< Job 41 >
1 CANST thou draw out leviathan with an hook? or his tongue with a cord which thou lettest down?
౧నువ్వు జలరాక్షసిని గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా?
2 Canst thou put an hook into his nose? or bore his jaw through with a thorn?
౨నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొంకి ఎక్కించగలవా?
3 Will he make many supplications unto thee? will he speak soft words unto thee?
౩అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా?
4 Will he make a covenant with thee? wilt thou take him for a servant for ever?
౪నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా?
5 Wilt thou play with him as with a bird? or wilt thou bind him for thy maidens?
౫నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పనిపిల్లలు ఆడుకోడానికి దాని కట్టివేస్తావా?
6 Shall the companions make a banquet of him? shall they part him among the merchants?
౬బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా?
7 Canst thou fill his skin with barbed irons? or his head with fish spears?
౭దాని ఒంటినిండా ఇనప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా?
8 Lay thine hand upon him, remember the battle, do no more.
౮దాని మీద చెయ్యి వేసి చూడు, దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చెయ్యవు.
9 Behold, the hope of him is in vain: shall not one be cast down even at the sight of him?
౯దాన్ని చూస్తే చాలు, మనుషులు దాన్ని వశపరచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాని చూస్తే చాలు ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి.
10 None is so fierce that dare stir him up: who then is able to stand before me?
౧౦సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలవగలవాడెవడు?
11 Who hath prevented me, that I should repay him? whatsoever is under the whole heaven is mine.
౧౧నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా.
12 I will not conceal his parts, nor his power, nor his comely proportion.
౧౨సముద్ర రాక్షసి కాళ్ళను గురించైనా దాని మహా బలాన్ని గురించైనా దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలకకుండా మౌనంగా ఉండను.
13 Who can discover the face of his garment? or who can come to him with his double bridle?
౧౩ఎవడైనా దాని పై పొరలను లాగివేయగలడా? దాని రెండు కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా?
14 Who can open the doors of his face? his teeth are terrible round about.
౧౪దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు?
15 His scales are his pride, shut up together as with a close seal.
౧౫దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి.
16 One is so near to another, that no air can come between them.
౧౬అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు.
17 They are joined one to another, they stick together, that they cannot be sundered.
౧౭అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరివల్లా కాదు.
18 By his neesings a light doth shine, and his eyes are like the eyelids of the morning.
౧౮అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి.
19 Out of his mouth go burning lamps, and sparks of fire leap out.
౧౯దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్ని కణాలు దాని నుండి లేస్తాయి.
20 Out of his nostrils goeth smoke, as out of a seething pot or caldron.
౨౦పొయ్యిపై మసులుతున్న కాగులోనుండి, బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలోనుండి లేచినట్టు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ లేస్తుంది.
21 His breath kindleth coals, and a flame goeth out of his mouth.
౨౧దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి.
22 In his neck remaineth strength, and sorrow is turned into joy before him.
౨౨దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది.
23 The flakes of his flesh are joined together: they are firm in themselves; they cannot be moved.
౨౩దాని దళసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడి రావు.
24 His heart is as firm as a stone; yea, as hard as a piece of the nether millstone.
౨౪దాని గుండె రాయి లాగా గట్టిగా ఉంది. అది తిరగలి కింది దిమ్మంత కఠినం.
25 When he raiseth up himself, the mighty are afraid: by reason of breakings they purify themselves.
౨౫అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు.
26 The sword of him that layeth at him cannot hold: the spear, the dart, nor the habergeon.
౨౬కత్తి దెబ్బ దాన్ని ఏమీ చెయ్యదు. ఈటె, బాణం, పదునైన ఏ అయుధమైనా పనికి రావు.
27 He esteemeth iron as straw, and brass as rotten wood.
౨౭అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది.
28 The arrow cannot make him flee: slingstones are turned with him into stubble.
౨౮బాణం దాన్ని తరిమి కొట్టలేదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి.
29 Darts are counted as stubble: he laugheth at the shaking of a spear.
౨౯గదలను అది గడ్డిపరకలుగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటెను చూసి నవ్వుతుంది.
30 Sharp stones are under him: he spreadeth sharp pointed things upon the mire.
౩౦దాని ఉదర భాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపిడి కొయ్యలాంటి తన తోకను పరచుకుంటుంది.
31 He maketh the deep to boil like a pot: he maketh the sea like a pot of ointment.
౩౧కాగులో నీళ్ళు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది.
32 He maketh a path to shine after him; one would think the deep to be hoary.
౩౨అది తాను నడచిన దారిని తన వెనక ప్రకాశింప జేస్తుంది. చూసే వారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు.
33 Upon earth there is not his like, who is made without fear.
౩౩అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు.
34 He beholdeth all high things: he is a king over all the children of pride.
౩౪అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు.