< Jonah 4 >
1 And it is grievous to Jonah—a great evil—and he is displeased at it;
౧కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు.
2 and he prays to YHWH, and he says, “Ah, now, O YHWH, is this not my word while I was in my own land—therefore I was beforehand [going] to flee to Tarshish—that I have known that You [are] a God, gracious and merciful, slow to anger, and abundant in kindness, and relenting of evil?
౨కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. “నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు.
3 And now, O YHWH, please take my soul from me, for better [is] my death than my life.”
౩కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.”
4 And YHWH says, “Is doing good displeasing to you?”
౪అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు.
5 And Jonah goes forth from the city, and sits on the east of the city, and makes a shelter for himself there, and sits under it in the shade, until he sees what is in the city.
౫అప్పుడు యోనా ఆ పట్టణం నుంచి వెళ్లి దానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసుకుని, పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని, ఆ పందిరి నీడలో కూర్చున్నాడు.
6 And YHWH God appoints a gourd, and causes it to come up over Jonah, to be a shade over his head, to give deliverance to him from his affliction, and Jonah rejoices because of the gourd [with] great joy.
౬యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు.
7 And God appoints a worm at the going up of the dawn on the next day, and it strikes the gourd, and it dries up.
౭మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది.
8 And it comes to pass, about the rising of the sun, that God appoints a cutting east wind, and the sun strikes on the head of Jonah, and he wraps himself up, and asks for his soul to die, and says, “Better [is] my death than my life.”
౮ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు.
9 And God says to Jonah: “Is doing good displeasing to you, because of the gourd?” And he says, “To do good is displeasing to me—to death.”
౯అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు.
10 And YHWH says, “You have had pity on the gourd, for which you did not labor, neither did you nourish it, which came up [as] a son of night, and perished [as] a son of night,
౧౦అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది.
11 and I—do I not have pity on Nineveh, the great city, in which there are more than one hundred twenty thousand of mankind, who have not known between their right hand and their left—and much livestock?”
౧౧అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.