< 2 Samuel 3 >
1 And the war is long between the house of Saul and the house of David, and David is going on and [is] strong, and the house of Saul is going on and [is] weak.
౧సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది.
2 And there are sons born to David in Hebron, and his firstborn is Amnon, of Ahinoam the Jezreelitess,
౨హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు.
3 and his second [is] Chileab, of Abigail wife of Nabal the Carmelite, and the third [is] Absalom son of Maacah daughter of Talmai king of Geshur,
౩రెండవ కొడుకు కిల్యాబు అంతకు ముందు కర్మెలీ వాడైన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టాడు. మూడవ వాడు అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకాకు పుట్టాడు.
4 and the fourth [is] Adonijah son of Haggith, and the fifth [is] Shephatiah son of Abital,
౪నాలుగవ వాడు అదోనీయా హగ్గీతుకు పుట్టాడు. అయిదవ వాడు షెఫట్య అబీటలుకు పుట్టాడు.
5 and the sixth [is] Ithream, of Eglah wife of David; these have been born to David in Hebron.
౫ఆరవ వాడు ఇత్రెయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు.
6 And it comes to pass, in the war being between the house of Saul and the house of David, that Abner has been strengthening himself in the house of Saul,
౬సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు.
7 and Saul has a concubine, and her name [is] Rizpah daughter of Aiah, and [Ish-Bosheth] says to Abner, “Why have you gone in to the concubine of my father?”
౭రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇష్బోషెతు “నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు” అని అబ్నేరును ప్రశ్నించాడు.
8 And it is exceedingly displeasing to Abner, because of the words of Ish-Bosheth, and he says, “[Am] I the head of a dog—that in reference to Judah, today I do kindness with the house of your father Saul, to his brothers, and to his friends, and have not delivered you into the hand of David—that you charge against me iniquity concerning the woman today?
౮ఇష్బోషెతు తనను అలా నిలదీసి అడిగినందుకు అబ్నేరుకు తీవ్రమైన కోపం వచ్చింది. అబ్నేరు “నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు కుటుంబం వారికీ, అతని సహోదరులకూ, అతని స్నేహితులకూ నేను ఉపకారం చేశానే. నన్ను యూదావారి పక్షంతో చేరిన కుక్కతో సమానంగా ఎంచి, ఈ రోజున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతున్నావా?
9 Thus God does to Abner, and thus He adds to him, surely as YHWH has sworn to David—surely so I do to him:
౯యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే
10 to cause the kingdom to pass over from the house of Saul, and to raise up the throne of David over Israel, and over Judah, from Dan even to Beer-Sheba.”
౧౦దేవుడు నాకు గొప్ప కీడు రప్పిస్తాడు గాక. సౌలు కుటుంబం వారి చేతిలోనుండి రాజ్యాన్ని తప్పించి దాను నుండి బెయేర్షెబా దాకా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను” అన్నాడు.
11 And he is not able to return a word [to] Abner anymore, because of his fearing him.
౧౧అబ్నేరు మాటలకు భయపడిన ఇష్బోషెతు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.
12 And Abner sends messengers to David for himself, saying, “Whose [is] the land?” [And] saying, “Make your covenant with me, and behold, my hand [is] with you, to bring around all Israel to you.”
౧౨అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి “ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీవైపు తిప్పుతాను” అని కబురు పంపాడు. అప్పుడు దావీదు “మంచిది. నేను నీతో ఒప్పందం చేస్తాను.
13 And [David] says, “Good—I make a covenant with you; only, one thing I am asking of you, that is, you do not see my face, except [that] you first bring in Michal daughter of Saul in your coming in to see my face.”
౧౩అయితే నువ్వు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చే సమయంలో సౌలు కూతురు మీకాలును నా దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే నీకు నా దర్శనం దొరకదు” అని జవాబిచ్చాడు.
14 And David sends messengers to Ish-Bosheth son of Saul, saying, “Give up my wife Michal, whom I betrothed to myself with one hundred foreskins of the Philistines.”
౧౪దావీదు సౌలు కొడుకు ఇష్బోషెతు దగ్గరికి తన మనుషులను పంపించి “ఫిలిష్తీయుల్లో వందమంది మర్మాంగ చర్మపు కొనలను తెచ్చి నేను పెండ్లి చేసుకొన్న మీకాలును నాకు అప్పగించాలి” అని చెప్పమన్నాడు.
15 And Ish-Bosheth sends, and takes her from a man, from Phaltiel son of Laish,
౧౫మీకాలు భర్త, లాయీషు కొడుకు అయిన పల్తీయేలు దగ్గర నుండి మీకాలును తీసుకు వచ్చేందుకు ఇష్బోషెతు తన మనుషులను పంపించాడు.
16 and her husband goes with her, going on and weeping behind her, to Bahurim, and Abner says to him, “Go, return”; and he turns back.
౧౬ఆమె భర్త బహూరీము వరకూ మీకాలు వెనకాలే ఏడ్చుకుంటూ వస్తుంటే అబ్నేరు “నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో” అని చెప్పగానే అతడు వెళ్లిపోయాడు.
17 And the word of Abner was with [the] elderly of Israel, saying, “Thus far you have been seeking David for king over you,
౧౭అప్పుడు అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి “దావీదు మిమ్మల్ని పాలించాలని మీరు ఇంతకు ముందు కోరుకున్నారు గదా?
18 and now, do [it], for YHWH has spoken of David saying, [It is] by the hand of my servant David to save My people Israel out of the hand of the Philistines, and out of the hand of all their enemies.”
౧౮‘నా సేవకుడైన దావీదు చేత నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను’ అని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చాడు కాబట్టి మీ కోరిక నెరవేర్చుకోండి” అని వారితో చెప్పాడు.
19 And Abner also speaks in the ears of Benjamin, and Abner also goes to speak in the ears of David in Hebron all that [is] good in the eyes of Israel, and in the eyes of all the house of Benjamin,
౧౯అబ్నేరు బెన్యామీనీయులతో ఆ విధంగా మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దావీదుకు పూర్తిగా తెలియచేశాడు.
20 and Abner comes to David, to Hebron, and twenty men [are] with him, and David makes a banquet for Abner and for the men who [are] with him.
౨౦అందుకోసం అబ్నేరు ఇరవైమందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకి వచ్చాడు. దావీదు అబ్నేరుకు, అతని మనుషులకు విందు చేయించాడు.
21 And Abner says to David, “I arise, and go, and gather the whole of Israel to my lord the king, and they make a covenant with you, and you have reigned over all that your soul desires”; and David sends Abner away, and he goes in peace.
౨౧అప్పుడు అబ్నేరు “నేను వెళ్లి ఇశ్రాయేలు వారినందరినీ నా రాజు అయిన నీ సమక్షంలో సమకూర్చి, వారు నీతో ఒప్పందం చేసేలా, నీ చిత్త ప్రకారంగా నువ్వు రాజ్యాధికారం చేపట్టి నువ్వు కోరుకున్నదాని అంతటినీ పాలించేలా చేస్తాను” అని దావీదుతో చెప్పి అతని దగ్గర అనుమతి తీసుకుని శాంతికరంగా వెళ్లిపోయాడు.
22 And behold, the servants of David, and Joab, have come from the troop, and have brought much spoil with them, and Abner is not with David in Hebron, for he has sent him away, and he goes in peace;
౨౨దావీదు సేవకులు, యోవాబు యుద్ధంలో పెద్ద మొత్తంలో దోచుకున్న దోపుడు సొమ్ము తీసుకు వచ్చే సమయానికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఆప్పటికే దావీదు దగ్గర అనుమతి తీసుకుని అతడు శాంతికరంగా వెళ్ళిపోయాడు.
23 and Joab and all the host that [were] with him have come, and they declare to Joab, saying, “Abner son of Ner has come to the king, and he sends him away, and he goes in peace.”
౨౩అయితే యోవాబు, తన సైన్యంతో తిరిగి వచ్చినప్పుడు నేరు కొడుకు అబ్నేరు రాజు దగ్గరికి వచ్చాడనీ, రాజు అతనికి ఆతిథ్యమిచ్చి పంపాడనీ, అతడు శాంతియుతంగా తిరిగి వెళ్ళాడనీ తెలిసికున్నాడు.
24 And Joab comes to the king and says, “What have you done? Behold, Abner has come to you! Why [is] this—you have sent him away, and he is really gone?
౨౪అతడు రాజు దగ్గరికి వచ్చి “రాజా విను, నువ్వు చేసిన పనేంటి? అబ్నేరు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతణ్ణి ఎందుకు తిరిగి వెళ్లనిచ్చావు?
25 You have known Abner son of Ner, that he came to deceive you, and to know your going out and your coming in, and to know all that you are doing.”
౨౫నేరు కొడుకు అబ్నేరు గురించి నీకు తెలీదా? నిన్ను మోసం చేసి నీ ప్రణాళికలూ, నువ్వు చేసే పనులూ తెలుసుకొనేందుకు అతడు వచ్చాడు” అని అన్నాడు.
26 And Joab goes out from David, and sends messengers after Abner, and they bring him back from the well of Sirah, and David did not know.
౨౬అతడు దావీదు దగ్గర నుండి బయలుదేరి అబ్నేరును వెనక్కి పిలిపించడానికి మనుషులను పంపాడు. వారు వెళ్లి సిరా అనే బావి దగ్గర నుండి అతణ్ణి వెనక్కి తీసుకు వచ్చారు. అతడు తిరిగి వచ్చిన సంగతి దావీదుకు తెలీదు.
27 And Abner turns back to Hebron, and Joab turns him aside to the midst of the gate to speak with him quietly, and strikes him there in the fifth [rib]—and he dies—for the blood of his brother Asahel.
౨౭అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు “విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి” అని చెప్పి అతణ్ణి ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకు వచ్చాడు. అక్కడ తన సోదరుడు అశాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు.
28 And David hears afterward and says, “My kingdom and I [are] acquitted by YHWH for all time, from the blood of Abner son of Ner;
౨౮ఆ తరువాత ఈ సంగతి దావీదుకు తెలిసి అతడు ఈ విధంగా అనుకున్నాడు “నేనూ, నా రాజ్యమూ నేరు కొడుకు అబ్నేరు ప్రాణం తీసిన విషయంలో యెహోవా దృష్టికి ఎప్పటికీ నిరపరాధులమే.
29 it stays on the head of Joab, and on all the house of his father, and there is not cut off from the house of Joab one who has discharging, and leprous, and laying hold on a staff, and falling by a sword, and lacking bread.”
౨౯ఈ దోషం యోవాబు మీదా, అతని తండ్రి సంతానమంతటి మీదా నిలుస్తుంది గాక. యోవాబు సంతానంలో గాయాలు ఉన్నవారు, కుష్టురోగులు, ముసలివారు, కత్తి చేత హతమయ్యేవారు, తిండి లేనివారు తప్పక ఉంటారు గాక” అన్నాడు.
30 And Joab and his brother Abishai slew Abner because that he put their brother Asahel to death in Gibeon, in battle.
౩౦ఆ విధంగా యోవాబు, అతని సోదరుడు అబీషై, గిబియోను యుద్ధంలో అబ్నేరు తమ సోదరుడు అశాహేలును చంపిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు.
31 And David says to Joab, and to all the people who [are] with him, “Tear your garments, and gird on sackcloth, and mourn before Abner”; and King David is going after the bier.
౩౧దావీదు “మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవం ముందు నడుస్తూ విలపించండి” అని యోవాబుకు, అతనితో ఉన్నవారికందరికీ ఆజ్ఞ ఇచ్చాడు.
32 And they bury Abner in Hebron, and the king lifts up his voice, and weeps at the grave of Abner, and all the people weep;
౩౨రాజు కూడా స్వయంగా పాడె వెంట నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టినప్పుడు రాజు అబ్నేరు సమాధి దగ్గర బిగ్గరగా ఏడ్చాడు. అక్కడ సమకూడిన వారంతా ఏడ్చారు.
33 and the king laments for Abner and says, “Does Abner die as the death of a fool?
౩౩రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు,
34 Your hands not bound, And your feet not brought near to chains! You have fallen as one falling before sons of evil!” And all the people add to weep over him.
౩౪“అబ్నేరూ, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే. నీ చేతులకు గాయాలు లేకుండా, నీ కాళ్లకు సంకెళ్లు వేయకుండా, అక్రమం చేసేవాడి ముందు ఒకడు పడినట్టు నువ్వు పడిపోయావు గదా.” రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని, ఇంకా ఎక్కువగా ఏడ్చారు.
35 And all the people come to cause David to eat bread while yet day, and David swears, saying, “Thus God does to me, and thus He adds, for—before the going in of the sun, I taste no bread or any other thing.”
౩౫ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతణ్ణి బతిమిలాడారు. దావీదు “సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకొంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక” అని ఒట్టు పెట్టుకున్నాడు.
36 And all the people have discerned [it], and it is good in their eyes, as all that the king has done is good in the eyes of all the people;
౩౬ప్రజలంతా ఈ విషయం తెలుసుకుని సంతోషించారు. ఇప్పటి వరకూ రాజు చేసినదంతా ప్రజల దృష్టికి అంగీకారమైనట్టు ఇది కూడా వారి దృష్టికి అంగీకారమయ్యింది.
37 and all the people know, even all Israel, in that day, that it has not been from the king—to put Abner son of Ner to death.
౩౭నేరు కొడుకు అబ్నేరు హత్య రాజు పథకం ప్రకారం చేయించింది కాదని ఆ రోజున ఇశ్రాయేలు వారికందరికీ తెలిసింది.
38 And the king says to his servants, “Do you not know that a prince and a great one has fallen this day in Israel?
౩౮తరువాత రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఈ రోజు చనిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ముఖ్యమైన వాడనీ ప్రధానుల్లో ఒకడనీ మీకు తెలిసే ఉంటుంది.
39 And today I [am] tender, and an anointed king: and these men, sons of Zeruiah, [are] too hard for me; YHWH repays to the doer of the evil according to his evil.”
౩౯పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.”