< Numbers 11 >

1 And it came to pass that when the people were giving themselves up to murmuring, it was grievous in the ears of Yahweh, —so Yahweh hearkened, and kindled was his anger, and the fire of Yahweh burned among them, and consumed the uttermost part of the camp.
ప్రజలు యెహోవా వింటుండగా తమ సమస్యల గురించి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు. వారి మాటలు విని యెహోవా ఆగ్రహించాడు. దాంతో వారి మధ్యలో మంటలు రేగి శిబిరం ఒక వైపున అంచుల్లో కాలిపోవడం మొదలయింది.
2 Then did the people make outcry unto Moses, —and Moses prayed unto Yahweh, and the fire sank down.
అప్పుడు ప్రజలు గట్టిగా కేకలు పెట్టి మోషేను బతిమాలారు. కాబట్టి మోషే యెహోవాకు ప్రార్ధించాడు. అప్పుడు ఆ మంటలు చల్లారాయి.
3 So he called the name of that place, Taberah ["A Burning"] because there burned among them the fire of Yahweh.
యెహోవా అగ్ని వారి మధ్యలో రగిలింది కాబట్టి ఆ స్థలానికి “తబేరా” అనే పేరు వచ్చింది.
4 Moreover the mixed multitude that was in their midst concealed not their lusting, —and so even the sons of Israel, fell away and wept, and said: Who will grant us to eat flesh?
కొంతమంది విదేశీయులు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలసి నివసిస్తున్నారు. వారు తినడానికి ఇంకా మంచి ఆహారం కోరుకున్నారు. దాంతో ఇశ్రాయేలు ప్రజలు ఫిర్యాదు చేస్తూ “తినడానికి మాకు మాంసం ఎవరిస్తారు?
5 We remember the fish that we did eat in Egypt, without money, —the cucumbers, and the water-melons, and the leeks and the onions, and the garlick.
ఐగుప్తులో మేము స్వేచ్ఛగా ఆరగించిన చేపలూ, కీర దోస కాయలూ, కర్బూజాలూ, ఆకు కూరలూ, ఉల్లి పాయలూ, వెల్లుల్లీ మాకు గుర్తుకు వస్తున్నాయి.
6 But, now, our soul is dried up, there is nothing at all, —unless, unto the manna, [we turn] our eyes.
ఇప్పుడు మేము బలహీనులమయ్యాం. తినడానికి ఈ మన్నా తప్పించి మాకేం కన్పించడం లేదు” అని చెప్పుకున్నారు.
7 Now, the manna, was like coriander seed, and the appearance thereof like the appearance of bdellium,
ఆ మన్నా కొత్తిమీర గింజల్లా ఉంటుంది. చూడ్డానికి గుగ్గిలంలా ఉంటుంది.
8 The people used to go about and pick it up, and grind it with a pair of mill-stones, or pound it in a mortar, and boil it in a pot, and make it into round cakes, —then was the taste thereof like the taste of a sweet cake made with oil.
ప్రజలు శిబిరం మైదానంలో నడుస్తూ మన్నాని సేకరించేవారు. తిరగలిలో విసిరి గానీ రోట్లో దంచి గానీ దాన్ని పిండి చేసి పెనం పైన కాల్చి రొట్టెలు చేసే వారు. దాని రుచి తాజా ఒలీవ నూనె రుచిలా ఉండేది.
9 When the dew came down upon the camp by night, the manna came down thereupon.
రాత్రి వేళల్లో శిబిరం పైన మంచు కురిసినప్పుడు దాంతో పాటే మన్నా కూడా ఆ మంచు పైన పడేది.
10 So then Moses heard the people weeping by their families, every one at the entrance of his tent, —then kindled the anger of Yahweh fiercely, and in the eyes of Moses, it was grievous.
౧౦ప్రజలు వారి కుటుంబాలతో కలసి ఎవరి గుమ్మం ఎదుట వారు కూర్చుని ఏడుస్తుండగా మోషే విన్నాడు. యెహోవా భీకర కోపం రగిలి పోయింది. వారు ఏడవడం, ఫిర్యాదు చేయడం మోషే దృష్టిలో తప్పుగా ఉంది.
11 And Moses said unto Yahweh—Wherefore hast thou let thy servant come to grief, and wherefore have I not found favour in thine eyes, —that thou shouldest lay the burden of all this people upon me?
౧౧అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.
12 Did, I, conceive all this people, or, I, beget them, —that thou shouldest say unto me, Carry them in thy bosom, as a nursing father carrieth a suckling, unto the soil which thou didst swear unto their fathers?
౧౨ఈ జనాన్నంతా నేను కన్నానా? ‘తండ్రి తన బిడ్డని గుండెకి హత్తుకున్నట్టుగా వీరిని హత్తుకో’ అని నువ్వు నాతో చెప్పడానికి నేనేమన్నా వారిని నా గర్భంలో మోసానా? వారి పూర్వీకులకి నువ్వు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వారిని మోసుకు వెళ్ళాలా?
13 Whence should, I, have flesh to give to all this people, —for they keep weeping by me saying, Oh give us flesh that we may eat!
౧౩ఇంతమంది ప్రజలకి మాంసం నేను ఎక్కడ నుండి తేవాలి? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ‘మేము తినడానికి మాంసం ఇవ్వు’ అంటున్నారు.
14 Unable, am, I, by myself, to carry all this people, —for they are too heavy for me.
౧౪ఈ ప్రజలందరి భారం మోయడం నా ఒక్కడి వల్ల కాదు. వీళ్ళ భారం నా శక్తికి మించింది.
15 But if, in this way, thou art going to deal with me, slay me, I beseech thee, slay, if I have found favour in thine eyes, —and let me not see my grief,
౧౫నువ్వు నాతో ఇలా వ్యవహరించదలిస్తే నన్ను ఇప్పుడే చంపెయ్యి. నా మీద నీకు దయ కలిగితే నన్ను చంపి నా బాధ తీసెయ్యి.”
16 Then said Yahweh unto Moses—Gather thou unto me seventy men, from among the elders of Israel, of whom thou knowest that they are elders of the people and their overseers, —then shalt thou take them unto the tent of meeting, and they shall station themselves there with thee.
౧౬అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు.
17 Then will I come down, and speak with thee there, and will take of the spirit that is upon thee and put upon them, —and they shall carry, with thee, the burden of the people, and, thou, shalt not carry it by thyself.
౧౭అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు.
18 And, unto the people, shalt thou say: Hallow yourselves by to-morrow, and ye shall eat flesh, for ye have wept in the ears of Yahweh saying—Who will grant us to eat flesh? for it was well with us in Egypt, —so then Yahweh will give you flesh and ye shall eat.
౧౮నువ్వు ప్రజలకుఇలా చెప్పు. రేపటికి మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. యెహోవా రాకకై సిద్ధపడండి. యెహోవా వింటుండగా మీరు ఏడ్చారు కాబట్టి మీరు కచ్చితంగా మాంసం తింటారు. ‘మాకు మాంసం ఎవరు పెడతారు? మాకు ఐగుప్తులోనే బాగుంది’ అన్నారు గదా. అందుకని యెహోవా మీకు మాంసం ఇస్తాడు. మీరు దాన్ని తింటారు.
19 Not one day, shall ye eat nor two days, —nor five days nor ten days, nor twenty days:
౧౯ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు.
20 for a month of days until it cometh forth out of your nostrils, so shall it become to you a loathsome thing, —because ye have refused Yahweh who is in your midst, and have wept before him, saying, Wherefore now came we forth out of Egypt?
౨౦ఒక నెల రోజులు మీరు మాంసం తింటారు. అది మీ ముక్కు పుటాల్లోంచి బయటకు వచ్చి మీకు అసహ్యం పుట్టే వరకూ తింటారు. మీరు మీ మధ్య ఉన్న యెహోవాను తిరస్కరించారు కాబట్టి అది మీకు వెగటు పుట్టిస్తుంది. ఆయన ముందు మీరు ఏడ్చారు. ‘ఐగుప్తు నుండి ఎందుకు వచ్చాం?’ అన్నారు.”
21 And Moses said, Six hundred thousand footmen, are the people in whose midst am, I, yet thou hast said—Flesh, will I give unto them, and they shall eat for a month of days.
౨౧దానికి మోషే “నేను ఆరు లక్షలమంది జనంతో ఉన్నాను. నువ్వేమో ‘ఒక నెల అంతా వాళ్లకి మాంసం ఇస్తాను’ అంటున్నావు.
22 Shall the flocks and herds, be slaughtered for them, that it may suffice for them? Shall all the fishes of the sea, be gathered together unto them that it may suffice for them?
౨౨ఇప్పుడు వారిని తృప్తి పరచడానికి గొర్రెలను, పశువులను చంపాలా? సముద్రంలో ఉన్న చేపలన్నిటినీ వారి కోసం పట్టాలా?” అన్నాడు.
23 Then said Yahweh unto Moses, Shall the hand of Yahweh, fail? Now, shalt thou see whether my word come to pass unto thee or not.
౨౩అప్పుడు యెహోవా మోషేతో “నా బాహుబలానికి శక్తి తగ్గిందా? నా మాట నిజమో కాదో నువ్వు ఇప్పుడే చూస్తావు” అన్నాడు.
24 And Moses went forth and spake unto the people the words of Yahweh, —and gathered together seventy men from among the elders of the people, and caused them to stand round about the tent.
౨౪మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు.
25 Then Yahweh came down, in the cloud, and spake unto him, and took of the spirit that was upon him, and gave unto the seventy men—the elders. And it came to pass that when the spirit rested upon them, they prophesied, and then did so no more.
౨౫అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు.
26 Now there were two men left behind in the camp—the name of the one, was Eldad and the name of the other, Medad, so then the spirit, rested on them—they, being among them who were written, though they had not gone forth unto the tent, —but they prophesied in the camp.
౨౬ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు.
27 And there ran a young man, and told Moses and said, —Eldad and Medad, are prophesying in the camp!
౨౭అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి “ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు.
28 Then responded Joshua son of Nun the attendant of Moses from his youth, and said, —My lord Moses forbid them!
౨౮మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ “మోషే, నా యజమానీ, వారిని ఆపు” అన్నాడు.
29 But Moses said unto him, Art, thou, jealous for, me? Oh would that, all the people of Yahweh, were prophets! Yea let Yahweh put his spirit upon them!
౨౯దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు.
30 Then was Moses received back into the camp, —he and the elders of Israel.
౩౦అప్పుడు మోషే, ఇశ్రాయేలు పెద్దలంతా శిబిరంలోకి వెళ్ళారు.
31 Now, a wind, had sprung up, from Yahweh, and cut off quails from the sea, and let them lie over the camp—as it were a days journey here and a days journey there, round about the camp, —and as it were two cubits on the face of the land.
౩౧అప్పుడు యెహోవా దగ్గరనుండి వాయువు బయల్దేరింది. అది సముద్రం నుండి పూరేడు పిట్టలను తీసుకు వచ్చి శిబిరంలో అంతటా పడవేసింది. ఈ వైపునుండి ఆ వైపుకీ, ఆ వైపునుండి ఈ వైపుకీ ఒక రోజు ప్రయాణమంత దూరం వరకూ అవి వచ్చి పడ్డాయి. అవి భూమికి రెండు మూరల ఎత్తున పడ్డాయి.
32 And the people rose up all that day and all the night and all the next day, and gathered the quails, he that did least, gathered ten homers, —and they spread them out for themselves spreading away, round about the camp.
౩౨కాబట్టి ప్రజలు ఉదయాన్నే లేచి ఆ రోజంతా వాటిని సేకరించారు. ఆ రాత్రీ మరుసటి రోజు అంతా వాటిని సేకరించారు. నూరు తూముల పిట్టల కంటే తక్కువ సేకరించినవాడు లేడు. తరువాత వారు వాటిని శిబిరం చుట్టూ తమ కోసం పరచి ఉంచారు.
33 The flesh, was yet between their teeth, not yet chewed, —when the anger of Yahweh, had kindled upon the people, and Yahweh smote the people, with an exceeding great plague.
౩౩ఆ మాంసం వారి పళ్ళ మధ్య ఉండగానే, వారు దాన్ని నములుతూ ఉన్నప్పుడే యెహోవా వారిపై ఆగ్రహించాడు. పెద్ద రోగంతో ఆయన వారిని బాధించాడు.
34 And the name of that place was called Kibroth-hattaavah—because there, they buried the people who had lusted,
౩౪మాంసం కోసం అతిగా ఆశ పడిన వారిని ప్రజలు ఒక స్థలంలో పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి “కిబ్రోతు హత్తావా” అనే పేరు కలిగింది.
35 From Kibroth-hattaavah, the people set forward to Hazeroth, —and they remained in Hazeroth.
౩౫ప్రజలు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ నివసించారు.

< Numbers 11 >