< Obadiah 1 >
1 The vision of Obadiah; what the Lord said about Edom: We have heard a report from the Lord, a messenger has been sent among the nations; Rise up, let us rise against Edom in battle!
౧ఓబద్యా దర్శనం. ఎదోము గురించి యెహోవా ప్రభువు ఈ విషయం చెబుతున్నాడు. యెహోవా నుంచి మేము ఒక నివేదిక విన్నాం. “లెండి. ఎదోము మీద యుద్ధం చేయడానికి కదలండి” అని దేవుడు ఒక రాయబారిని రాజ్యాలకు పంపాడు.
2 I will make you small among the nations, and despised by all!
౨నేను ఇతర రాజ్యాల్లో నిన్ను తక్కువ చేస్తాను. వాళ్ళు నిన్ను ద్వేషిస్తారు.
3 Your proud heart has misled you, you who live in the clefts of the rock, you who build on high your dwelling. You say to yourselves, “Who can bring me down to earth?”
౩నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు.
4 Though you build high as the eagle, though between the stars you set your nest, from there will I bring you down, says the Lord.
౪గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు.
5 If thieves had come to you, marauders by night would they not have stolen only as much as they needed? If grape-gatherers had come to you would they not have left some gleanings?
౫దొంగలు నీ దగ్గరికి వస్తే, వాళ్ళు రాత్రి పూట వచ్చి తమకు కావలసినంత వరకే దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లు పోగు చేసే వాళ్ళు నీ దగ్గరికి వస్తే కొన్ని పళ్ళు విడిచి పెడతారు గదా. అయితే, అయ్యో! నువ్వు బొత్తిగా నాశనమైపోయావు.
6 Descendents of Esau, all your treasures are looted.
౬ఏశావు వంశం వారిని పూర్తిగా దోచుకోవడం జరుగుతుంది. వాళ్ళు దాచిపెట్టిన ధనమంతా దోపిడీ అవుతుంది.
7 To your border they have driven you, all your allies have betrayed you. Your avowed friends have overpowered you, they have set a trap for you. Where is your wisdom now?
౭నీతో సంధి చేసినవారు నిన్ను తమ సరిహద్దు వరకూ పంపేస్తారు. నీతో సమాధానంగా ఉన్నవాళ్ళు నిన్ను మోసగించి ఓడిస్తారు. నీ అన్నం తిన్నవాళ్ళు నిన్ను పట్టుకోడానికి వల వేస్తారు. ఎదోము అర్థం చేసుకోలేడు.
8 The Lord says: On that day, I will destroy the wise of Edom, drive wisdom out of Mount Esau.
౮ఆ రోజు నేను ఏశావు పర్వతాల్లో తెలివి లేకుండా చేయనా? ఎదోములోని జ్ఞానులను నాశనం చేయనా? అని యెహోవా చెబుతున్నాడు.
9 Your warriors will be filled with terror, Teman, none will be left alive on Mount Esau.
౯తేమానూ, నీ శక్తిమంతులకు భయం వేస్తుంది. అందుచేత ఏశావు పర్వతాల్లో నివసించేవారంతా హతమవుతారు.
10 Because of the violence done to your relatives, the people of Jacob, shame covers you, you are cut off forever.
౧౦నీ సోదరుడు యాకోబుకు నువ్వు చేసిన దౌర్జన్యానికి నీకు అవమానం కలుగుతుంది. ఇక ఎప్పటికీ లేకుండా నువ్వు నిర్మూలమైపోతావు.
11 In the day when you stood aloof, in the day when strangers carried away their wealth, and strangers entered into their gates, and over Jerusalem cast lots, you were as one of those strangers.
౧౧నువ్వు దూరంగా నిల్చున్న రోజున, వేరే దేశం వాళ్ళు అతని ఆస్తిని తీసుకుపోయిన రోజున, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి యెరూషలేము మీద చీట్లు వేసిన రోజున నువ్వు కూడా వారిలో ఒకడిగా ఉన్నావు.
12 You should not have gloated over your relatives, in the day of their misfortune. You should not have exulted over the land of Judah in the day of their destruction. You should not have laughed loudly at their distress.
౧౨నీ సోదరుని దినాన, అతని దురవస్థ దినాన నువ్వు ఆనందించవద్దు. యూదావారి నాశన దినాన వారి స్థితి చూసి సంతోషించ వద్దు. వారి ఆపద్దినాలో అతిశయించ వద్దు.
13 You should not have entered in at the gate of my people in the day of their disaster. You should not have gloated over their calamity, in the day of their disaster, nor stretched out your hand after their wealth in the day of their disaster,
౧౩నా ప్రజల విపత్తు రోజున వారి గుమ్మాల్లో ప్రవేశించ వద్దు. వారి ఆపద్దినాలో సంతోషిస్తూ వారి బాధ చూడ వద్దు. వారి విపత్తు రోజున వారి ఆస్తిని దోచుకోవద్దు.
14 nor stood at the crossroads to cut down their fugitives, nor should you have betrayed their refugees in the day of distress.
౧౪వారిలో తప్పించుకున్న వారిని చంపేయడానికి అడ్డదారుల్లో నిలబడ వద్దు. ఆపద్దినాలో వారిలో మిగిలే వారిని శత్రువుల చేతికి అప్పగించవద్దు.
15 Near at hand is the Lord’s day for all the nations. As you have done so will it be done to you. Your deeds will come back on your own head.
౧౫రాజ్యాలకూ యెహోవా దినం దగ్గర పడింది. అప్పుడు నువ్వు చేసినట్టే నీకూ చేస్తారు. నువ్వు చేసిన పనులు నీ తల మీదికి తిరిగి వస్తాయి.
16 As you have drunk upon my holy mountain, so all the nations will drink in turn; They will drink deep and be as though they had not been.
౧౬మీరు నా పవిత్ర పర్వతం పై తాగినట్టు రాజ్యాలన్నీ ఎప్పుడూ తాగుతూ ఉంటాయి. తాము ఎన్నడూ ఉనికిలో లేని వారి లాగా ఉండి తాగుతుంటారు.
17 But on Mount Zion some will escape, it will be again holy, and those of the house of Jacob will again enter into their possessions.
౧౭అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.
18 For the house of Jacob will be a fire, and the house of Joseph a flame, but the house of Esau will become stubble. They will kindle and devour it. Not even one of the house of Esau will escape, for the Lord has spoken.
౧౮యాకోబు వంశం వారు నిప్పులా, యోసేపు వంశం వారు మంటలా ఉంటారు. ఏశావు వంశం వారు ఎండు గడ్డిలా ఉంటారు. నిప్పు వారిని కాల్చేసి దహించేస్తుంది. ఏశావు వంశంలో ఎవరూ మిగలరు, అని యెహోవా చెప్పాడు.
19 They will possess the Negeb and Mount Esau, and the Shephelah of the Philistines. They will possess the territory of Ephraim and Samaria, and Benjamin will possess Gilead.
౧౯దక్షిణ దిక్కున నివసించేవారు ఏశావు పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు. మైదాన ప్రాంతాల్లో ఉండే వారు ఫిలిష్తీయుల దేశాన్నిస్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు ఎఫ్రాయిం ప్రజల భూములనూ సమరయ ప్రజల భూములనూ స్వాధీనం చేసుకుంటారు. బెన్యామీను ప్రజలు గిలాదు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు.
20 The exiles of Israel will possess the land of the Canaanites as far as Zarephath. The captives of Jerusalem who are in Sepharad will possess the cities of the Negreb.
౨౦ఇశ్రాయేలీయుల్లో బందీలుగా దేశాంతరం పోయినవారు సారెపతు వరకూ కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెరూషలేము వారిలో బందీలుగా సెఫారాదుకు పోయిన వారు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు.
21 The rescued will come up on Mount Zion to rule Mount Esau, and the kingdom will belong to the Lord.
౨౧ఏశావు పర్వతాన్ని శిక్షించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు. అప్పుడు రాజ్యం యెహోవాది అవుతుంది.