< John 14 >
1 “Don’t let your heart be troubled. Believe in God. Believe also in me.
౧“మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి.
2 In 'Avi ·my Father·’s house are many homes. If it was not so, I would have told you. I am going to prepare a place for you.
౨నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను.
3 If I go and prepare a place for you, I will come again, and will receive you to myself; that where I am, you may be there also.
౩నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను.
4 Where I go, you know, and you know the way.”
౪నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు.
5 Thomas [Seeker of truth] said to him, “Lord, we don’t know where you are going. How can we know the way?”
౫తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు.
6 Yeshua [Salvation] said to him, “Ena Na [I AM (the Living God)] the way, the truth, and the life. No one comes to haAbba ·the Father·, except through me.
౬యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.
7 If you had known me, you would have known 'Avi ·my Father· also. From now on, you know him, and have seen him.”
౭మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు.
8 Philip [Loves horses] said to him, “Lord, show us haAbba ·the Father·, and that will be enough for us.”
౮ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు.
9 Yeshua [Salvation] said to him, “Have I been with you such a long time, and do you not know me, Philip [Loves horses]? He who has seen me has seen haAbba ·the Father·. How do you say, ‘Show us haAbba ·the Father·?’
౯యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు?
10 Don’t you trust that I am in haAbba ·the Father·, and haAbba ·the Father· in me? The words that I tell you, I speak not from myself; but haAbba ·the Father· who lives in me does his works.
౧౦నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు.
11 Believe me that I am in haAbba ·the Father·, and haAbba ·the Father· in me; or else trust me for the very works’ sake.
౧౧తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి.
12 Most certainly I tell you, he who trusts in me, the works that I do, he will do also; and he will do greater works than these, because I am going to 'Avi ·my Father·.
౧౨నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.
13 Whatever you will ask in my name, that will I do, that haAbba ·the Father· may be glorified in the Son.
౧౩“మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది.
14 If you will ask anything in my name, I will do it.
౧౪మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.
15 If you have agapao ·totally devoted love· for me, keep my commandments.
౧౫మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.
16 I will pray to haAbba ·the Father·, and he will give you another Counselor, that he may be with you forever, (aiōn )
౧౬“నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. (aiōn )
17 haRuach [the Spirit, Breath] of truth, whom the world can’t receive; for it does not see him, neither knows him. You know him, for he lives with you, and will be in you.
౧౭ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు.
18 I will not leave you orphans. I am coming to you.
౧౮నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను.
19 Yet a little while, and the world will see me no more; but you will see me. Because I live, you will live also.
౧౯కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు. కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు.
20 In that day you will know that I am in 'Avi ·my Father·, and you in me, and I in you.
౨౦నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకుంటారు.
21 One who has my commandments, and keeps them, that person is one who has agapao ·totally devoted love· for me. One who has agapao ·total devotion love· for me will receive agapao ·total devotion love· from 'Avi ·my Father·, and I will have agapao ·totally devoted love· for him, and will reveal myself to him.”
౨౧నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు.
22 Judas [Praised] (not Iscariot) said to him, “Lord, what has happened that you are about to reveal yourself to us, and not to the world?”
౨౨యూదా (ఇస్కరియోతు కాక వేరొక యూదా) యేసుతో, “ప్రభూ, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?” అన్నాడు.
23 Yeshua [Salvation] answered him, “If a man has agapao ·total devotion love· for me, he will keep my word. 'Avi [My Father] will have agapao ·total devoted love· for him, and we will come to him, and make our home with him.
౨౩యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.
24 He who does not have agapao ·total devotion love· for me does not keep my words. The word which you hear is not mine, but from haAbba ·the Father· who sent me.
౨౪నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.
25 I have said these things to you, while still living with you.
౨౫మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను.
26 But the Counselor, Ruach haKodesh [Spirit, Breath of the Holiness], whom Abba ·Father familiar, Dear Dad· will send in my name, he will teach you all things, and will remind you of all that I said to you.
౨౬నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు.
27 Shalom ·Complete peace· I leave with you. I am giving you my shalom ·complete peace·; not as the world gives, give I to you. Don’t let your heart be troubled, neither let it be fearful.
౨౭శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి.
28 You heard how I told you, ‘I go away, and I come to you.’ If you have agapao ·total devotion love· for me, you would have rejoiced, because I said ‘I am going to 'Avi ·my Father·;’ for Abba ·Father familiar, Dear Dad· is greater than I.
౨౮‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు.
29 Now I have told you before it happens so that, when it happens, you may trust.
౨౯ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం.
30 I will no more speak much with you, for the prince of the world comes, and he has nothing in me.
౩౦ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు.
31 But that the world may know that I have agapao ·total devotion love· for haAbba ·the Father·, I do as haAbba ·the Father· enjoined me. Arise, let us go from here.
౩౧నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.”