< Psalms 49 >
1 HEAR this, all ye people; give ear, all ye inhabitants of the world:
౧ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.
2 Both low and high, rich and poor, together.
౨అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.
3 My mouth shall speak of wisdom; and the meditation of my heart shall be of understanding.
౩నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
4 I will incline mine ear to a parable: I will open my dark saying upon the harp.
౪ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను.
5 Wherefore should I fear in the days of evil, when the iniquity of my heels shall compass me about?
౫నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?
6 They that trust in their wealth, and boast themselves in the multitude of their riches;
౬వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
7 None of them can by any means redeem his brother, nor give to God a ransom for him:
౭వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.
8 (For the redemption of their soul is precious, and it ceaseth for ever: )
౮ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.
9 That he should still live for ever, and not see corruption.
౯ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.
10 For he seeth that wise men die, likewise the fool and the brutish person perish, and leave their wealth to others.
౧౦వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.
11 Their inward thought is, that their houses shall continue for ever, and their dwelling places to all generations; they call their lands after their own names.
౧౧వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
12 Nevertheless man being in honour abideth not: he is like the beasts that perish.
౧౨కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.
13 This their way is their folly: yet their posterity approve their sayings. (Selah)
౧౩ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.
14 Like sheep they are laid in the grave; death shall feed on them; and the upright shall have dominion over them in the morning; and their beauty shall consume in the grave from their dwelling. (Sheol )
౧౪వాళ్ళంతా ఒక గుంపుగా పాతాళానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. మరణం వాళ్లకి కాపరిగా ఉంటుంది. ఉదయాన వాళ్ళపై యథార్థవంతులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సౌందర్యానికి నిలువ నీడ లేకుండా పాతాళం వారిని మింగి వేస్తుంది. (Sheol )
15 But God will redeem my soul from the power of the grave: for he shall receive me. (Selah) (Sheol )
౧౫అయితే దేవుడు నా ప్రాణాన్ని పాతాళం శక్తి నుండి కాపాడతాడు. ఆయన నన్ను స్వీకరిస్తాడు. (Sheol )
16 Be not thou afraid when one is made rich, when the glory of his house is increased;
౧౬ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.
17 For when he dieth he shall carry nothing away: his glory shall not descend after him.
౧౭ఎందుకంటే వాడు చనిపోయేటప్పుడు దేన్నీ తీసుకువెళ్ళడు. వాడి ప్రభావం వాడి వెంట దిగిపోదు.
18 Though while he lived he blessed his soul: and men will praise thee, when thou doest well to thyself.
౧౮మనుషులు నీ జీవితాన్ని నువ్వు చక్కగా నడిపించుకున్నావు అని పొగుడుతారు. వాడు బతికినన్నాళ్ళూ తనను తాను మెచ్చుకుంటాడు.
19 He shall go to the generation of his fathers; they shall never see light.
౧౯అయినా వాడు తన పితరుల తరానికి చేరవలసిందే. వాళ్ళు ఎన్నటికీ వెలుగును చూడరు.
20 Man that is in honour, and understandeth not, is like the beasts that perish.
౨౦ధనముండీ వివేకం లేనివాడు మృగం వంటివాడు. వాడు నశించిపోతాడు.