< Acts 4 >

1 And while they were speaking to the people, the priests and the captain of the temple and the Sadducees came upon them,
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు.
2 being indignant that they taught the people, and proclaimed in Jesus the resurrection from the dead.
వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు.
3 And they laid hands upon them, and put them in prison until the next day; for it was now evening.
వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు.
4 Many however of those who heard the word believed; and the number of the men became five thousand.
కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు.
5 And it came to pass on the next day, that their rulers and elders and scribes,
మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.
6 and Annas the high-priest, and Caiaphas, and John, and Alexander, and as many as were of the kindred of the high-priest, were gathered together at Jerusalem.
ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు.
7 And when they had set them in the midst, they asked, By what power, or by what name, did ye do this?
వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు.
8 Then Peter, filled with the Holy Spirit, said to them, Rulers of the people, and elders of Israel!
పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా,
9 If we are this day examined in respect to a good deed done to a cripple, by what means he hath been restored,
ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా.
10 be it known to you all, and to all the people of Israel, that by the name of Jesus Christ the Nazarene, whom ye crucified, whom God raised from the dead, —by him doth this man stand here before you sound.
౧౦మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు.
11 This is the stone which was set at nought by you the builders, which is become a cornerstone.
౧౧ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది.
12 And there is salvation in no other; for there is not another name under heaven, that hath been given among men, by which we must be saved.
౧౨ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”
13 And when they beheld the boldness of Peter and John, and perceived that they were unlearned and common men, they wondered; and they recognized them as having been with Jesus.
౧౩వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.
14 And seeing the man that had been cured standing with them, they could say nothing in reply.
౧౪బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.
15 But when they had commanded them to go aside out of the council, they conferred among themselves,
౧౫అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని,
16 saying, What shall we do to these men? for that indeed a remarkable sign hath been wrought by them is manifest to all that dwell in Jerusalem; and we cannot deny it.
౧౬‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం.
17 But that it spread no further among the people, let us strictly forbid them with threats to speak any longer in this name to any one.
౧౭అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు.
18 And they called them, and commanded them not to speak at all, nor teach, in the name of Jesus.
౧౮అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు.
19 But Peter and John answered and said to them, Whether it is right in the sight of God to hearken to you rather than to God, judge ye.
౧౯అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి.
20 For we cannot but speak the things which we saw and heard.
౨౦మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.
21 So, having further threatened them, they let them go, finding no way to punish them, on account of the people; because all were glorifying God for that which had been done.
౨౧ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు.
22 For the man was above forty years old, on whom this sign of the healing had been wrought.
౨౨అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.
23 And being released they went to their own company, and reported all that the chief priests and elders had said to them.
౨౩పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు.
24 And on hearing it, they lifted up their voice to God with one accord, and said, Lord, thou art he that made heaven and earth and sea, and all things that are in them;
౨౪వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.
25 who by the mouth of thy servant David said, “Why did the heathen rage, and the peoples meditate vain things?
౨౫యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు? ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు?
26 The kings of the earth came up, and the rulers assembled together, against the Lord, and against his Anointed.”
౨౬ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు, అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.
27 For in truth against thy holy servant Jesus, whom thou didst anoint, did both Herod and Pontius Pilate, with the gentiles, and the peoples of Israel, assemble in this city,
౨౭ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా
28 to do whatever thy hand and thy will before determined to be done.
౨౮హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు.
29 And now, Lord, look upon their threatenings, and grant to thy servants that with all boldness they may speak thy word,
౨౯ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా,
30 while thou stretchest forth thy hand to heal, and signs and wonders are wrought through the name of thy holy servant Jesus.
౩౦నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’
31 And when they had prayed, the place was shaken where they were assembled; and they were all filled with the Holy Spirit, and they spoke the word of God with boldness.
౩౧వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
32 And the multitude of those who believed were of one heart, and of one soul; and not one of them said that aught of the things which he possessed was his own; but they had all things common.
౩౨విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు.
33 And with great power did the apostles give their testimony to the resurrection of the Lord Jesus; and great grace was upon them all.
౩౩అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది.
34 For there was no one among them that was in want; for as many as were possessors of lands or houses sold them, and brought the prices of the things that were sold,
౩౪భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు.
35 and laid them at the feet of the apostles; and distribution was made to every one, according as he had need.
౩౫వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.
36 And Joseph, who by the apostles was surnamed Barnabas, (which is, when interpreted, Son of consolation, ) a Levite, born in Cyprus,
౩౬సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’
37 having land, sold it, and brought the money, and laid it at the feet of the apostles.
౩౭ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.

< Acts 4 >