< 2 Thessalonians 3 >
1 Finally, brethren, pray for us, that the word of the Lord may run and be glorified, as with you,
౧ఇక ఇతర విషయాలకు వస్తే సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు వేగంగా వ్యాపించి ఘనత పొందేలా,
2 and that we may be delivered from unreasonable and wicked men; for it is not all that have faith.
౨మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.
3 But faithful is the Lord, who will establish you, and guard you from evil.
౩అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.
4 And we have confidence in the Lord concerning you, that ye both do and will do the things which we command you.
౪మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది.
5 And the Lord direct your hearts to the love of God, and to perseverance in the cause of Christ.
౫దేవుని ప్రేమా క్రీస్తు సహనమూ మీకు కలిగేలా ప్రభువు మీ హృదయాలను నడిపిస్తాడు గాక!
6 Now we charge you, brethren, in the name of the Lord Jesus Christ, that ye withdraw yourselves from every brother that walketh disorderly, and not after the tradition which they received of us.
౬సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం.
7 For ye yourselves know how ye ought to imitate us; for we behaved not ourselves disorderly among you,
౭మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు.
8 neither did we eat any man's bread for nought, but were working with labor and travail night and day, that we might not be burdensome to any of you.
౮ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
9 Not because we have not authority, but to make ourselves an example to you, that ye should imitate us.
౯మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు.
10 For also when we were with you, this we commanded you: If any one will not work, neither let him eat.
౧౦అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా!
11 For we hear of some who walk among you disorderly, working not at all, but are busybodies.
౧౧మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం.
12 Now such we charge and exhort in the Lord Jesus Christ, that with quietness they work, and eat their own bread.
౧౨అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
13 But ye, brethren, be not weary in well-doing.
౧౩సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు.
14 And if any one obey not our word by this epistle, mark that man; and keep no company with him, that he may be shamed;
౧౪ఈ పత్రికలో మేము చెప్పిన ఆదేశాలకు ఎవరైనా లోబడకపోతే వాణ్ణి కనిపెట్టి ఉండండి. అతనికి సిగ్గు కలిగేలా అతనితో కలిసి ఉండవద్దు.
15 yet count him not as an enemy, but admonish him as a brother.
౧౫అయితే అతణ్ణి శత్రువుగా భావించకండి. సోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి.
16 Now the Lord of peace himself give you peace always in every way; the Lord be with you all.
౧౬శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక!
17 The salutation by the hand of me, Paul; which is the token in every letter; so I write.
౧౭నేను పౌలును, నా చేతి రాతతో మీకు అభివందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి పత్రికలోనూ ఇలాగే రాస్తాను.
18 The grace of our Lord Jesus Christ be with you all.
౧౮మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండు గాక!