< Jeremiah 20 >
1 Now Pashur, the son of Immer, the priest, who was also chief overseer in the house of Jehovah, heard Jeremiah prophesying these things.
౧ఇమ్మేరు కొడుకు పషూరు యాజకుడు. యెహోవా మందిరంలో పెద్ద నాయకుడు. యిర్మీయా ఆ ప్రవచనాలను పలుకుతుంటే విన్నాడు.
2 Then Pashur smote Jeremiah the prophet, and put him in the stocks, that were at the high gate of Benjamin, which was in the house of Jehovah.
౨కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.
3 And on the next day Pashur took Jeremiah out of the stocks. Then said Jeremiah to him, Jehovah calleth thee, not Pashur, but Magor-missabib [[not Safety on every side, but Terror on every side]].
౩మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. “యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. ‘మాగోర్ మిస్సాబీబ్’ అని పెడతాడు.”
4 For thus saith Jehovah: Behold, I am about to make thee a terror to thyself and to all thy friends; and they shall fall by the sword of their enemies, thine eyes looking on; and all Judah will I give into the hand of the king of Babylon, who shall carry them captive to Babylon, and shall smite them with the sword.
౪యెహోవా ఈ మాట చెబుతున్నాడు. “నీకూ నీ స్నేహితులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు తమ శత్రువుల కత్తికి గురై కూలుతారు. యూదా వాళ్ళందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోను తీసుకుపోతాడు. కత్తితో వాళ్ళను చంపేస్తాడు.
5 And I will give all the wealth of this city, and all its possessions, and all its precious things, and all the treasures of the kings of Judah will I give, into the hand of their enemies, and they shall spoil them, and take them and carry them to Babylon.
౫ఈ పట్టణంలోని సంపద అంతా, దాని ఆస్తి, విలువైన వస్తువులన్నీ యూదా రాజుల ఖజానా అంతా నేనప్పగిస్తాను. మీ శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకుని బబులోను తీసుకుపోతారు.
6 And thou, Pashur, and all that dwell in thy house, shall go into captivity; thou shalt go to Babylon, and there shalt thou die, and there shalt thou be buried, thou, and all thy friends, to whom thou hast prophesied falsely.
౬పషూరు! నువ్వూ నీ ఇంట్లో నివాసముంటున్న వాళ్ళంతా బందీలుగా పోతారు. నువ్వు బబులోను వెళ్లి అక్కడే చస్తావు. నీ ప్రవచనాలతో నువ్వు మోసపుచ్చిన నీ స్నేహితులందరినీ బబులోనులో పాతిపెడతారు.
7 Thou didst persuade me, O Jehovah, and I was persuaded; Thou wast stronger than I, and didst prevail. But I am in derision daily, Every one mocketh me.
౭యెహోవా, నువ్వు నన్ను ప్రేరేపించావు. నీ ప్రేరేపణకు నేను లొంగిపోయాను. నువ్వు నన్ను గట్టిగా పట్టుకుని గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు.
8 For whenever I speak, I cry out on account of violence, And complain of oppression; For the word of Jehovah bringeth upon me reproach, And daily derision.
౮ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిసారీ కేకలేస్తూ ‘దుర్మార్గం, నాశనం’ అని చాటించాను. రోజంతా యెహోవా మాట నాకు అవమానం, ఎగతాళి అయింది.
9 So I say, I will no more make mention of him, Nor speak any more in his name; But his word is in my heart like a burning fire, shut up in my bones, And I am weary with forbearing, And I cannot refrain.
౯‘ఇక నుంచి నేను యెహోవా గురించి ఆలోచించను, ఆయన పేరు ఎత్తను’ అనుకుంటే అది నా గుండెలో మండినట్టుంది. నా ఎముకల్లో మంట పెట్టినట్టుంది. నేను ఓర్చుకుందాం అనుకుంటున్నాను గానీ నావల్ల కావడం లేదు.
10 For I hear the slander of many, terror on every side; “Tell us something against him, and we will denounce him.” All my familiar friends, they who leave not my side, [[say, ]] “Perhaps he will be enticed, So that we may prevail against him, And take our revenge on him.”
౧౦చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు.
11 But Jehovah is on my side, like a mighty champion, Therefore shall my persecutors stumble, and not prevail; They shall be covered with shame, because they act not wisely, —With everlasting shame, that shall not be forgotten.
౧౧అయితే బలం గల యుద్ధవీరుడులాగా యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి నన్ను హింసించేవాళ్ళు నన్ను గెలవలేక తొట్రుపడిపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించలేక సిగ్గుపాలవుతారు. వాళ్ళ అవమానం ఎప్పటికీ ఉంటుంది.
12 O Jehovah of hosts, thou that provest the righteous, That seest the reins and the heart, Let me see thy vengeance on them, For to thee have I laid open my cause!
౧౨సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు.
13 Sing to Jehovah! Praise ye Jehovah! For he delivereth the oppressed From the hand of evil-doers.
౧౩యెహోవాకు పాట పాడండి! యెహోవాను స్తుతించండి! దుర్మార్గుల చేతిలోనుంచి అణగారిన వారి ప్రాణాన్ని ఆయన తప్పించాడు.
14 Cursed be the day on which I was born; Let not the day on which my mother bore me be blessed!
౧౪నేను పుట్టిన రోజు శపితమౌతుంది గాక. నా తల్లి నన్ను కనిన రోజు శుభదినం అని ఎవరూ అనరుగాక.
15 Cursed be the man who brought the tidings to my father, Saying, “A son is born to thee,” making him very glad!
౧౫‘నీకు బాబు పుట్టాడు’ అని నా తండ్రికి కబురు తెచ్చి అతనికి ఆనందం తెచ్చినవాడు శాపానికి గురి అవుతాడు గాక.
16 Let that man be like the cities which Jehovah overthrew, and relented not; Let him hear an outcry in the morning, And an alarm at noontide;
౧౬ఏమీ జాలి లేక యెహోవా నాశనం చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక! ఉదయాన ఆర్త ధ్వనినీ మధ్యాహ్నం యుద్ధ ధ్వనినీ అతడు వినుగాక!
17 Because he slew me not before I saw the light, So that my mother might have been my grave, And her womb have been great with me forever!
౧౭యెహోవా నన్ను గర్భంలోనే చంపలేదు. నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ నన్ను గర్భాన మోసేలా చేయలేదు.
18 Wherefore came I forth from the womb, to see weariness and sorrow, And that my days might be consumed in shame?
౧౮కష్టం, దుఖం, అనుభవిస్తూ నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను. ఇందుకేనా నేను గర్భంలోనుంచి బయటికి వచ్చింది?”