< 2 Samuel 24 >
1 And the wrath of the Lord was againe kindled against Israel, and he moued Dauid against them, in that he saide, Goe, number Israel and Iudah.
౧యెహోవా కోపం మళ్ళీ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన వారికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించాడు. “వెళ్లి ఇశ్రాయేలువారి, యూదావారి, జనాభా లెక్కలు తీసుకో” అని అదేశించాడు.
2 For the King said to Ioab the captaine of the hoste, which was with him, Goe speedily now through all the tribes of Israel, from Dan euen to Beer-sheba, and nomber ye the people, that I may knowe the nomber of the people.
౨అప్పుడు రాజు తనతో ఉన్న సైన్యాధిపతి యోవాబుకు “యుద్దానికి పోగల మనుషులు ఎంత మంది ఉన్నారో నాకు తెలియాలి. దాను మొదలు బెయేర్షెబా దాకా తిరిగిచూసి, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వారిని లెక్కించు” అని ఆజ్ఞాపించాడు.
3 And Ioab saide vnto the King, The Lord thy God increase the people an hundreth folde more then they be, and that the eyes of my lorde the King may see it: but why doeth my lord the King desire this thing?
౩అందుకు యోవాబు “నా ప్రభువు, రాజు అయిన నువ్వు చూస్తుండగానే యెహోవా ఈ జనాభాను నూరంతలు ఎక్కువ చేయు గాక. నా ప్రభువు, రాజు అయిన నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది?” అన్నాడు.
4 Notwithstanding the Kings worde preuailed against Ioab and against the captaines of the hoste: therefore Ioab and the captaines of the hoste went out from the presence of the King to nomber the people of Israel.
౪అయినప్పటికీ రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞ తిరుగులేనిది గనక యోవాబు, సైన్యాధిపతులు ఇశ్రాయేలీయుల జన సంఖ్య చూడడానికి రాజు సముఖం నుండి బయలు దేరారు.
5 And they passed ouer Iorden, and pitched in Aroer at the right side of the citie that is in the middes of the valley of Gad and toward Iazer.
౫వారు యొర్దాను నది దాటి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా అరోయేరు దగ్గర మకాం వేశారు. ఆపైన వారు గాదు ప్రాంతం గుండా యాజేరు చేరుకున్నారు.
6 Then they came to Gilead, and to Tahtim-hodshi, so they came to Dan Iaan, and so about to Zidon,
౬అక్కడ నుండి గిలాదుకు, తహ్తింహోద్షీ ప్రాంతానికి వచ్చారు. తరువాత దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.
7 And came to the fortresse of Tyrus and to all the cities of the Hiuites and of the Canaanites, and went towarde the South of Iudah, euen to Beer-sheba.
౭అక్కడ నుండి కోటలు ఉన్న తూరు పట్టణానికీ, హివ్వీయుల, కనానీయుల పట్టణాలకూ చేరుకున్నారు. యూదా దేశానికి దక్షిణ దిక్కున ఉన్న బెయేర్షెబా వరకూ సంచరించారు.
8 So when they had gone about all the lande, they returned to Ierusalem at the ende of nine moneths and twentie dayes.
౮ఈ విధంగా వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి యెరూషలేము చేరారు.
9 And Ioab deliuered the nomber and summe of the people vnto the King: and there were in Israel eight hundreth thousande strong men that drewe swordes, and the men of Iudah were fiue hundreth thousand men.
౯అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షలమంది యోధులు ఉన్నారు. యూదావారిలో 5 లక్షలమంది ఉన్నారు.
10 Then Dauids heart smote him, after that he had numbred the people: and Dauid said vnto the Lord, I haue sinned exceedingly in that I haue done: therefore nowe, Lord, I beseech thee, take away the trespasse of thy seruant: for I haue done very foolishly.
౧౦జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు.
11 And when Dauid was vp in the morning, the worde of the Lord came vnto the Prophet Gad Dauids Seer, saying,
౧౧తెల్లవారి, దావీదు నిద్ర లేచినప్పుడు దావీదుకు దీర్ఘ దర్శి, ప్రవక్త అయిన గాదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై,
12 Go, and say vnto Dauid, Thus saith ye Lord, I offer thee three thinges, chuse thee which of them I shall doe vnto thee.
౧౨“నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు. ‘మూడు విషయాలు నీ ముందుంచుతున్నాను. వాటిలో ఒకటి కోరుకో. దాన్ని నీపైకి రప్పిస్తాను.’”
13 So Gad came to Dauid, and shewed him, and said vnto him, Wilt thou that seuen yeeres famine come vpon thee in thy lande, or wilt thou flee three moneths before thine enemies, they following thee, or that there bee three dayes pestilence in thy land? nowe aduise thee, and see, what answere I shall giue to him that sent me.
౧౩కాబట్టి గాదు దావీదు దగ్గరికి వచ్చి సంగతి తెలిపాడు. “నీవు నీ దేశంలో మూడేళ్ళు కరువు కలగడం కోరుకుంటావా, నీ శత్రువు నిన్ను తరుముతుంటే మూడునెలల పాటు పారిపోడానికి ఒప్పుకుంటావా, లేక నీ దేశంలో మూడు రోజులు తెగులు చెలరేగడానికి ఒప్పుకొంటావా? ఈ విషయం ఆలోచించి నన్ను పంపిన దేవునికి ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించు” అన్నాడు.
14 And Dauid said vnto Gad, I am in a wonderfull strait: let vs fall nowe into the hand of the Lord, (for his mercies are great) and let mee not fall into the hand of man.
౧౪అందుకు దావీదు “గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము” అని గాదుతో అన్నాడు.
15 So the Lord sent a pestilece in Israel, from the morning euen to the time appointed: and there dyed of the people from Dan euen to Beer-sheba seuentie thousand men.
౧౫కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకుని నియామక కాలం వరకూ అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెయేర్షెబా వరకూ 70 వేలమంది మరణించారు.
16 And when the Angel stretched out his hande vpon Ierusalem to destroy it, the Lord repented of the euil, and said to the Angel that destroyed the people, It is sufficient, holde nowe thine hand. And the Angel of the Lord was by the threshing place of Araunah the Iebusite.
౧౬దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా, యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు “ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు.
17 And Dauid spake vnto the Lord (when he sawe the Angel that smote the people) and saide, Behold, I haue sinned, yea, I haue done wickedly: but these sheepe, what haue they done? let thine hand, I pray thee, be against mee and against my fathers house.
౧౭ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు. “పాపం చేసిన వాణ్ని నేను గదా. దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ని నేను గదా. గొర్రెలవంటి ఈ ప్రజలేమి చేసారు? నన్నూ నా తండ్రి కుటుంబాన్నీ శిక్షించు.”
18 So Gad came the same day to Dauid, and said vnto him, Go vp, reare an altar vnto the Lord in the threshing floore of Araunah the Iebusite.
౧౮ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి “నీవు వెళ్లి యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు” అని అతనితో చెప్పాడు.
19 And Dauid (according to the saying of Gad) went vp, as the Lord had commanded.
౧౯దావీదు గాదు ద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలు దేరాడు.
20 And Araunah looked, and sawe the King and his seruants comming towarde him, and Araunah went out, and bowed himselfe before the King on his face to the ground,
౨౦రాజు, అతని పరివారం తనవైపు రావడం అరౌనా చూసి ఎదురు వెళ్లి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి “నా యజమానీ, రాజూ అయిన నీవు నీ దాసుడైన నా దగ్గరికి వచ్చిన కారణమేమిటి?” అని అడిగాడు.
21 And Araunah said, Wherefore is my lord the King come to his seruant? Then Dauid answered, To bye the threshing floore of thee for to builde an altar vnto the Lord, that the plague may cease from the people.
౨౧దావీదు “ఈ కళ్ళం నీ దగ్గర కొని యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించాలని వచ్చాను. అ విధంగా ఈ తెగులు ప్రజలనుండి తొలిగి పోతుంది” అన్నాడు.
22 Then Araunah saide vnto Dauid, Let my lord the King take and offer what seemeth him good in his eyes: beholde the oxen for the burnt offring, and charets, and the instruments of the oxen for wood.
౨౨అందుకు అరౌనా “నా యజమానీ రాజు అయిన నీవు నీకు ఏది కావాలో తీసుకో. నీకు అనుకూలమైనదేమిటో అది చెయ్యి. ఇదుగో, దహనబలి కోసం ఎడ్లు ఉన్నాయి. కట్టెలుగా ఈ నూర్చే కర్ర వస్తువులూ, ఎడ్ల కాడి పనికొస్తాయి.
23 (All these things did Araunah as a King giue vnto the King: and Araunah saide vnto the King, The Lord thy God be fauourable vnto thee)
౨౩రాజా, యివన్నీ అరౌనా అనే నేను, రాజుకు ఇస్తున్నాను” అన్నాడు. “నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక” అని రాజుతో అన్నాడు.
24 Then the King saide vnto Araunah, Not so, but I will bye it of thee at a price, and will not offer burnt offring vnto ye Lord my God of that which doeth cost me nothing. So Dauid bought the threshing floore, and the oxen for fiftie shekels of siluer.
౨౪రాజు “నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను. వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను” అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్నీ ఎడ్లనూ 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు.
25 And Dauid built there an altar vnto the Lord, and offred burnt offrings and peace offrings, and the Lord was appeased toward ye lande, and the plague ceased from Israel.
౨౫అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.