< Ezekiel 19 >

1 Thou. therefore take up a dirge, for the prince of Israel;
“కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు.
2 and thou shalt say— How was thy mother a lioness, Between lions, she lay down, - In the midst of young lions, She nourished her whelps;
నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది. అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది.
3 And she reared up one of her whelps— A young lion, he became, And he learned to rend prey. Men, he devoured.
వాటిలో ఒక దాన్ని కొదమసింహం అయ్యేంతగా పెంచింది. ఆ కొదమసింహం వేటాడడం నేర్చుకుంది. అది మనుషులను మింగేసింది.
4 Then nations heard of him. In their pit, was he caught, — So they brought him with hooks. Into the land of Egypt.
అప్పుడు ఇతర ప్రజలు అతని సంగతి విన్నారు. వాళ్ళ ఉచ్చులో అతడు చిక్కాడు. వాళ్ళు అతనికి గాలాలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చారు.
5 And she saw she had waited Lost was her hope, Then took she another of her whelps. A young lion, she made him.
దాని తల్లి దాని కోసం కనిపెట్టి, తన ఆశ భంగం అయిందని తెలుసుకుని, తన పిల్లల్లో ఇంకొకదాన్ని పెంచి, కొదమసింహంగా చేసింది.
6 Yea he went to and fro amidst lions A young lion, he became, - And he learned to rend prey. Men, he devoured;
ఇది కూడా కొదమ సింహమై, తక్కిన కొదమ సింహాలతో పాటు తిరిగి, చీల్చి చెండాడి వేటాడడం నేర్చుకుని, మనుషులును మింగేసింది.
7 And he injured his widows, And their cities, laid waste, - And deserted was the land and its fulness, At the noise of his roaring.
తరువాత అతడు వాళ్ళ వితంతువులను మానభంగం చేసి వాళ్ళ పట్టణాలు పాడు చేశాడు. అతని గర్జన శబ్దానికి ఆ దేశం, దానిలో ఉన్నదంతా ఖాళీ అయి పోయింది.
8 Then set upon him the nations round about. From the provinces, - And spread over him their net In their pit, was he caught;
నాలుగు దిక్కుల దేశపు ప్రజలందరూ దాన్ని పట్టుకోడానికి పొంచి ఉండి, వల పన్నినప్పుడు, అది వాళ్ళ ఉచ్చులో చిక్కింది.
9 And they put him in a cage with hooks, And brought him to Babylon’s king, — They brought him into strong-holds, That his noise might be heard no more Among the mountains of Israel.
అప్పుడు వాళ్ళు దానికి గాలాలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు. దాని గర్జన ఇశ్రాయేలు పర్వతాలమీద ఇక ఎన్నటికీ వినబడకుండా వాళ్ళు దాన్ని కొండ కోటలో ఉంచారు.
10 Thy mother [was] like a vine of thy vineyard, By waters, was planted, — Fruitful and full of branches, she became By reason of waters abundant;
౧౦నీ తల్లి ఫలవంతమైన తీగెలతో నిండి, ఒక నీటి ప్రవాహపు కాలవ దగ్గర నాటిన ద్రాక్షావల్లిలా ఉండేది. అక్కడ విస్తారమైన నీళ్ళు ఉండేవి గనుక అది ఎన్నో తీగలు కలిగి విరివిగా ద్రాక్షలు కాసేది.
11 And they served her as staves of power For the sceptres of rulers, And high became the stature thereof With its interwoven foliage, - And it was seen by its height, By its multitude of branches.
౧౧రాజులకు రాజదండాలు చెయ్యడానికి వీలైన బలమైన కొమ్మలు ఉండి, అవి మిగతా వాటికంటే ఎంతో ఎత్తుగా ఎదిగాయి.
12 Then was she uprooted in indignation To the ground, was she cast, And an east wind, dried up her fruit, —Broken off and withered were her staves of power, A fire, devoured them.
౧౨కాని, అతికోపంతో ఆ ద్రాక్షవల్లిని పెకలించి నేల మీద పడేయడం జరిగింది. తూర్పుగాలి విసిరినప్పుడు దాని పళ్ళు ఎండిపోయాయి. దాని గట్టికొమ్మలు తెగి, వాడిపోయి, కాలిపోయాయి.
13 Now, therefore, is she planted in a desert, -In a land parched and dry;
౧౩కాబట్టి ఇప్పుడు అది కరువు, దాహం ఉన్న ప్రదేశంలో ఎడారిలో నాటి ఉంది. దాని కొమ్మల్లోనుంచి అగ్ని బయలుదేరి,
14 And there hath gone forth a fire out of her staves of rods. Her fruit, hath it devoured, And there is in her no staff of power. As a sceptre to bear rule. A dirge, it is, and hath been made a dirge.
౧౪దాని పండ్లు కాల్చేసింది. గట్టి కొమ్మ ఒక్కటి కూడా లేదు. ఏలుబడి చేసేందుకు రాజదండం లేదు.” ఇది ఒక శోకం, ఒక శోక గీతంగా దీన్ని పాడతారు.

< Ezekiel 19 >