< 1 Samuel 29 >
1 Now the Philistines gathered together all their hosts to Aphek; and the Israelites pitched by the fountain which is in Jezreel.
౧అప్పుడు ఫిలిష్తీయుల సైన్యం గుంపుగా వెళ్ళి ఆఫెకులో మకాం చేశారు. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట పక్కన బస చేశారు.
2 And the lords of the Philistines passed on by hundreds, and by thousands; and David and his men passed on in the rearward with Achish.
౨ఫిలిష్తీయ పెద్దలు తమ సైన్యాన్ని వందమందిగా, వెయ్యిమందిగా సమకూర్చి పథకం ప్రకారం వస్తుంటే, దావీదు, అతని మనుషులు ఆకీషుతో కలిసి సైన్యం వెనుక వైపున వస్తున్నారు.
3 Then said the princes of the Philistines: 'What do these Hebrews here?' And Achish said unto the princes of the Philistines: 'Is not this David, the servant of Saul the king of Israel, who hath been with me these days or these years, and I have found no fault in him since he fell away unto me unto this day?'
౩ఫిలిష్తీయ సేనానులు “ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?” అని ఆకీషును అడిగారు. అతడు “ఇన్ని రోజులుగా ఇన్నేళ్ళగా నా దగ్గర ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడు దావీదు ఇతడే కదా. ఇతడు నా దగ్గర చేరినప్పటి నుండి ఈనాటి వరకూ ఇతనిలో ఏ తప్పూ నాకు కనిపించలేదు” అని ఫిలిష్తీయుల సేనానులతో అన్నాడు.
4 But the princes of the Philistines were wroth with him; and the princes of the Philistines said unto him: 'Make the man return, that he may go back to his place where thou hast appointed him, and let him not go down with us to battle, lest in the battle he become an adversary to us; for wherewith should this fellow reconcile himself unto his lord? should it not be with the heads of these men?
౪అందుకు వారు అతని మీద కోపగించి “ఇతణ్ణి నువ్వు కేటాయించిన స్థలానికి తిరిగి పంపించు. అతడు మనతో కలిసి యుద్ధానికి రాకూడదు, యుద్ధ సమయంలో అతడు మనకు విరోధిగా మారతాడేమో. ఏం చేసి అతడు తన యజమానితో సఖ్యత కుదుర్చుకుంటాడు? మనవాళ్ళ తలలు నరికి తీసుకుపోవడం చేతనే కదా.
5 Is not this David, of whom they sang one to another in dances, saying: Saul hath slain his thousands, and David his ten thousands?'
౫సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందిని హతం చేసారని ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ, పాటలు పాడిన దావీదు ఇతడే కదా” అని అతనితో అన్నారు.
6 Then Achish called David, and said unto him: 'As the LORD liveth, thou hast been upright, and thy going out and thy coming in with me in the host is good in my sight; for I have not found evil in thee since the day of thy coming unto me unto this day; nevertheless the lords favour thee not.
౬ఆకీషు దావీదును పిలిచి “యెహోవా మీద ఒట్టు, నువ్వు నిజంగా నీతిమంతుడివిగా ఉన్నావు. సైన్యంలో నువ్వు నాతో కలసి తిరగడం నాకు ఇష్టమే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఇప్పటికీ నీలో ఎలాంటి తప్పూ నాకు కనబడలేదు. అయితే పెద్దలు నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నారు.
7 Wherefore now return, and go in peace, that thou displease not the lords of the Philistines.'
౭ఫిలిష్తీయ పెద్దల విషయంలో నువ్వు వ్యతిరేకమైనది చేయకుండా ఉండేలా నువ్వు తిరిగి నీ ఇంటికి తిరిగి సుఖంగా వెళ్ళు” అని చెప్పాడు.
8 And David said unto Achish: 'But what have I done? and what hast thou found in thy servant so long as I have been before thee unto this day, that I may not go and fight against the enemies of my lord the king?'
౮దావీదు “నేనేం చేశాను? నా అధికారివైన రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను రాకుండా ఉండేంత తప్పు నీ దగ్గరికి వచ్చినప్పటినుండి ఈ రోజు వరకూ నాలో నీకు ఏమి కనబడింది?” అని ఆకీషును అడిగాడు.
9 And Achish answered and said to David: 'I know that thou art good in my sight, as an angel of God; notwithstanding the princes of the Philistines have said: He shall not go up with us to the battle.
౯అప్పుడు ఆకీషు “నువ్వు నా కళ్ళకు దేవదూతలాగా కనబడుతున్నావని నాకు తెలుసు. అయితే ఫిలిష్తీయ సేనానులు, ఇతడు మనతో కలసి యుద్ధం చేయడానికి రాకూడదని చెబుతున్నారు.
10 Wherefore now rise up early in the morning with the servants of thy lord that are come with thee; and as soon as ye are up early in the morning, and have light, depart.'
౧౦కాబట్టి పొద్దున్నే నువ్వూ, నీతో ఉన్న నీ సైనికులు త్వరగా లేచి తెల్లవారగానే బయలుదేరి వెళ్ళిపోవాలి” అని దావీదుకు ఆజ్ఞ ఇచ్చాడు.
11 So David rose up early, he and his men, to depart in the morning, to return into the land of the Philistines. And the Philistines went up to Jezreel.
౧౧కాబట్టి దావీదు, అతని ప్రజలు పొద్దున్నే తొందరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలుకు వెళ్లారు.