< Galatians 4 >
1 But I say, so long as the heir is an infant, he differs not from a slave, being lord of all things,
౧నేను చెప్పేదేమిటంటే, వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు.
2 but he is under nurses and stewards until the adoption of the father.
౨తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకూ అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు.
3 So also we, when we were infants, were enslaved under the elements of the world:
౩అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.
4 but when the fulness of time came, God sent forth his own Son, having been born of a woman, having been born under law,
౪అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి,
5 in order that he might redeem those under law, that we might receive the adoption of sonship.
౫మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.
6 But because you are sons, God has sent forth the Spirit of his own Son into our hearts, crying, Father, Father.
౬మీరు కుమారులు కాబట్టి, “అబ్బా! తండ్రీ!” అని పిలిచే తన కుమార ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు.
7 So you are no longer a servant but a son; and if a son, truly an heir through God.
౭కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.
8 But you indeed, not knowing God, at that time served those who by nature are not gods:
౮ఆ కాలంలో మీరు దేవుని ఎరగనివారై, వాస్తవానికి దేవుళ్ళు కాని వారికి బానిసలుగా ఉన్నారు గాని
9 but now having known God, and rather having become known of God, how do you turn again to the weak and beggarly elements which you wish to serve again as formerly?
౯ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా?
10 Do you keep days, and months, and times and years?
౧౦మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట.
11 I fear lest I have labored unto you in vain.
౧౧మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.
12 Be ye as I am, because I am as you are, brethren, I am praying for you.
౧౨సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు.
13 You have not injured me: you know that through weakness of the flesh I formerly preached the gospel unto you:
౧౩మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు.
14 and you did not despise, nor spit upon, your temptation in my flesh; but you received me as an angel of God, as Christ Jesus.
౧౪నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా నన్ను మీరు తృణీకరించ లేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.
15 Where then is your happiness? for I testify to you that, if possible, having plucked out your eyes, you would have given them to me.
౧౫మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను.
16 Therefore have I become your enemy, telling you the truth?
౧౬నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?
17 They zealously seek you in no good way; but they wish to exclude you, in order that you may zealously seek them.
౧౭వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు.
18 It is good always to be zealous in a good thing, and not only in my coming to you.
౧౮నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండడం మంచిది.
19 My children, for whom I again travail in pain until Christ may be formed in you,
౧౯నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను.
20 but I wish to come unto you now, and change my voice; because I am at a loss in reference to you.
౨౦మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
21 Tell me, you wish to be under law, do you not hear the law?
౨౧ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారంతా నాకో మాట చెప్పండి-మీరు ధర్మశాస్త్రం చెప్పేది వినడం లేదా?
22 For it is written that Abraham had two sons; one by a bond-maid and one by a freewoman.
౨౨దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా?
23 But the one indeed of the bond-maid was born according to the flesh, and the one of the freewoman through the promise.
౨౩అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.
24 Which things are allegorized: for these are the two covenants; the one indeed from mount Sinai, generating children into bondage, which is Hagar.
౨౪ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు.
25 For this mount Sinai is in Arabia, and corresponds with Jerusalem which now is: for she is in bondage with her children.
౨౫ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది.
26 But Jerusalem who is above is free, who is our mother:
౨౬అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.
27 for it is written, Rejoice, thou barren one who does not bring forth; break forth and cry aloud, thou that dost not travail: because many more are the children of the barren than of her having a husband.
౨౭“గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు. ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది.
28 But you, brethren, are the children of Isaac, according to the promise.
౨౮సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు.
29 But as the one at that time having been born according to the flesh persecuted the one according to the Spirit, even so it is now.
౨౯అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది.
30 But what says the scripture? Cast out the bondwoman and her son: for the son of the bondwoman shall not inherit with the son of the free.
౩౦అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.”
31 Therefore, brethren, we are not the children of the bondwoman, but of the free.
౩౧అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.