< Judges 6 >
1 And the children of Israel did the evil in the eyes of the Lord: and the Lord delivered them into the hand of Midian seven years.
౧ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో దోషులైన కారణంగా యెహోవా ఏడు సంవత్సరాల పాటు వాళ్ళను మిద్యానీయుల చేతికి అప్పగించాడు.
2 And the hand of Midian prevailed over Israel; and because of the Midianites the children of Israel made for themselves the passes which are in the mountains, and the caves, and the strongholds.
౨మిద్యానీయుల హింస ఇశ్రాయేలీయుల మీద భారంగా ఉంది గనుక వాళ్ళు మిద్యానీయుల దగ్గర ఉండలేక కొండల్లో ఉన్న వాగులు, గుహలు, భద్రమైన చోటులను తమ కోసం సిద్ధం చేసుకున్నారు.
3 And it was, when Israel had sown, that the Midianites came up, and the 'Amalekites, and the children of the east, and they went up against them;
౩ఇశ్రాయేలీయులు విత్తనాలు చల్లిన తరువాత, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున ఉండేవాళ్ళు, తమ పశువులతో, గుడారాలతో సహా మిడతల దండు లాగా వాళ్ళ మీదికి వచ్చి
4 And they encamped against them, and destroyed the products of the earth, as far as Gazzah, and they left no sustenance for Israel, neither lamb, nor ox, nor ass.
౪వాళ్ళ దగ్గర సైనిక శిబిరం వేసుకుని, గాజాకు వరకూ వారి పొలం పంట పాడు చేశారు. ఇశ్రాయేలు దేశంలో బ్రతుకుదెరువుకు పనికి వచ్చే దేనినీ, ఒక్క గొర్రెనుగానీ, ఎద్దును గానీ, గాడిదను గానీ, దేనినీ మిగల్చలేదు.
5 For they came up with their cattle and their tents, and came as locusts in multitude; and both they and their camels were without number; and they came into the land to destroy it.
౫వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి.
6 And Israel was greatly impoverished because of the Midianites; and the children of Israel cried unto the Lord.
౬దేశాన్ని పాడు చెయ్యడానికి వాళ్ళు అక్కడికి వచ్చే వారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వల్ల ఎంతో హీనదశకు వచ్చినప్పుడు వాళ్ళు యెహోవాకు మొర్రపెట్టారు.
7 And it came to pass, when the children of Israel had cried unto the Lord because of the Midianites,
౭మిద్యానీయుల వల్ల కలిగిన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు
8 That the Lord sent a prophet unto the children of Israel, and he said unto them, Thus hath said the Lord the God of Israel, I led you forth out of Egypt, and brought you out of the house of slavery;
౮యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్ళకు ఇలా ప్రకటించాడు “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ‘ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి, బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను.
9 And I delivered you out of the hand of the Egyptians, and out of the hand of all that oppressed you, and I drove them out from before you, and gave you their land;
౯ఐగుప్తీయుల చేతిలో నుంచి, మిమ్మల్ని బాధపెట్టిన వారందరి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించి, మీ దగ్గర నుంచి వాళ్ళను తోలివేసి వాళ్ళ దేశాన్ని మీకు ఇచ్చాను. మీ దేవుడనైన యెహోవాను నేనే.
10 And I said unto you, I am the Lord your God: ye shall not fear the gods of the Emorites, in whose land ye dwell; but ye have not obeyed my voice.
౧౦మీరు అమోరీయుల దేశంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ దేవుళ్ళకు భయపడవద్దని మీతో చెప్పాను గానీ మీరు నా మాట వినలేదు.’”
11 And there came an angel of the Lord, and sat down under the oak which was in 'Ophrah, that pertained unto Joash the Abi'ezrite; and Gid'on his son was beating out wheat in the wine-press, to hide it from the Midianites.
౧౧అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు,
12 And the angel of the Lord appeared unto him, and said unto him, The Lord is with thee, thou mighty man of valor.
౧౨యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు,
13 And Gid'on said unto him, Pardon, my lord, if the Lord be indeed with us, why then hath all this befallen us? and where are all his wonders of which our fathers have told us, saying, Did not the Lord bring us up from Egypt! But now the Lord hath forsaken us, and delivered us into the hand of Midian.
౧౩గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు.
14 And the Lord turned toward him, and said, Go in this thy might, and thou shalt save Israel from the hand of the Midianites: behold, I have sent thee.
౧౪అప్పుడు యెహోవా అతనివైపు తిరిగి “బలం తెచ్చుకుని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుంచి ఇశ్రాయేలీయులను కాపాడు. నిన్ను పంపినవాణ్ణి నేనే” అని చెప్పాడు.
15 And he said unto him, Pardon my Lord, wherewith shall I save Israel? behold, my family is the weakest in Menasseh, and I am the youngest of my father's house.
౧౫అతడు “నా ప్రభూ, దేని సాయంతో నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబం మనష్షే గోత్రంలో అందరికంటే బలహీనమైనది. మా తండ్రుల కుటుంబాల్లో నేను ఏ ప్రాముఖ్యతా లేనివాణ్ణి” అని ఆయనతో చెప్పాడు.
16 And the Lord said unto him, Because I will be with thee, and thou shalt smite the Midianites as one man.
౧౬అందుకు యెహోవా “అయితే ఏమిటి? నేను నీకు తోడుగా ఉంటాను గనక ఒకే మనిషిని చంపినట్టు మిద్యానీయులను నువ్వు చంపుతావు” అని చెప్పాడు.
17 And he said unto him, If now I have found grace in thy eyes, then give me a sign that thou hast been speaking with me;
౧౭అందుకు అతడు “నా పట్ల నీకు కటాక్షం కలిగితే, నాతో మాట్లాడుతున్నది నువ్వే అని నేను తెలుసుకొనేలా ఒక సూచన నాకు చూపించు,
18 Depart not hence, I pray thee, until I come unto thee, and bring forth my present, and set it before thee. And he said, I will tarry until thy return.
౧౮నేను నా అర్పణ బయటికి తెచ్చి నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో దాన్ని పెట్టేవరకూ వెళ్ళవద్దు” అని వేడుకున్నాడు. అప్పుడు ఆయన “నువ్వు తిరిగి వచ్చేవరకూ నేను ఇక్కడే ఉంటాను” అన్నాడు.
19 And Gid'on went in, and made ready a kid, and unleavened cakes of an ephah of flour: the flesh he put in a basket, and the broth he put in a pot, and brought it out unto him under the oak, and presented it.
౧౯అప్పుడు గిద్యోను లోపలికి వెళ్లి ఒక మేక పిల్లను, తూమెడు పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి, ఆ మాంసాన్ని గంపలో పెట్టి, అది వండిన నీళ్ళు కుండలో పోసి, ఆయన కోసం ఆ మస్తకి చెట్టు కిందకు దాన్ని తీసుకువచ్చి దూత దగ్గర పెట్టాడు.
20 And the angel of God said unto him, Take the flesh and the unleavened cakes, and lay them upon this rock, and the broth pour out. And he did so.
౨౦దేవుని దూత “ఆ మాంసాన్ని, పొంగని రొట్టెలను పట్టుకుని రాతి మీద పెట్టి, నీళ్లు పొయ్యి” అన్నాడు.
21 Then the angel of the Lord put forth the end of the staff that was in his hand, and touched the flesh and the unleavened cakes; and there rose up fire out of the rock, and consumed the flesh and the unleavened cakes. And the angel of the Lord departed out of his sight.
౨౧అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు.
22 And when Gid'on perceived that it was an angel of the Lord, Gid'on said, Alas, O Lord Eternal! because I have surely seen an angel of the Lord face to face.
౨౨గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు.
23 And the Lord said unto him, Peace be unto thee; fear not: thou shalt not die.
౨౩అప్పుడు యెహోవా “నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు” అని అతనితో చెప్పాడు.
24 And Gid'on built there an altar unto the Lord, and called it Adonay-shalom [[the Eternal of Peace: ]] unto this day it is yet in Ophrah of the Abi'ezrites.
౨౪అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి “యెహోవా సమాధానకర్త” అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది.
25 And it came to pass in the same night, that the Lord said unto him, Take thy father's young bullock, and the second bullock of seven years old, and throw down the altar of Baal which belongeth to thy father, and the grove that is around it shalt thou cut down.
౨౫ఆ రాత్రే యెహోవా “నీ తండ్రికి చెందిన ఎద్దును, ఏడేళ్ళ వయస్సు ఉన్న రెండవ యెద్దును తీసుకు వచ్చి, నీ తండ్రి బయలుకు కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి, దానికి పైగా ఉన్న దేవతా స్తంభాన్ని నరికివెయ్యి.
26 And build an altar unto the Lord thy God upon the top of this rock, on the level place, and take the second bullock, and offer [it as] a burnt-sacrifice with the wood of the grove which thou shalt cut down.
౨౬సరి అయిన ఏర్పాటుతో ఈ బండ పైన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి, ఆ రెండవ ఎద్దును తీసుకు వచ్చి నువ్వు నరికిన ఆషేరా ప్రతిమ కలపను కట్టెలుగా ఉపయోగించి దహనబలి ఆర్పించు” అని అతనితో చెప్పాడు.
27 And Gid'on took ten men of his servants, and did as the Lord had spoken unto him; but it came to pass, because he feared his father's household, and the men of the city, to do it by day, that he did it by night.
౨౭కాబట్టి గిద్యోను తన పనివాళ్ళలో పదిమందిని తీసుకుని యెహోవా తనతో చెప్పినట్టు చేసాడు. అతడు తన తండ్రుల కుటుంబాల వారికి, ఆ ఊరివాళ్ళకు భయపడిన కారణంగా పగటి వేళ కాక, రాత్రి సమయంలో చేసాడు.
28 And when the men of the city arose early in the morning, behold, the altar of Baal was overthrown, and the grove that was around it was cut down, and the second bullock was offered upon the altar which had been built.
౨౮ఆ ఊరివాళ్ళు వేకువనే లేచినప్పుడు బయలు దేవుడు బలిపీఠం విరగ్గొట్టి ఉంది. దానికి పైగా ఉన్న దేవతా స్తంభం కూడా పడద్రోసి ఉంది. కొత్తగా కట్టిన బలిపీఠంపై రెండవ ఎద్దు అర్పణ అయిపోయి కనిపించింది.
29 And they said one to another, Who hath done this thing? And they inquired and searched, and then said, Gid'on the son of Joash hath done this thing.
౨౯అప్పుడు వాళ్ళు, ఇది ఎవరు చేసిన పని, అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వాకబు చేసి, యోవాషు కొడుకు గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకున్నారు.
30 Thereupon said the men of the city unto Joash, Bring out thy son, that he may die; because he hath overthrown the altar of Baal, and because he hath cut down the grove that was around it.
౩౦కాబట్టి ఆ ఊరివాళ్ళు “నీ కొడుకు బయలు బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభాన్ని పడద్రోశాడు గనుక అతడు చనిపోవాలి, వాణ్ణి బయటకు తీసుకురా” అని యోవాషుతో చెప్పారు.
31 But Joash said unto all that stood around him, Will ye indeed contend for Baal? will ye assist him? he that will contend for him, shall be put to death; [wait] until morning: if he be a god, let him contend for himself, because one hath overthrown his altar.
౩౧యోవాషు, తనతో పోట్లాడుతున్న వాళ్ళందరితో “మీరు బయలు పక్షంగా వాదిస్తారా? మీరు బయలును రక్షిస్తారా? బయలు పక్షంగా వాదించేవాడు పొద్దు ఎక్కక ముందే చావాలి. ఎవడో బయలు బలిపీఠాన్ని విరగ్గొట్టాడు సరే, బయలు దేవుడే కదా, తన పక్షాన తానే వాదించుకోనివ్వండి.”
32 And the people called him on that day Yerubba'al, saying, Let Baal contend against him, because he hath overthrown his altar.
౩౨ఒకడు తన బలిపీఠాన్ని విరగ్గొట్టాడు కాబట్టి బయలునే అతనితో వాదించుకోనిమ్మని చెప్పిన కారణంగా, ఆ దినాన గిద్యోనుకు “యెరుబ్బయలు” అని పేరు వచ్చింది.
33 And all the Midianites and 'Amalekites and the children of the east assembled together, and went over and encamped in the valley of Yizre'el.
౩౩మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు తీరం వాళ్ళు కలిసివచ్చి, నది దాటి, యెజ్రెయేలు మైదానంలో దిగినప్పుడు
34 But the Spirit of the Lord endued Gid'on, and he blew the cornet: and Abi'ezer assembled and followed him.
౩౪యెహోవా ఆత్మ గిద్యోనును ఆవరించింది. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబీకులు అతని దగ్గరికి వచ్చారు.
35 And he sent messengers throughout all Menasseh, who also assembled and followed him; and he sent messengers through Asher, and through Zebulun, and through Naphtali, and they came up to meet them.
౩౫అతడు మనష్షె వారి దగ్గరికి దూతలను పంపగా వారంతా కలిసి అతని దగ్గరికి వచ్చారు. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాలవాళ్ళ దగ్గరికి దూతలను పంపినప్పుడు వాళ్ళు కూడా కూడుకొన్న వాళ్ళను కలుసుకున్నారు.
36 And Gid'on said unto God, If thou wilt save Israel by my hand, as thou hast spoken,
౩౬అప్పుడు గిద్యోను దేవునితో “నువ్వు చెప్పినట్టు నా చేత ఇశ్రాయేలీయులను రక్షించడం నీ ఉద్దేశ్యం అయితే,
37 Behold, I set up this fleece of wool in the threshing floor: if now there be dew on the fleece alone, and it be dry upon all the ground, then shall I know that thou wilt save Israel by my hand, as thou hast spoken.
౩౭నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతా పొడిగా ఉండి ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడితే, నువ్వు చెప్పినట్టు ఇశ్రాయేలీయులను నా ద్వారా రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను” అన్నాడు.
38 And it was so; and when he rose up early on the morrow, he squeezed the fleece together, and wrung dew out of the fleece, [making] a bowl full of water.
౩౮అది అలాగే జరిగింది. అతడు పొద్దున్నే లేచి ఆ బొచ్చును వత్తి ఒక పాత్ర నీటితో నిండే వరకూ ఆ బొచ్చు నుంచి నీళ్ళు పిండాడు.
39 And Gid'on said unto God, Let not thy anger be kindled against me, and I will speak but this once [more]; let me have a proof, I pray thee, but this once more with the fleece; let it, I pray, be dry upon the fleece alone, and upon all the ground let there be dew.
౩౯అప్పుడు గిద్యోను “నా మీద కోపగించుకోకు. ఇంక ఒక్కసారి ఈ గొర్రెబొచ్చుతో పరీక్షించడానికి అవకాశం ఇవ్వు. నేల అంతటి మీద మంచు పడి ఉన్నప్పుడు, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనివ్వు” అని దేవునితో అన్నప్పుడు
40 And God did so that night; and it was dry upon the fleece alone, and on all the ground there was dew.
౪౦ఆ రాత్రి దేవుడు అలాగే చేశాడు. నేలంతటి మీద మంచు పడినా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది.