< Mark 13 >
1 And as He is going forth out of the temple, one of His disciples says to Him, “Teacher, see! What stones! And what buildings!”
౧యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు.
2 And Jesus answering said to him, “See these great buildings? There may not be left a stone on a stone that may not be thrown down.”
౨యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అన్నాడు.
3 And as He is sitting at the Mount of Olives, opposite the temple, Peter, and James, and John, and Andrew, were questioning Him by Himself,
౩యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు.
4 “Tell us when these things will be? And what [is] the sign when all these may be about to be fulfilled?”
౪“ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా?”
5 And Jesus answering them, began to say, “Take heed lest anyone may lead you astray,
౫యేసు వారితో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి.
6 for many will come in My Name, saying, I am [He], and many they will lead astray;
౬చాలా మంది నా పేరుతో వచ్చి ‘నేనే ఆయనను’ అంటూ చాలా మందిని మోసం చేస్తారు.
7 and when you may hear of wars and reports of wars, do not be troubled, for these ought to be, but the end [is] not yet;
౭మీరు యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు.
8 for nation will rise against nation, and kingdom against kingdom, and there will be earthquakes in various places, and there will be famines and troubles; these [are the] beginning of travails.
౮జనం మీదికి జనం, దేశం మీదికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే.
9 And take heed to yourselves, for they will deliver you up to Sanhedrins, and to synagogues, you will be beaten, and before governors and kings you will be set for My sake, for a testimony to them;
౯మీరు జాగ్రతగా ఉండండి! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది.
10 and to all the nations it is first necessary that the good news be proclaimed.
౧౦అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.
11 And when they may lead you, delivering up, do not be anxious beforehand what you may speak, nor premeditate, but whatever may be given to you in that hour, that speak, for it is not you who are speaking, but the Holy Spirit.
౧౧వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారుపడకండి. ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ.
12 And brother will deliver up brother to death, and father child, and children will rise up against parents, and will put them to death,
౧౨సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తాడు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు.
13 and you will be hated by all because of My Name, but he who has endured to the end—he will be saved.
౧౩నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని, చివరి వరకూ సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు.
14 And when you may see the abomination of the desolation, that was spoken of by Daniel the prophet, standing where it should not (whoever is reading let him understand), then those in Judea, let them flee to the mountains;
౧౪“వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి.
15 and he on the housetop, do not let him come down into the house, nor come in to take anything out of his house;
౧౫మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు.
16 and he who is in the field, do not let him turn to the things behind, to take up his garment.
౧౬పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు.
17 And woe to those with child, and to those giving suck, in those days;
౧౭గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం.
18 and pray that your flight may not be in winter,
౧౮ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.
19 for those days will be tribulation, such as has not been from the beginning of the creation that God created, until now, and may not be [again];
౧౯ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.
20 and if the LORD did not shorten the days, no flesh had been saved; but because of the chosen, whom He chose to Himself, He shortened the days.
౨౦దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు.
21 And then, if any may say to you, Behold, here [is] the Christ, or, Behold, there, you may not believe;
౨౧ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.
22 for there will rise false Christs and false prophets, and they will give signs and wonders, to seduce, if possible, also the chosen;
౨౨కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.
23 and you, take heed; behold, I have foretold you all things.
౨౩అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.
24 But in those days, after that tribulation, the sun will be darkened, and the moon will not give her light,
౨౪“ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు.
25 and the stars of the sky will be falling, and the powers that are in the heavens will be shaken.
౨౫ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి.
26 And then they will see the Son of Man coming in clouds with much power and glory,
౨౬అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు.
27 and then He will send His messengers, and gather together His chosen from the four winds, from the end of the earth to the end of heaven.
౨౭అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”
28 And from the fig tree learn the allegory: when the branch may already become tender, and may put forth the leaves, you know that the summer is near;
౨౮“అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు.
29 so you, also, when you may see these coming to pass, you know that it is near, at the doors.
౨౯అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి.
30 Truly I say to you that this generation may not pass away until all these things may come to pass;
౩౦నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి.
31 the heaven and the earth will pass away, but My words will not pass away.
౩౧ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
32 And concerning that day and the hour no one has known—not even the messengers who are in Heaven, not even the Son—except the Father.
౩౨అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.
33 Take heed, watch and pray, for you have not known when the time is;
౩౩జాగ్రతగా ఉండండి. సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు.
34 as a man who is gone abroad, having left his house, and given to his servants the authority, and to each one his work, also commanded the doorkeeper that he may watch;
౩౪“ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్ళిన ఒక మనిషిలాగా ఉంటుంది. అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు.
35 watch, therefore, for you have not known when the lord of the house comes, at evening, or at midnight, or at rooster-crowing, or at the morning;
౩౫కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, అర్థరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు.
36 lest, having come suddenly, he may find you sleeping;
౩౬ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త!
37 and what I say to you, I say to all, Watch!”
౩౭నేను మీకు చెబుతున్నది అందరికి చెప్తున్నాను, మెలకువగా ఉండండి.”