< 1 Kings 19 >
1 And Ahab told Jezebel, all that Elijah had done, —and withal, how he had slain all the prophets with the sword.
౧ఏలీయా చేసిందంతా అతడు బయలు ప్రవక్తలందరినీ కత్తితో చంపించిన సంగతీ అహాబు యెజెబెలుకు చెప్పాడు.
2 Then sent Jezebel a messenger unto Elijah, saying, —So, let the gods do, and, so, let them add, if, by this time to-morrow, I make not thy life as the life of one of them.
౨యెజెబెలు ఒక వార్తాహరునితో ఏలీయాకు ఈ కబురు పంపింది “రేపు ఈ పాటికి చనిపోయిన ఆ ప్రవక్తల ప్రాణం లాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దాని కంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారు గాక.”
3 And, when he saw [that], he arose, and went for his life, and came to Beer-sheba, which belongeth to Judah, —and left his servant there.
౩ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు.
4 But, he himself, went into the wilderness a day’s journey, and came and sat down under a certain shrub, —and asked for his life, that he might die, and said—Enough, now, O Yahweh! take away my life, for, no better, am, I, than, my fathers.
౪అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు.
5 And, as he lay, and slept, under a certain shrub, lo! a messenger, touching him, who said to him—Rise, eat.
౫అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు.
6 So he looked about, and lo! at his head, a cake baked on hot stones, and a cruse of water, —and he did eat and drink, and then went back and lay down.
౬ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు.
7 And the messenger of Yahweh came again a second time, and touched him, and said—Rise, eat, —because, too much for thee, is the journey.
౭యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు.
8 So he arose, and did eat and drink, —and journeyed, in the strength of that eating, forty days and forty nights, as far as the mountain of God—Horeb.
౮అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.
9 And he entered, there, into a cave, and lodged there, —and lo! the word of Yahweh [came] unto him, and said to him, What doest thou here, Elijah?
౯అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు.
10 And he said—Very jealous, have I been, for Yahweh, God of hosts, because the sons of Israel have forsaken thy covenant, thine altars, have they thrown down, thy prophets, also have they slain with the sword, —and, I alone, am left, and they have sought my life, to take it.
౧౦అతడు “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు.
11 And he said—Go forth to-morrow, and stand in the mountain, before Yahweh. And lo! Yahweh, passing by, and a great and strong wind—rending the mountains, and breaking in pieces the crags, before Yahweh, Not, in the wind, was, Yahweh, —And, after the wind, an, earthquake, Not, in the earthquake, was, Yahweh;
౧౧యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు.
12 And, after the earthquake, a, fire, Not, in the fire, was, Yahweh, —And, after the fire, the voice of a gentle whisper.
౧౨ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది.
13 And it came to pass, when Elijah heard it, he wrapped his face in his mantle, and went forth, and stood at the entrance of the cave, —and lo! unto him, a voice; and it said—What doest thou here, Elijah?
౧౩ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?” అనే మాట వినిపించింది.
14 And he said—Very jealous, have I been, for Yahweh, God of hosts, because the sons of Israel have forsaken thy covenant, thine altars, have they thrown down, thy prophets also, have they slain with the sword, —and, I alone, am left, and they rove sought my life, to take it.
౧౪ఏలీయా “ఇశ్రాయేలు ప్రజలు నీ నిబంధనను వదిలేసి నీ బలిపీఠాలను పడగొట్టి నీ ప్రవక్తలను కత్తితో చంపేశారు. దూతల సైన్యాల నాయకుడు, యెహోవా కోసం మహా రోషంతో నేను ఒకణ్ణి మాత్రమే మిగిలితే, వారు నా ప్రాణం కూడా తీయడానికి చూస్తున్నారు” అని జవాబిచ్చాడు.
15 And Yahweh said unto him, Go, return to thy way, towards the wilderness of Damascus, —and, when thou enterest, then shalt thou anoint Hazael to be king over Syria;
౧౫అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి.
16 And, Jehu son of Minshi, shalt thou anoint to be king over Israel, —and, Elisha son of Shaphat of Abel-meholah, shalt thou anoint to be prophet in thy stead:
౧౬ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబేల్మెహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి.
17 Then shall it come to pass, that—him that escapeth the sword of Hazael, shall, Jehu, slay, —and, him that escapeth the sword of Jehu, shall, Elisha, slay;
౧౭హజాయేలు కత్తిని తప్పించుకొనే వారిని యెహూ చంపేస్తాడు. యెహూ కత్తిని తప్పించుకొనే వారిని ఎలీషా చంపేస్తాడు.
18 Yet will I leave remaining in Israel, seven thousand, —all knees which have not bowed to Baal, and all mouths which have not kissed to him.
౧౮అయినా ఇశ్రాయేలు ప్రజల్లో బయలుకు మొక్కకుండా, వాడి విగ్రహాన్ని ముద్దు పెట్టుకోకుండా ఇంకా 7,000 మంది నాకు మిగిలి ఉన్నారు.”
19 So he departed from thence, and found Elisha son of Shaphat, as he was plowing, with twelve yoke of oxen before him, he being with the twelfth, —so Elijah crossed over unto him, and cast his mantle towards him;
౧౯ఏలీయా అక్కడ నుండి వెళ్లిన తరువాత అతనికి షాపాతు కొడుకు ఎలీషా కనిపించాడు. అతడు తన దగ్గరున్న పన్నెండు జతల ఎడ్లతో దుక్కి దున్నిస్తూ పన్నెండవ కాడి తానే తోలుతున్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన పైబట్టను అతని మీద వేశాడు.
20 and he left the oxen, and ran after Elijah, and said—Let me, I pray thee, kiss my father and my mother, that I may follow thee. And he said unto him, —Go, turn back, for what have I done to thee?
౨౦అతడు ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంట పరిగెత్తి “నేను వెళ్లి నా తలిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను” అన్నాడు. ఏలీయా “వెళ్లి రా. నేను నీకేం చేశానో గుర్తు పెట్టుకో” అన్నాడు.
21 So he turned back from following him, and took the yoke of oxen, and sacrificed them, and, with the implements of the oxen, boiled their flesh, and gave unto the people, and they did eat, —then he arose, and followed Elijah, and ministered unto him.
౨౧ఎలీషా అతన్ని విడిచి వెళ్లి, కాడి ఎడ్లను వధించి వాటి మాంసాన్ని కాడి మానులతో వంట చేసి ప్రజలకు వడ్డించాడు. వారు భోజనం చేసిన తరువాత అతడు లేచి ఏలీయా వెంట వెళ్లి అతనికి సేవకుడయ్యాడు.