< 2 Kings 11 >
1 And when 'Athalyah the mother of Achazyahu saw that her son was dead, she arose and destroyed all the seed royal.
౧అహజ్యా తల్లి అతల్యాకి తన కొడుకు చనిపోయాడని తెలిసింది. అప్పుడు ఆమె రాకుమారులనందరినీ హతమార్చింది.
2 But Yehosheba', the daughter of king Joram, the sister of Achazyahu, took Joash the son of Achazyahu, and stole him away from among the king's sons that were slain, him and his nurse into the bed-chamber: and they hid him from 'Athalyah, so that he was not slain.
౨యెహోరాము రాజు కూతురూ అహజ్యాకి సోదరి అయిన యెహోషెబ అహజ్యా కొడుకుల్లో ఒకడైన యోవాషును హతమైన రాకుమారులతో కూడా చావకుండా వేరు చేసి అతని ఆయాతో సహా అతణ్ణి దాచిపెట్టింది. ఆమె వారిని పడక గదిలో అతల్యా కంటపడకుండా ఉంచింది.
3 And he was with her in the house of the Lord hidden for six years, while 'Athalyah was reigning over the land.
౩దేశాన్ని అతల్యా పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలు యెహోవా మందిరంలో రహస్యంగా అతణ్ణి దాచి ఉంచారు.
4 And in the seventh year Yehoyada' sent and fetched the rulers over the hundreds, of the guards and the runners, and brought them to him into the house of the Lord, and made a covenant with them, and made them swear in the house of the Lord, and showed them the king's son.
౪ఏడో సంవత్సరంలో యాజకుడైన యెహోయాదా కాపలాదారుల పైనా, కెరీతీయులు అని పిలిచే సంరక్షకుల పైనా ఉండే అనేకమంది శతాధిపతులను పిలిపించాడు. వారు వచ్చినప్పుడు వాళ్ళను యెహోవా మందిరం లోకి తీసుకువెళ్ళాడు. అతడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని యెహోవా మందిరంలో వాళ్ళతో ఒక ప్రమాణం చేయించాడు. ఆ తరువాత వాళ్ళకు యువ రాజును చూపించాడు.
5 And he commanded them, saying, This is the thing that ye shall do: A third part of you that enter in on the sabbath shall even be keeping watch in the king's house;
౫వాళ్ళతో ఇలా అన్నాడు. “మీరు చేయాల్సిందేమిటంటే మీలో విశ్రాంతి దినం పరిచర్య కోసం వచ్చే వారు మూడు బృందాలై ఒక బృందం రాజు ఇంటికి కాపలాగా ఉండాలి.
6 And a third part shall be at the gate of Sur; and a third part at the gate behind the runners; so shall ye keep watch at the house, as a defence.
౬మరో బృందం సూర్ గుమ్మం దగ్గరా మరో బృందం మందిరం వెనుక ఉన్న ద్వారం దగ్గరా ఉండాలి. ఇలా మీరు మందిరాన్ని భద్రపరచాలి.
7 And two parts of you all that are relieved on the sabbath, even they shall keep watch in the house of the Lord about the king.
౭ఇక విశ్రాంతి దినం పరిచర్య లేని వారు రెండు బృందాలుగా రాజు ఉన్న యెహోవా మందిరానికి కాపలా కాయాలి.
8 And ye shall encompass the king round about, every man with his weapons in his hand; and he that cometh within the ranges shall be put to death: and be ye with the king when he goeth out and when he cometh in.
౮మీలో ప్రతి ఒక్కరూ చేతిలో ఆయుధాలు పట్టి రాజు చుట్టూ కంచెలా ఉండాలి. ఎవడైనా మీ పంక్తుల్లోకి చొచ్చుకుని వస్తే, వాణ్ణి చంపేయండి. రాజు ఇంటా బయటా సంచరిస్తున్నప్పుడు మీరు అతని దగ్గర ఉండాలి.”
9 And the captains over the hundreds did in accordance with all that Yohayada' the priest had commanded: and they took every man his men that came in on the sabbath, with those that were to be relieved on the sabbath, and came to Yehoyada' the priest.
౯యాజకుడైన యెహోయాదా శతాధిపతులకు ఇచ్చిన ఆదేశాలను వారు తుచ తప్పక పాటించారు. ప్రతి ఒక్కరూ తన మనుషులను తీసుకుని యాజకుడైన యెహోయాదా దగ్గరికి వచ్చారు. పరిచర్య చేసేవాళ్ళూ, విశ్రాంతి దినం పరిచర్యను ఆపి వేసిన వాళ్ళూ వారిలో ఉన్నారు.
10 And the priest gave to the captains over the hundred the spears and shields that had belonged to king David, that were in the house of the Lord.
౧౦యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఉన్న దావీదు ఈటెలనూ, డాళ్లనీ శతాధిపతులకు అందించాడు.
11 And the runners stood every man with his weapons in his hand, from the right side of the house to the left side of the house, by the altar and within, round about the king.
౧౧కాబట్టి కాపలా కాసే వారు తమ చేతుల్లో ఆయుధాలతో నిలిచారు. వారు రాజు చుట్టూ మందిరం కుడి వైపునుండి ఎడమ వైపు వరకూ మందిరానికీ బలిపీఠం వేదికకీ సమీపంలో నిలబడ్డారు.
12 And he brought forth the king's son, and put the crown upon him, and [gave him] the testimony, and they made him king, and anointed him; and they clapped their hands, and said, Long live the king.
౧౨అప్పుడు యెహోయాదా యువ రాజు యోవాషుని బయటకు తీసుకు వచ్చాడు. అతని తలపై కిరీటం పెట్టారు. అతని చేతుల్లో ధర్మశాస్త్ర ప్రతిని ఉంచారు. తరువాత వారు అతనికి పట్టాభిషేకం చేసారు. అంతా చప్పట్లు కొట్టి “రాజు చిరకాలం జీవించాలి” అంటూ నినాదాలు చేశారు.
13 And when 'Athalyah heard the noise of the runners [and] of the people, she came to the people in the house of the Lord.
౧౩కాపలా కాసే వాళ్ళూ, ఇంకా ప్రజలందరూ చేస్తున్న శబ్దాలు అతల్యాకు వినిపించాయి. అప్పుడు ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.
14 And she looked, and, behold, the king stood upon a stand, according to custom, and the princes and the trumpeters were by the king, and all the people of the land were rejoicing, and blowing with trumpets: and 'Athalyah then rent her clothes, and cried, Conspiracy! conspiracy!
౧౪రాజు సంప్రదాయ పద్ధతిలో స్తంభం పక్కన నిలబడి ఉండటమూ, అధికారులూ, బూరలు ఊదేవాళ్ళూ రాజు దగ్గర నిలబడి ఉండటమూ చూసింది. దేశ ప్రజలందరూ బూరలు ఊదుతూ సంబరాల్లో మునిగి ఉండటం చూసింది. అప్పుడామె తన బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజ ద్రోహం!” అంటూ కేకలు పెట్టింది.
15 But Yehoyada' the priest commanded the captains of the hundreds, the commanders of the army, and said unto them, Lead her forth to within the ranges: and him that followeth her put to death with the sword. For the priest had said, She shall not be slain in the house of the Lord.
౧౫అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. “ఆమెను సైనికుల వరుసల్లోనుండి బయటకు తీసుకు రండి. ఆమె సహాయకులెవరైనా ఆమెతో వస్తే వాళ్ళను కత్తితో చంపండి.” అతడు అంతకుముందు “యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు” అని వాళ్ళను ఆదేశించాడు.
16 And they made way for her; and she went by the way of the entrance of the horses into the king's house: and she was put to death there.
౧౬కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చారు. రాజ గృహంలోకి గుర్రాలు వచ్చే దారిగుండా ఆమెను పోనిచ్చారు. ఆమె బయటకు రాగానే ఆమెను పట్టుకుని చంపేశారు.
17 And Yehoyada' made a covenant between the Lord and between the king and between the people, that they should be a people unto the Lord; and between the king and between the people.
౧౭అప్పుడు యెహోయాదా “ప్రజలు యెహోవాకి చెందిన వారు” అంటూ దేవుని పేర రాజుతో, ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకీ ప్రజలకీ మధ్య ఒక నిబంధన చేయించాడు.
18 And then came all the people of the land into the house of Ba'al, and pulled it down: his altars and his images they broke in pieces thoroughly, and Mattan the priest of Ba'al they slew before the altars. And the priest appointed superintendents over the house of the Lord.
౧౮కాబట్టి దేశంలోని ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్ళారు. దాన్ని ధ్వంసం చేసారు. బయలు గుడిలో బలిపీఠం వేదికలనూ, విగ్రహాలనూ నేలమట్టం చేశారు. బయలు దేవుడికి పూజారి అయిన మత్తాను అనేవాణ్ణి బలిపీఠం ఎదుట చంపి వేశారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరాన్ని కాపలా కాయడానికి మనుషులను నియమించాడు.
19 And he took the chiefs over hundreds, and the guards, and the runners, and all the people of the land, and they brought down the king from the house of the Lord, and came by the way of the gate of the runners to the king's house: and he sat on the throne of the kings.
౧౯యెహోయాదా శతాధిపతులనూ, కేరేతీయులనూ, కావలి వారిని ఇంకా ప్రజలందర్నీ పిలిపించాడు. వారు యెహోవా మందిరంలో ఉన్న రాజుకు కావలిగా ఉన్న వారి ద్వారం గుండా రాజగృహానికి తీసుకు వచ్చారు. అప్పుడు రాజు సింహాసనంపై కూర్చున్నాడు.
20 And all the people of the land rejoiced, and the city was quiet; but 'Athalyah they had slain with the sword at the king's house.
౨౦కావలి వారు అతల్యాను రాజగృహం దగ్గర కత్తితో చంపారు. చంపిన తరువాత పట్టణం అంతా ప్రశాంతంగా ఉంది. దేశంలో ప్రజలంతా సంతోషించారు.
21 Seven years old was Jehoash when he became king.
౨౧యోవాషు పరిపాలన ప్రారంభమైనప్పుడు అతని వయస్సు ఏడేళ్లు.