< 2 Chronicles 8 >
1 And it came to pass, at the end of twenty years, wherein Solomon had built the house of Yahweh, and his own house,
౧సొలొమోను యెహోవా మందిరాన్ని, తన అంతఃపురాన్నీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తరవాత
2 that, the cities which Huram had given to Solomon, Solomon built them, —and caused, the sons of Israel, to dwell there.
౨హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను తిరిగి కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులు నివాసం ఉండేలా చేశాడు.
3 And Solomon went to Hamath-zobah, —and prevailed against it;
౩తరువాత సొలొమోను హమాతుసొబా పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
4 and he built Tadmor, in the wilderness, —and all the store cities, which he built in Hamath;
౪అరణ్య ప్రాంతంలో ఉండే తద్మోరుకు, హమాతు దేశంలో ఖజానా ఉంచే పట్టణాలన్నిటికీ ప్రాకారాలు కట్టించాడు.
5 and he built Beth-horon, the upper, and Beth-horon, the nether, —fortified cities, with walls, and doors and bars;
౫ఇంకా అతడు ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలకి ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడలు కట్టించాడు.
6 and Baalath, and all the store cities which pertained to Solomon, and all the chariot cities, and the cities of the horsemen, —and every delight of Solomon which he delighted to build in Jerusalem, and in the Lebanon, and in all the land of his dominion.
౬బాలాతునూ, తనకున్న ధాన్యం నిలవచేసే ఊళ్ళనూ, తన రథాలు, గుర్రపు రౌతులు ఉండడానికి పట్టణాలనూ కట్టించాడు. ఇంకా యెరూషలేములో, లెబానోనులో, తాను పాలించే దేశాలన్నిటిలో తనకు నచ్చిన రీతిలో పట్టాణాలన్నిటినీ సొలొమోను కట్టించాడు.
7 As for all the people that were left, of the Hittites and the Amorites and the Perizzites and the Hivites and the Jebusites, who were not, of Israel; —
౭ఇశ్రాయేలీయులకు చెందని హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారందరిలో మిగిలి ఉన్న వారిని
8 of their sons who were left after them in the land, whom the sons of Israel had not utterly destroyed, Solomon enrolled them as tributary—unto this day.
౮ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండా విడిచిపెట్టిన వివిధ జాతుల ప్రజలనూ సొలొమోను ఇప్పటి వరకూ తనకు కట్టు బానిసలుగా చేసుకున్నాడు.
9 But, of the sons of Israel, were there none whom he delivered up as bondmen unto his work, —for, they, were men of war, and his captains and his heroes, and captains over his chariots, and his horsemen.
౯అయితే ఇశ్రాయేలీయుల్లో ఒక్కణ్ణి కూడా సొలొమోను తన దగ్గర పనిచేయడానికి దాసుడుగా నియమించుకోలేదు. వారిని సైనికులుగా, ప్రధానులుగా, తన సైన్యాధిపతులుగా రథాలకీ గుర్రపు రౌతులకీ అధిపతులుగా నియమించాడు.
10 These, moreover, were the chiefs of his officers whom King Solomon had, two hundred and fifty, —who wielded dominion over the people.
౧౦వీరిలో సమర్ధులైన 250 మంది సొలొమోను రాజు కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు.
11 And, the daughter of Pharaoh, Solomon brought up, out of the city of David, unto the house which he had built for her, —for he said, A wife of mine must not dwell in the house of David king of Israel, for holy are those places whereinto the ark of Yahweh hath come.
౧౧“ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పట్టణంలో నా భార్య నివాసం చేయకూడదు. యెహోవా మందసం ఉన్న స్థలాలు పవిత్రమైనవి” అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కోసం కట్టించిన నగరానికి తీసుకు వచ్చాడు.
12 Then, Solomon offered up ascending-sacrifices, unto Yahweh, —upon the altar of Yahweh, which he had built before the porch:
౧౨అప్పటినుండి సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.
13 even according to the duty of each a day upon [its own] day, offering up according to the commandment of Moses, for the sabbaths, and for the new moons, and for the appointed feasts, three times in the year, —in the festival of unleavened cakes and in the festival of weeks, and in the festival of booths;
౧౩అతడు అనుదిన ఏర్పాటు ప్రకారం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినాల్లో, అమావాస్య రోజుల్లో, సంవత్సరానికి మూడు సార్లు జరిగే నియామక పండగ రోజుల్లో, అంటే పొంగని రొట్టెల పండగ, వారాల పండగ, పర్ణశాలల పండగ రోజుల్లో యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.
14 and he caused to stand, according to the regulation of David his father, the courses of the priests over their service and of the Levites over their charges, to offer praise and to minister before the priests, for the duty of each day upon its own day, and the gate-keepers in their courses, at every several gate, —for, such, was the commandment of David the man of God;
౧౪అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు.
15 neither departed they from the commandment of the king, concerning the priests and the Levites as to any duty, or as to the treasuries.
౧౫ఏ విషయం గూర్చి అయినా, ఖజానాల గూర్చి అయినా రాజు యాజకులకు, లేవీయులకు చేసిన ఏర్పాటు ప్రకారం వారు అన్ని విషయాలూ జరిగించేవారు.
16 So all the work of Solomon was prepared, from the day of founding the house of Yahweh, even as far as the finishing thereof, —complete was the house of Yahweh.
౧౬యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకూ సొలొమోను ఆ పని సంపూర్ణంగా చేయించాడు. ఆ విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది.
17 Then, went Solomon to Ezion-geber, and unto Eloth on the seashore in the land of Edom.
౧౭సొలొమోను ఎదోము దేశపు సముద్ర తీరంలో ఉన్న ఎసోన్గెబెరుకు, ఏలతుకు వెళ్ళాడు.
18 And Huram sent him—by the hand of his servants—ships, and servants skilled in the sea, and they came, with the servants of Solomon, towards Ophir, and took from thence, four hundred and fifty talents of gold, —and brought unto King Solomon.
౧౮హీరాము తన పనివారి ద్వారా ఓడలనూ ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడనుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకు వచ్చారు.