< Exodus 3 >
1 And Moses has been feeding the flock of his father-in-law Jethro, priest of Midian, and he leads the flock behind the wilderness, and comes to the mountain of God, to Horeb;
౧మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు.
2 and the Messenger of YHWH appears to him in a flame of fire, out of the midst of the bush, and he sees, and behold, the bush is burning with fire, and the bush is not consumed.
౨అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు.
3 And Moses says, “Now I turn aside and see this great appearance. Why is the bush not burned?”
౩అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు.
4 And YHWH sees that he has turned aside to see, and God calls to him out of the midst of the bush and says, “Moses! Moses!” And he says, “Here I [am].”
౪దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు “మోషే, మోషే” అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.
5 And He says, “Do not come near here. Cast your shoes from off your feet, for the place on which you are standing is holy ground.”
౫అందుకు ఆయన “దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది” అన్నాడు.
6 He also says, “I [am] the God of your father, God of Abraham, God of Isaac, and God of Jacob”; and Moses hides his face, for he is afraid to look toward God.
౬ఆయన ఇంకా “నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి” అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు.
7 And YHWH says, “I have certainly seen the affliction of My people who [are] in Egypt, and I have heard their cry because of its exactors, for I have known its pains;
౭యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు.
8 and I go down to deliver it out of the hand of the Egyptians, and to cause it to go up out of the land to a land good and broad, to a land flowing with milk and honey—to the place of the Canaanite, and the Hittite, and the Amorite, and the Perizzite, and the Hivite, and the Jebusite.
౮కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను.
9 And now, behold, the cry of the sons of Israel has come to Me, and I have also seen the oppression with which the Egyptians are oppressing them,
౯నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను.
10 and now, come, and I send you to Pharaoh; and bring out My people, the sons of Israel, from Egypt.”
౧౦నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.”
11 And Moses says to God, “Who [am] I, that I go to Pharaoh, and that I bring out the sons of Israel from Egypt?”
౧౧అప్పుడు మోషే దేవునితో “ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?” అని అన్నాడు.
12 And He says, “Because I am with you, and this [is] the sign to you that I have sent you: in your bringing out the people from Egypt—you serve God on this mountain.”
౧౨దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు.
13 And Moses says to God, “Behold, I am coming to the sons of Israel, and have said to them, The God of your fathers has sent me to you, and they have said to me, What [is] His Name? What do I say to them?”
౧౩మోషే “నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ‘ఆయన పేరేమిటి?’ అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?” అని దేవుణ్ణి అడిగాడు.
14 And God says to Moses, “I AM THAT WHICH I AM.” He also says, “Thus you say to the sons of Israel: I AM has sent me to you.”
౧౪అందుకు దేవుడు “నేను శాశ్వతంగా ఉన్నవాణ్ణి, అనే పేరు గల వాణ్ణి. ఉన్నవాడు అనే ఆయన నన్ను మీ దగ్గరికి పంపించాడు, అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు” అని మోషేతో చెప్పాడు.
15 And God says again to Moses, “Thus you say to the sons of Israel: YHWH, God of your fathers, God of Abraham, God of Isaac, and God of Jacob, has sent me to you; this [is] My Name for all time, and this [is] My memorial, to generation [and] generation.
౧౫దేవుడు మోషేతో ఇంకా “మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే.
16 Go, and you have gathered the elderly of Israel, and have said to them: YHWH, God of your fathers, has appeared to me, God of Abraham, Isaac, and Jacob, saying, I have certainly inspected you, and that which is done to you in Egypt;
౧౬నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ‘మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను.
17 and I say [that] I bring you up out of the affliction of Egypt to the land of the Canaanite, and the Hittite, and the Amorite, and the Perizzite, and the Hivite, and the Jebusite, to a land flowing [with] milk and honey.
౧౭ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను’ అని చెప్పాడని వారితో చెప్పు.
18 And they have listened to your voice, and you have entered, you and [the] elderly of Israel, to the king of Egypt, and you have said to him: YHWH, God of the Hebrews, has met with us; and now, please let us go a journey of three days into the wilderness, and we sacrifice to our God YHWH.
౧౮వాళ్ళు నీ మాట వింటారు గనక నువ్వూ, ఇశ్రాయేలు ప్రజల పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్లి, అతనితో, హెబ్రీయుల దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము అడవిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యెహోవాకు బలులు అర్పిస్తాం, మాకు అనుమతి ఇవ్వు, అని అతనితో చెప్పాలి.
19 And I have known that the king of Egypt does not permit you to go, unless by a strong hand,
౧౯ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు.
20 and I have put forth My hand, and have struck Egypt with all My wonders, which I do in its midst—and afterward he sends you away.
౨౦అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను. ఆ తరువాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు.
21 And I have given the grace of this people in the eyes of the Egyptians, and it has come to pass, when you go, you do not go empty;
౨౧మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనస్సు కలిగేలా చేస్తాను.
22 and [every] woman has asked from her neighbor, and from her who is sojourning in her house, [for] vessels of silver, and vessels of gold, and garments, and you have put [them] on your sons and on your daughters, and have spoiled the Egyptians.”
౨౨ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని, తన యజమానురాలిని వెండి, బంగారు నగలు, దుస్తులు ఇమ్మని అడగాలి. వాటిని తీసుకుని మీ కొడుకులకు, కూతుళ్ళకు ధరింపజేయాలి. ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు” అన్నాడు.