< Zechariah 11 >

1 Open thy doores, O Lebanon, and the fire shall deuoure thy cedars.
లెబానోనూ, నీ ద్వారాలు తెరిచి ఉంచు. అగ్నికణాలు వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేస్తాయి.
2 Houle, firre trees: for the cedar is fallen, because all the mightie are destroyed: houle ye, O okes of Bashan, for ye defesed forest is cut downe.
దేవదారు చెట్లు కూలిపోయాయి. మహా వృక్షాలు నాశనమయ్యాయి. సరళవృక్షాల్లారా, విలపించండి. ఎందుకంటే దట్టమైన అడవి నరకబడింది. సింధూర వృక్షాల్లారా, విలపించండి.
3 There is the voyce of the houling of the shepherdes: for their glorie is destroyed: the voyce of ye roaring of lyons whelpes: for the pride of Iorden is destroyed.
గొర్రెల కాపరుల రోదన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. కొదమ సింహాల గర్జన వినబడుతున్నది. ఎందుకంటే యొర్దాను లోయలోని అడవులు పాడైపోయాయి.
4 Thus sayeth the Lord my God, Feede the sheepe of the slaughter.
నా దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందను మేపు.
5 They that possesse them, slay them and sinne not: and they that sell them, say, Blessed be the Lord: for I am riche, and their owne shepherds spare them not.
వాటిని కొనుక్కున్న వాళ్ళు చంపినప్పటికీ నేరం అంటని వాళ్ళమేనని అనుకుంటారు. వాటిని అమ్మిన వారు ‘మాకు చాలా ధనం దొరుకుతుంది, యెహోవాకు స్తోత్రం’ అని చెప్పుకుంటారు. వాటిని కావలి కాచేవారు వాటి పట్ల జాలి చూపించరు.”
6 Surely I wil no more spare those that dwell in the land, sayth the Lord: but loe, I will deliuer the men euery one into his neighbours hand, and into the hand of his King: and they shall smite the land, and out of their hands I wil not deliuer them.
ఇదే యెహోవా వాక్కు. “ఇకపై నేను ఈ దేశనివాసులపై కనికరం చూపించను. ఒకరి చేతికి ఒకరిని వశపరుస్తాను. వాళ్ళ రాజుల చేతికి వాళ్ళందరినీ అప్పగిస్తాను. ఆ రాజులు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళ చేతిలోనుండి నేనెవరినీ విడిపించను.”
7 For I fed the sheepe of slaughter, euen the poore of the flocke, and I tooke vnto me two staues: the one I called Beautie, and the other I called Bandes, and I fed the sheepe.
కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను.
8 Three shepherdes also I cut off in one moneth, and my soule lothed them, and their soule abhorred me.
నేను ఒక నెలలో ముగ్గురు కాపరులను తొలగించాను. ఎందుకంటే వాళ్ళు నా విషయంలో నీచంగా ప్రవర్తించారు. నేను వారి విషయంలో సహనం కనపరచ లేకపోయాను.
9 Then said I, I will not feede you: that that dyeth, let it dye: and that that perisheth, let it perish: and let the remnant eate, euery one the flesh of his neighbour.
కనుక “నేను ఇకపై మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చనిపోవచ్చు, నాశనం అయ్యేవారు నశించిపోవచ్చు. మిగిలిన వారు ఒకరి శరీరం ఒకరు తినవచ్చు” అని చెప్పాను.
10 And I tooke my staffe, euen Beautie, and brake it, that I might disanull my couenant, which I had made with all people.
౧౦ప్రజలందరితో నేను చేసిన ఒడంబడిక రద్దు చేసిన దానికి సూచనగా “అనుగ్రహం” అనే కర్రను తీసుకుని దాన్ని విరిచివేశాను.
11 And it was broken in that day: and so the poore of the sheepe that waited vpon me, knew that it was the worde of the Lord.
౧౧దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది.
12 And I said vnto them, If ye thinke it good, giue me my wages: and if no, leaue off: so they weighed for my wages thirtie pieces of siluer.
౧౨నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు.
13 And the Lord said vnto me, Cast it vnto the potter: a goodly price, that I was valued at of them. And I tooke the thirtie pieces of siluer, and cast them to the potter in the house of the Lord.
౧౩అప్పుడు యెహోవా తిరస్కారంగా “వాళ్ళు నాకు అపురూపంగా ఇచ్చిన దాన్ని కుమ్మరికి పారవెయ్యి” అని నాకు ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ 30 వెండి నాణేలను యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
14 Then brake I mine other staffe, euen the Bandes, that I might dissolue the brotherhood betweene Iudah and Israel.
౧౪తరువాత నేను యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధానికి భగ్నం కలిగేలా “ఐక్యం” అనే నా రెండవ కర్రను తీసుకుని దాన్ని విరగగొట్టాను.
15 And the Lord said vnto me, Take to thee yet the instruments of a foolish shepheard.
౧౫అప్పుడు యెహోవా నాకు చెప్పినదేమిటంటే “మరోసారి కాపరి సామాన్లు తీసుకుని బుద్ధిలేని కాపరి వలే ప్రవర్తించు.
16 For loe, I will rayse vp a shepheard in the land, which shall not looke for the thing, that is lost, nor seeke the tender lambes, nor heale that that is hurt, nor feede that that standeth vp: but he shall eate the flesh of the fat, and teare their clawes in pieces.
౧౬ఎందుకంటే నేను దేశంలో ఒక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశించిపోయే గొర్రెలను లక్ష్యపెట్టడు. చెదరిపోయిన వాటిని వెదకడు. గాయపడిన వాటిని బాగుచేయడు. ఆరోగ్యంగా ఉన్నవాటిని పోషించడు. అయితే కొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసం తింటూ ఉంటాడు.
17 O idole shepheard that leaueth the flocke: the sword shalbe vpon his arme, and vpon his right eye. His arme shall be cleane dryed vp, and his right eye shall be vtterly darkened.
౧౭మందను విడిచిపెట్టే పనికిమాలిన కాపరికి బాధ తప్పదు. వాడి చెయ్యి, కుడి కన్ను కత్తివేటుకు గురౌతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిదైపోతుంది.”

< Zechariah 11 >