< Hosea 12 >

1 Ephraim is fed with the winde, and followeth after the East winde: hee increaseth daily lies and destruction, and they do make a couenant with Asshur, and oyle is caried into Egypt.
ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. తూర్పు గాలి వెంట పరిగెడుతున్నాడు. మానక అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. ప్రజలు అష్షూరీయులతో సంధి చేస్తారు. ఐగుప్తునకు ఒలీవనూనె పంపిస్తారు.
2 The Lord hath also a controuersie with Iudah, and will visite Iaakob, according to his waies: according to his workes, wil he recompence him.
యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు. యాకోబు సంతతి వారు చేసిన దాన్ని బట్టి ఆయన వారిని శిక్షిస్తాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేస్తాడు.
3 Hee tooke his brother by the heele in the wombe, and by his strength he had power with God,
తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు.
4 And had power ouer the Angel, and preuailed: he wept and praied vnto him: he founde him in Beth-el, and there he spake with vs.
అతడు దూతతో పోరాడి గెలిచాడు. అతడు కన్నీటితో అతని అనుగ్రహానికై బతిమాలాడు. బేతేలులో అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ ఆయన అతనితో మాట్లాడాడు.
5 Yea, the Lord God of hostes, the Lord is himselfe his memoriall.
ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి.
6 Therefore turne thou to thy God: keepe mercy and iudgement, and hope still in thy God.
కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి. నిబంధన నమ్మకత్వాన్ని, న్యాయాన్ని అనుసరించు. నీ దేవుని కోసం ఎడతెగక కనిపెట్టు.
7 He is Canaan: the balances of deceit are in his hand: he loueth to oppresse.
కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చెయ్యడమే వారికి ఇష్టం.
8 And Ephraim saide, Notwithstanding I am rich, I haue found me out riches in all my labours: they shall finde none iniquitie in me, that were wickednesse.
“నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది. నేను సంపాదించుకున్న దానిలో దేనిని బట్టీ శిక్షకు తగిన పాపం నాలో ఉన్నట్టు ఎవరూ చూపలేరు” అని ఎఫ్రాయిము అనుకుంటున్నాడు.
9 Though I am the Lord thy God, from the land of Egypt, yet will I make thee to dwel in the tabernacles, as in the daies of the solemne feast.
“అయితే ఐగుప్తుదేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. నియామక దినాల్లో మీరు డేరాల్లో కాపురమున్నట్టు నేను మళ్లీ మిమ్మల్ని డేరాల్లో నివసింపజేస్తాను.
10 I haue also spoken by the Prophets, and I haue multiplied visions, and vsed similitudes by the ministerie of the Prophets.
౧౦ప్రవక్తలతో నేను మాటలాడాను. విస్తారమైన దర్శనాలు నేనిచ్చాను. ఉపమానరీతిగా అనేకసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడాను.
11 Is there iniquitie in Gilead? surely they are vanitie: they sacrifice bullocks in Gilgal, and their altars are as heapes in the furrowes of the field.
౧౧గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే, అక్కడి ప్రజలు పనికిమాలిన వారు. గిల్గాలులో ప్రజలు ఎడ్లను బలులుగా అర్పిస్తారు. వారి బలిపీఠాలు దున్నిన చేని చాళ్ళపై ఉన్న రాళ్లకుప్పల్లాగా ఉన్నాయి.
12 And Iaakob fled into the countrey of Aram, and Israel serued for a wife, and for a wife he kept sheepe.
౧౨యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు. భార్య కావాలని అతడు గొర్రెలు కాచాడు.
13 And by a Prophet the Lord brought Israel out of Egypt, and by a Prophet was he reserued.
౧౩ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు. ప్రవక్త ద్వారా వారిని కాపాడాడు.
14 But Ephraim prouoked him with hie places: therefore shall his blood be powred vpon him, and his reproche shall his Lord reward him.
౧౪ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు. కాబట్టి అతని యజమాని అతని మీద రక్తాపరాధం మోపుతాడు. అతని సిగ్గులేని పనులను బట్టి అతన్ని అవమానపరుస్తాను.”

< Hosea 12 >