< Job 24 >
1 Why are times not laid up by the Almighty? And why do not they that know Him see His days?
౧సర్వశక్తుడు దుష్టులను శిక్షించే నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను ఎరిగినవారు ఆయన తీర్పు దినాలను ఎందుకు చూడడం లేదు?
2 There are that remove the landmarks; they violently take away flocks, and feed them.
౨సరిహద్దు రాళ్లను తీసేసే వారు ఉన్నారు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని తమ గడ్డి భూముల్లో వాటిని ఉంచుకుంటారు.
3 They drive away the ass of the fatherless, they take the widow's ox for a pledge.
౩వారు తండ్రి లేని వారి గాడిదను తోలేస్తారు. విధవరాలి ఎద్దును తాకట్టు పెట్టుకుంటారు.
4 They turn the needy out of the way; the poor of the earth hide themselves together.
౪వారు అవసరంలో ఉన్న వారిని తమ దారుల్లో నుండి తప్పిస్తారు. దేశంలోని పేదలు వారి కంటబడకుండా దాక్కోవలసి వచ్చింది.
5 Behold, as wild asses in the wilderness they go forth to their work, seeking diligently for food; the desert yieldeth them bread for their children.
౫అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్టు పేదలు బయలుదేరి ఆహారం కోసం వెతుకులాడతారు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది.
6 They cut his provender in the field; and they despoil the vineyard of the wicked.
౬పొలంలో వారు తమ కోసం గడ్డి కోసుకుంటారు. దుష్టుల ద్రాక్షతోటల్లో పరిగ ఏరుకుంటారు.
7 They lie all night naked without clothing, and have no covering in the cold.
౭బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు.
8 They are wet with the showers of the mountains, and embrace the rock for want of a shelter.
౮పర్వతాల మీది జల్లులకు తడుస్తారు. ఆశ్రయం లేనందువల్ల బండను కౌగలించుకుంటారు.
9 There are that pluck the fatherless from the breast, and take a pledge of the poor;
౯తండ్రి లేని పిల్లను తల్లి రొమ్ము నుండి లాగేసే వారు ఉన్నారు. వారు దరిద్రుల దగ్గర తాకట్టు పుచ్చుకుంటారు.
10 So that they go about naked without clothing, and being hungry they carry the sheaves;
౧౦దరిద్రులు కట్టు బట్టలు లేక తిరుగులాడుతారు. ఆకలితో ఇతరుల పనలను మోసుకుంటూ పోతారు.
11 They make oil within the rows of these men; they tread their winepresses, and suffer thirst.
౧౧వారు తమ యజమానుల ప్రహరీ లోపల నూనె గానుగలు ఆడిస్తారు. ద్రాక్ష గానుగలను తొక్కుతూ, తాము మాత్రం దాహంతో ఉంటారు.
12 From out of the populous city men groan, and the soul of the wounded crieth out; yet God imputeth it not for unseemliness.
౧౨పట్టణంలో మనుషులు మూలుగుతూ ఉంటారు. క్షతగాత్రులు మొర పెడుతూ ఉంటారు. కానీ దేవుడు వారి ప్రార్థనలు పట్టించుకోడు.
13 These are of them that rebel against the light; they know not the ways thereof, nor abide in the paths thereof.
౧౩ఈ దుష్టులు కొందరు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. వారు దాని మార్గాలను గుర్తించరు. దాని త్రోవల్లో నిలవరు.
14 The murderer riseth with the light, to kill the poor and needy; and in the night he is as a thief.
౧౪తెల్లవారే సమయంలో హంతకుడు బయలు దేరుతాడు. వాడు పేదలను, అవసరంలో ఉన్న వారిని చంపుతాడు. రాత్రివేళ వాడు దొంగతనం చేస్తాడు.
15 The eye also of the adulterer waiteth for the twilight, saying: 'No eye shall see me'; and he putteth a covering on his face.
౧౫వ్యభిచారి ఏ కన్నైనా తనను చూడదనుకుని తన ముఖానికి ముసుకు వేసుకుని సందె చీకటి కోసం కనిపెడతాడు.
16 In the dark they dig through houses; they shut themselves up in the day-time; they know not the light.
౧౬దుర్మార్గులు చీకట్లో కన్నం వేస్తారు. పగలు దాక్కుంటారు. వారు వెలుగును చూడరు.
17 For the shadow of death is to all of them as the morning; for they know the terrors of the shadow of death.
౧౭ఉదయం వారి దృష్టిలో దట్టమైన అంధకారం. గాఢాంధకార భయాలు వారికి ఏమీ ఇబ్బందిగా అనిపించవు.
18 He is swift upon the face of the waters; their portion is cursed in the earth; he turneth not by the way of the vineyards.
౧౮వారు జలాల మీద తేలికగా కొట్టుకు పోతారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్థం. ద్రాక్షతోటల దారిలో వారు ఇకపై నడవరు.
19 Drought and heat consume the snow waters; so doth the nether-world those that have sinned. (Sheol )
౧౯అనావృష్టి మూలంగా వేడిమి మూలంగా మంచు, నీళ్లు ఆవిరై పోయేలా పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. (Sheol )
20 The womb forgetteth him; the worm feedeth sweetly on him; he shall be no more remembered; and unrighteousness is broken as a tree.
౨౦వారిని కన్న గర్భమే వారిని మరిచి పోతుంది. పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది. వారు మరి ఎన్నడూ జ్ఞాపకంలోకి రారు. చెట్టు విరిగి పడిపోయినట్టు దుర్మార్గులు పడిపోతారు.
21 He devoureth the barren that beareth not; and doeth not good to the widow.
౨౧వారు గొడ్రాళ్ళను దిగమింగుతారు. వితంతువులకు మేలు చేయరు.
22 He draweth away the mighty also by his power; he riseth up, and he trusteth not his own life.
౨౨ఆయన తన బలం చేత బలవంతులను కాపాడుతున్నాడు. కొందరు ప్రాణంపై ఆశ వదులుకున్నా మళ్ళీ బాగవుతారు.
23 Though it be given him to be in safety, whereon he resteth, yet His eyes are upon their ways.
౨౩తమకు భద్రత ఉందిలే అని వారు అనుకునేలా ఆయన చేస్తాడు. దాన్ని బట్టి వారు సంతోషంగా ఉంటారు. కానీ ఆయన కళ్ళు వారి మార్గాల మీద ఉన్నాయి.
24 They are exalted for a little while, and they are gone; yea, they are brought low, they are gathered in as all others, and wither as the tops of the ears of corn.
౨౪వారు ఘనత పొందినా కొంతసేపటికి లేకుండా పోతారు. వారు హీనస్థితిలోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళ లాగానే కొట్టుకుపోతారు. పక్వం అయిన వెన్నుల్లాగా వారిని కోసివేయడం జరుగుతుంది.
25 And if it be not so now, who will prove me a liar, and make my speech nothing worth?
౨౫ఇప్పుడు ఇలా జరగక పోతే నేను అబద్ధికుడినని ఎవరు రుజువు చేస్తారు? నా మాటలు విలువ లేనివని చూపించేది ఎవరు?