< Job 28 >

1 For there is a place for the silver, whence it comes, and a place for the gold, whence it is refined.
వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది.
2 For iron comes out of the earth, and brass is hewn out like stone.
ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు.
3 He has set a bound to darkness, and he searches out every limit: a stone [is] darkness, and the shadow of death.
మనిషి చీకటిని అంతమొందిస్తాడు. సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్ళను వెతుకుతాడు.
4 There is a cutting off the torrent by reason of dust: so they that forget the right way are weakened; they are removed from [among] men.
మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటు అటు తిరుగులాడుతుంటాడు.
5 [As for] the earth, out of it shall come bread: under it has been turned up as it were fire.
భూమి విషయానికొస్తే అందులోనుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం.
6 Her stones are the place of the sapphire: and [her] dust [supplies] man with gold.
దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది.
7 [There is] a path, the fowl has not known it, neither has the eye of the vulture seen it:
వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు.
8 neither have the sons of the proud trodden it, a lion has not passed upon it.
గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు.
9 He has stretched forth his hand on the sharp [rock], and turned up mountains by the roots:
మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు.
10 and he has interrupted the whirlpools of rivers, and mine eye has seen every precious thing.
౧౦శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది.
11 And he has laid bare the depths of rivers, and has brought his power to light.
౧౧నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు.
12 But whence has wisdom been discovered? and what is the place of knowledge?
౧౨అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
13 A mortal has not known its way, neither indeed has it been discovered among men.
౧౩మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు.
14 The depth said, It is not in me: and the sea said, It is not with me.
౧౪అగాధం “అది నాలో లేదు” అంటుంది. “నా దగ్గర లేదు” అని సముద్రం అంటుంది.
15 One shall not give fine gold instead of it, neither shall silver be weighed in exchange for it.
౧౫బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు.
16 Neither shall it be compared with gold of Sophir, with the precious onyx and sapphire.
౧౬అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు.
17 Gold and crystal shall not be equalled to it, neither shall vessels of gold be its exchange.
౧౭సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము.
18 Coral and fine pearl shall not be mentioned: but do you esteem wisdom above the most precious things.
౧౮పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది.
19 The topaz of Ethiopia shall not be equalled to it; it shall not be compared with pure gold.
౧౯కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము.
20 Whence then is wisdom found? and of what kind is the place of understanding?
౨౦అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది?
21 It has escaped the notice of every man, and has been hidden from the birds of the sky.
౨౧అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం.
22 Destruction and Death said, We have heard the report of it.
౨౨“మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము” అని నాశనం, మరణం అంటాయి.
23 God has well ordered the way of it, and he knows the place of it.
౨౩దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు.
24 For he surveys the whole [earth] under heaven, knowing the things in the earth:
౨౪ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు.
25 all that he has made; the weight of the winds, the measures of the water.
౨౫గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు,
26 When he made [them], thus he saw and numbered them, and made a way for the pealing of the thunder.
౨౬వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు,
27 Then he saw it, and declared it: he prepared it [and] traced it out.
౨౭ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు.
28 And he said to man, Behold, godliness is wisdom: and to abstain from evil is understanding.
౨౮యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు.

< Job 28 >