< Proverbs 20 >
1 Wine is a mocker, and beer is a brawler. Whoever is led astray by them is not wise.
౧ద్రాక్ష మద్యం ఎగతాళి పాలు చేస్తుంది. సారాయి మనిషిని గిల్లికజ్జాలు పెట్టుకునేలా చేస్తుంది. తప్ప తాగి దారి తప్పేవాడు బుద్ధి లేని వాడు.
2 The terror of a king is like the roaring of a lion. He who provokes him to anger forfeits his own life.
౨రాజు వల్ల కలిగే భయం సింహగర్జన వంటిది. రాజుకు కోపం రేపే వాడు తన ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టుకుంటాడు.
3 It is an honor for a person to keep away from strife, but every fool quarrels.
౩కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.
4 The sluggard will not plow by reason of the winter; therefore he shall beg in harvest, and have nothing.
౪నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.
5 Counsel in the heart of man is like deep water; but a man of understanding will draw it out.
౫మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడు.
6 Many men claim to be men of unfailing love, but who can find a faithful man?
౬నేను నమ్మదగిన వాణ్ణి అని చాలామంది చెప్పుకుంటారు. అయితే నమ్మదగిన వాడు ఎవరికి కనిపిస్తాడు?
7 A righteous man walks in integrity; blessed are his children after him.
౭యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు.
8 A king who sits on the throne of judgment scatters away all evil with his eyes.
౮న్యాయపీఠంపై కూర్చున్న రాజు తన కళ్ళతో చెడుతనాన్ని చెదరగొడతాడు.
9 Who can say, "I have made my heart pure. I am clean and without sin?"
౯నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. పాపమంతా వదిలించుకున్నాను అని ఎవరు అనగలరు?
10 Differing weights and differing measures, both of them alike are an abomination to the LORD.
౧౦వేరువేరు తూకం రాళ్లు వేరువేరు కొలత గిన్నెలు, ఈ రెంటినీ యెహోవా అసహ్యించుకుంటాడు.
11 Even a child makes himself known by his doings, whether his work is pure, and whether it is right.
౧౧చిన్నవాళ్ళను సైతం వారి చర్యలను బట్టి, వారి ప్రవర్తన శుద్ధమైనదా, యథార్థమైనదా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పవచ్చు.
12 The hearing ear, and the seeing eye, The LORD has made even both of them.
౧౨వినగల చెవి చూడగల కన్ను ఈ రెంటిని యెహోవాయే చేశాడు.
13 Do not love sleep, lest you come to poverty. Open your eyes, and you shall be satisfied with bread.
౧౩అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
14 "It's no good, it's no good," says the buyer; but when he is gone his way, then he boasts.
౧౪కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు.
15 There is gold and abundance of rubies; but the lips of knowledge are a rare jewel.
౧౫బంగారం, విస్తారంగా రత్నాలు ఉన్నాయి. కానీ వివేకంగా మాట్లాడే పెదాలు అమూల్యమైన ఆభరణాలు.
16 Take the garment of one who puts up collateral for a stranger; and hold him in pledge for a wayward woman.
౧౬పరాయివాడికి హామీగా ఉన్నవాడి బట్టలు తీసుకో. వ్యభిచారిణి కోసం పూచీ తీసుకున్న వాణ్ణి బాధ్యుడుగా ఎంచు.
17 Fraudulent food is sweet to a man, but afterwards his mouth is filled with gravel.
౧౭మోసం చేసి తెచ్చిన ఆహారం మనుషులకు మధురంగా ఉంటుంది. కానీ తరువాత నోరంతా మట్టిగొట్టుకు పోతుంది.
18 Plans are established by advice; by wise guidance you wage war.
౧౮ఉద్దేశాలు ఆలోచనచేత స్థిరం అవుతాయి. వివేక పూరితమైన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చెయ్యి.
19 He who goes about as a tale-bearer reveals secrets; therefore do not keep company with him who opens wide his lips.
౧౯కొండేలు చెప్తూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయట పెడతాడు. కాబట్టి వాగుడు కాయల జోలికి పోవద్దు.
20 Whoever curses his father or his mother, his lamp shall be put out in blackness of darkness.
౨౦తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడి దీపం కారుచీకట్లో ఆరిపోతుంది.
21 An inheritance quickly gained at the beginning, won't be blessed in the end.
౨౧నడమంత్రపు సిరి వల్ల చివరకూ దీవెనలు రావు.
22 Do not say, "I will pay back evil." Wait for the LORD, and he will save you.
౨౨కీడుకు ప్రతికీడు తలపెట్టవద్దు. యెహోవా కోసం కనిపెట్టుకో. ఆయన నిన్ను కాపాడుతాడు.
23 The LORD detests differing weights, and dishonest scales are no good.
౨౩అన్యాయమైన తూకం రాళ్లు యెహోవాకు అసహ్యం. దొంగ త్రాసును ఆయన ఒప్పుకోడు.
24 A man's steps are from the LORD; how then can man understand his way?
౨౪మనిషి ప్రవర్తన యెహోవా వశంలో ఉంటుంది. తనకు జరగబోయేది అతనికి ఎలా తెలుస్తుంది?
25 It is a snare to a man to make a rash dedication, then later to consider his vows.
౨౫తొందరపడి, ఇది దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పడం, మొక్కుబడి చేసిన తరువాత దాన్ని గూర్చి విచారించడం ప్రమాద హేతువు.
26 A wise king winnows out the wicked, and drives the threshing wheel over them.
౨౬జ్ఞానంగల రాజు భక్తిహీనులను చెల్లా చెదరు చేసేస్తాడు. అలాటి వాళ్ళ మీద బరువైన చక్రం దొర్లిస్తాడు.
27 The spirit of man is the LORD's lamp, searching all his innermost parts.
౨౭మనిషి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది.
28 Love and faithfulness keep the king safe. His throne is sustained by love.
౨౮కృప, సత్యం రాజుకు రక్ష. కృప మూలంగా అతడు తన సింహాసనాన్ని పదిలం చేసుకుంటాడు.
29 The glory of young men is their strength. The splendor of old men is their gray hair.
౨౯యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం.
30 Wounding blows cleanse away evil, and beatings purge the innermost parts.
౩౦గాయాలు చేసే దెబ్బలు మనసు లోతుల్లోకి దూరి చెడుతనాన్ని పరిహరిస్తాయి.