< Psalms 110 >
1 “By David, a psalm.” The Eternal saith unto my Lord, Sit thou at my right hand, until I place thy enemies as a stool for thy feet.
౧దావీదు కీర్తన యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో.
2 The staff of thy strength will the Eternal stretch forth out of Zion: rule thou in the midst of thy enemies.
౨యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.
3 Thy people will bring freewill-gifts on the day of thy power, in the ornaments of holiness: as out of the bosom of the morning-dawn so is thine the dew of thy youth.
౩నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది.
4 The Lord hath sworn, and will not repent of it, Thou shalt be a priest for ever after the order of Malki-zedek.
౪మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.
5 The Lord at thy right hand crusheth kings on the day of his wrath.
౫ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు.
6 He will judge among the nations—there shall be a fulness of corpses—he crusheth heads on a wide-spread land.
౬అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు.
7 From the brook will he drink on the way: therefore will he lift up the head.
౭దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు.