు హససోన్‌ తామారు అనే ఏన్గెదీలో ఉన్నారు” అని యెహోషాపాతుకు తెలియచేశారు.
3 And he was afraid and he gave Jehoshaphat face his to seek Yahweh and he proclaimed a fast over all Judah.
అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా దగ్గర విచారించడానికి మనస్సు పెట్టి, యూదా అంతటా ఉపవాసం ఆచరించాలని చాటించాడు.
4 And they gathered Judah to seek from Yahweh also from all [the] cities of Judah they came to seek Yahweh.
యూదావారు యెహోవా సహాయాన్ని అడగడానికి సమావేశమయ్యారు. యెహోవా దగ్గర విచారించడానికి యూదా పట్టణాలన్నిటిలో నుంచి ప్రజలు వచ్చారు.
5 And he stood Jehoshaphat in [the] assembly of Judah and Jerusalem in [the] house of Yahweh before the courtyard new.
యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త ఆవరణం ముందు సమాజంగా కూడిన యూదా యెరూషలేము ప్రజల మధ్య నిలబడి,
6 And he said O Yahweh [the] God of ancestors our ¿ not [are] you he God in the heavens and you [are] ruler over all [the] kingdoms of the nations and [are] in hand your power and strength and there not [is] with you to hold ground.
“మా పూర్వీకుల దేవా, యెహోవా, పరలోకంలో దేవుడివి నీవే గదా! అన్ని రాజ్యాలనూ పాలించే బలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్నెదిరించడం ఎవరి తరమూ కాదు.
7 ¿ Not - you O God our did you dispossess [the] inhabitants of the land this from to before people your Israel and you gave it to [the] offspring of Abraham friend your for ever.
నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశవాసులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నువ్వే.”
8 And they have dwelt in it and they have built for you - in it a sanctuary for name your saying.
“వారు అందులో నివాసం చేసి, మాకేదైనా విపత్తు జరిగితే, అంటే యుద్ధపు తీర్పు గానీ రోగం గానీ కరువుగానీ, మా మీదికి వస్తే మేము ఈ మందిరం ముందు నిలబడి మా బాధలో నీకు మొర్రపెడితే
9 If it will come on us calamity sword judgment and pestilence and famine we will stand before the house this and before you for name your [is] in the house this so we may cry out to you from distress our so you may hear and you may save.
నీవు ఆలకించి మమ్మల్ని కాపాడతావని, ఇక్కడ నీ పేరు కోసం ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు. నీ పేరు ఈ మందిరానికి ఉంది గదా.
10 And therefore here! [the] people of Ammon and Moab and [the] mountain of Seir which not you permitted to Israel to go in them when came they from [the] land of Egypt for they turned aside from on them and not they destroyed them.
౧౦ఇశ్రాయేలీయులు ఐగుప్తునుంచి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు కొండ ప్రాంతం వారితోనూ యుద్ధం చేయనివ్వలేదు కాబట్టి ఇశ్రాయేలీయులు వారిని నాశనం చేయకుండా వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు.
11 And here! they [are] repaying to us by coming to drive out us from possession your which you caused to possess us.
౧౧మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుంచి మమ్మల్ని తోలివేయడానికి వారు బయలుదేరి వచ్చి మాకు ఎలాంటి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడండి.
12 O God our ¿ not will you enter into judgment on them for there not in us [is] strength before the multitude great this which is coming on us and we not we know what? will we do for [are] on you eyes our.
౧౨మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయాలో మాకు తెలియదు. నువ్వే మా దిక్కు” అని ప్రార్థన చేశారు.
13 (And all *LAB(h)*) Judah [were] standing before Yahweh also little one[s] their wives their and children their.
౧౩యూదావారంతా తమ పసికందులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.
14 And Jahaziel [the] son of Zechariah [the] son of Benaiah [the] son of Jeiel [the] son of Mattaniah the Levite one of [the] descendants of Asaph it was on him [the] spirit of Yahweh in [the] midst of the assembly.
౧౪అప్పుడు ఆసాపు సంతతివాడూ లేవీయుడు అయిన యహజీయేలు, సమాజంలో ఉన్నాడు. అతని తండ్రి జెకర్యా, జెకర్యా తండ్రి బెనాయా, బెనాయా తండ్రి యెహీయేలు, యెహీయేలు తండ్రి మత్తన్యా. యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి రాగా అతడు ఇలా ప్రకటించాడు,
15 And he said pay attention O all Judah and [the] inhabitants of Jerusalem and the king Jehoshaphat thus he says Yahweh to you O you may not you be afraid and may not you be dismayed because of the multitude great this for not [belongs] to you the battle for to God.
౧౫“యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.
16 Tomorrow go down on them there they [will be] coming up on [the] ascent of Ziz and you will find them at [the] end of the wadi [the] face of [the] wilderness of Jeruel.
౧౬రేపు మీరు వారిమీదికి వెళ్ళాలి. వారు జీజు అనే కనుమ గుండా వస్తారు. మీరు యెరూవేలు అరణ్యం ముందున్న వాగు చివర, వారిని కనుగొంటారు.
17 Not [belongs] to you to fight in this [battle] take your stand stand and see [the] victory of Yahweh with you O Judah and Jerusalem may not you be afraid and may not you be dismayed tomorrow go out before them and Yahweh [will be] with you.
౧౭ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీరు మీ స్థానాల్లో అలాగే నిలబడండి. మీతో ఉన్న యెహోవా అందించే రక్షణను మీరు చూస్తారు. భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. రేపు మీరు వారి మీదికి వెళ్ళాలి. యెహోవా మీతో ఉంటాడు.”
18 And he bowed low Jehoshaphat face [the] ground towards and all Judah and [the] inhabitants of Jerusalem they fell down before Yahweh to bow down to Yahweh.
౧౮అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. యూదావారు, యెరూషలేము నివాసులు యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించారు.
19 And they stood the Levites of [the] descendants of the Kohathites and of [the] descendants of the Korahites to praise Yahweh [the] God of Israel with a voice great upwards.
౧౯కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.
20 And they rose early in the morning and they went out to [the] wilderness of Tekoa and when went out they he stood Jehoshaphat and he said listen to me O Judah and [the] inhabitants of Jerusalem trust in Yahweh God your so you may be established trust in prophets his and succeed.
౨౦వారు ఉదయాన్నే లేచి తెకోవ అరణ్యానికి వెళ్ళారు. వారు వెళ్తూ ఉంటే యెహోషాపాతు నిలబడి “యూదా, యెరూషలేములో నివసించే మీరంతా నా మాట వినండి! మీ దేవుడైన యెహోవాను నమ్మండి, అప్పుడు మీకు సహాయం దొరుకుతుంది. ఆయన ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీకు విజయం కలుగుతుంది” అని చెప్పాడు.
21 And he consulted the people and he appointed [those who] sang to Yahweh and [those who] praised to adornment of holiness when went out before the [man] equipped and saying give thanks to Yahweh for [is] for ever covenant loyalty his.
౨౧అతడు ప్రజలతో చర్చించిన తరువాత యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరచి, వారు సైన్యం ముందు నడుస్తూ “యెహోవా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞత తెలియచేయండి.” అని పలకాలని నియమించాడు.
22 And at [the] time [when] they began with a shout of joy and praise he set Yahweh - ambushers on [the] people of Ammon Moab and [the] mountain of Seir who were coming to Judah and they were defeated.
౨౨వారు పాడడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు, యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయులమీదా మోయాబీయుల మీదా శేయీరు కొండ ప్రాంతం వారి మీదా యెహోవా ఆకస్మిక దాడి చేసే మనుషులను పెట్టాడు. శత్రువులు ఓడిపోయారు.
23 And they rose up [the] people of Ammon and Moab on [the] inhabitants of [the] mountain of Seir to totally destroy [them] and to destroy [them] and just as had finished they with [the] inhabitants of Seir they helped each on neighbor his to destruction.
౨౩అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు కొండప్రాంతం వారిని పూర్తిగా చంపి వేసి నాశనం చేద్దామని పొంచి ఉండి, వారిమీద పడ్డారు. వారు శేయీరు నివాసులను తుదముట్టించిన తరువాత ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు.
24 And Judah it came to the watchtower of the wilderness and they turned to the multitude and there they [were] corpses lying [the] ground towards and there not [was] an escaped remnant.
౨౪యూదావారు అరణ్యం దగ్గరికి వచ్చి, సైన్యం వైపు చూస్తే, వారంతా నేలమీద పడి ఉన్నారు. ఏ ఒక్కడూ తప్పించుకోలేదు.
25 And he went Jehoshaphat and people his to plunder booty their and they found among them to abundance and property and corpses and articles of precious things and they plundered for themselves to there not [was] carrying and they were days three plundering the booty for [was] much it.
౨౫యెహోషాపాతూ, అతని ప్రజలూ వారి వస్తువులను తీసుకోడానికి వస్తే, ఆ శవాల మీద విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు దొరికాయి. తాము మోయలేనంతగా వారు సొమ్ము దోచుకున్నారు. కొల్లసొమ్ము ఎంత ఎక్కువగా ఉందంటే, వాటిని మోసుకు పోవడానికి వారికి మూడు రోజులు పట్టింది.
26 And on the day fourth they assembled to [the] valley of Berachah for there they blessed Yahweh there-fore people have called [the] name of the place that [the] valley of Berachah until this day.
౨౬నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు.
27 And they turned back every man of Judah and Jerusalem and Jehoshaphat at head their to return to Jerusalem with joy for he had made rejoice them Yahweh from enemies their.
౨౭ఆ తరువాత యూదావారూ యెరూషలేమువారూ వారికి ముందు యెహోషాపాతు, ఆనందంగా యెరూషలేము తిరిగి వెళ్లాలని బయలు దేరారు. ఎందుకంటే యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించాడు.
28 And they came Jerusalem with lyres and with harps and with trumpets to [the] house of Yahweh.
౨౮వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి తీగె వాయిద్యాలను సితారాలను వాయిస్తూ బాకాలు ఊదుతూ వచ్చారు.
29 And it was [the] dread of God on all [the] kingdoms of the lands when heard they that he had fought Yahweh with [the] enemies of Israel.
౨౯ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసాడని అన్ని రాజ్యాల వారు విని, దేవుని భయంతో వణికిపోయారు.
30 And it was at peace [the] kingdom of Jehoshaphat and he had given rest to him God his from round about.
౩౦ఈ విధంగా యెహోషాపాతు రాజ్యం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అతని దేవుడు, అతని చుట్టూ నెమ్మది ఇచ్చాడు.
31 And he reigned Jehoshaphat over Judah a son of thirty and five year[s] when became king he and twenty and five year[s] he reigned in Jerusalem and [the] name of mother his [was] Azubah [the] daughter of Shilhi.
౩౧యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా.
32 And he walked in [the] way of father his Asa and not he turned aside from it to do the right in [the] eyes of Yahweh.
౩౨అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.
33 Only the high places not they were removed and still the people not they directed heart their to [the] God of ancestors their.
౩౩అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు.
34 And [the] rest of [the] matters of Jehoshaphat former and latter there they [are] written in [the] words of Jehu [the] son of Hanani which it was recorded on [the] scroll of [the] kings of Israel.
౩౪యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి వుంది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది.
35 And after this he made an alliance Jehoshaphat [the] king of Judah with Ahaziah [the] king of Israel he he acted wickedly to do.
౩౫ఇది జరిగిన తరువాత, యూదా రాజు యెహోషాపాతు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు.
36 And he allied himself with him to make ships to go Tarshish and they made ships in Ezion Geber.
౩౬తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు.
37 And he prophesied Eliezer [the] son of Dodavahu from Mareshah on Jehoshaphat saying as making alliance you with Ahaziah he will break Yahweh works your and they were broken ships and not they retained to go to Tarshish.
౩౭అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు “నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు” అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.

< 2 Chronicles 20 >