< 2 Chronicles 16 >
1 In the sixe and thirtieth yeere of the reigne of Asa came Baasha king of Israel vp against Iudah, and built Ramah to let none passe out or goe in to Asa king of Iudah.
౧ఆసా పరిపాలనలో 36 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయెషా యూదావారి మీద దండెత్తి వచ్చి యూదా రాజు ఆసా దగ్గరికి రాకపోకలు జరగకుండేలా రమా పట్టణాన్ని కట్టించాడు.
2 Then Asa brought out siluer and gold out of the treasures of the house of the Lord, and of the Kings house, and sent to Benhadad King of Aram that dwelt at Damascus, saying,
౨ఆసా యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ఖజానాల్లోని వెండి బంగారాలను తీసి, దమస్కులో నివసించే ఆరాము రాజు బెన్హదదు దగ్గరకి దూతల చేత పంపించాడు.
3 There is a couenant betweene me and thee, and betweene my father and thy father: behold, I haue sent thee siluer and golde: come, breake thy league with Baasha King of Israel that hee may depart from me.
౩“నా తండ్రికీ నీ తండ్రికీ ఉన్నట్టు నాకూ నీకూ సంధి ఉంది. వెండిని, బంగారాన్ని నీకు పంపించాను. ఇశ్రాయేలు రాజు బయెషా నన్ను విడిచి వెళ్ళిపోయేలా నువ్వు అతనితో చేసుకున్న సంధిని రద్దు చేసుకో” అని అడిగాడు.
4 And Benhadad hearkened vnto King Asa, and sent the captaines of the armies which hee had, against the cities of Israel. And they smote Iion, and Dan, and Abel-maim, and all the store cities of Naphtali.
౪బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యాల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్మాయీము పట్టణాలపై, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాల్లోని కొట్లపై దాడి చేశారు.
5 And when Baasha heard it, he left building of Ramah, and let his worke cease.
౫బయెషా అది విని రమా ప్రాకారాలను కట్టించడం మానేసి ఆ పని చాలించాడు.
6 Then Asa the King tooke all Iudah, and caryed away the stones of Ramah and the tymber thereof, wherewith Baasha did builde, and he built therewith Geba and Mizpah.
౬అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చాడు. వెళ్లి బయెషా కట్టిస్తున్న రమా పట్టణపు రాళ్లను, దూలాలను తీసుకువచ్చారు. ఆసా వాటిని గెబ, మిస్పా పట్టణాలను ప్రాకార కట్టించడానికి వినియోగించాడు.
7 And at that same time Hanani the Seer came to Asa King of Iudah, and saide vnto him, Because thou hast rested vpon the king of Aram, and not rested in the Lord thy God, therefore is the hoste of the King of Aram escaped out of thine hande.
౭ఆ సమయంలో దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజు ఆసా దగ్గరికి వచ్చి అతనికి ఈ ప్రకటన చేశాడు. “నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోకుండా ఆరాము రాజును నమ్ముకున్నావే. అందుకనే ఆరాము రాజు సైన్యం నీ చేతిలో నుండి తప్పించుకు పోయింది.
8 The Ethiopians and the Lubims, were they not a great hoste with charets and horsemen, exceeding many? yet because thou diddest rest vpon the Lord, he deliuered them into thine had.
౮ఇంతకు ముందు లెక్క లేనన్ని రథాలు, గుర్రపు రౌతులు గల ఇతియోపీయులు, లూబీయులు గొప్ప సైన్యంగా వచ్చారు గదా? అయినా నువ్వు యెహోవాను నమ్ముకోవడం వలన ఆయన వారిని నీ వశం చేశాడు.
9 For the eyes of the Lord beholde all the earth to shewe him selfe strong with them that are of perfite heart towarde him: thou hast then done foolishly in this: therefore from henceforth thou shalt haue warres.
౯తన పట్ల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. ఈ విషయంలో నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు కాబట్టి ఇప్పటినుండి నీకు అన్నీ యుద్ధాలే.”
10 Then Asa was wroth with the Seer, and put him into a prison: for he was displeased with him, because of this thing. And Asa oppressed certaine of the people at the same time.
౧౦ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.
11 And behold, the actes of Asa first and last, loe, they are written in the booke of the Kings of Iudah and Israel.
౧౧ఆసా చేసిన పనులన్నిటిని గూర్చి యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాసి ఉంది.
12 And Asa in the nine and thirtieth yeere of his reigne was diseased in his feete, and his disease was extreme: yet he sought not the Lord in his disease, but to the Phisicions.
౧౨ఆసా తన పాలనలో 39 వ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యులను నమ్ముకున్నాడు.
13 So Asa slept with his fathers, and dyed in the one and fourtieth yeere of his reigne.
౧౩ఆసా తన పూర్వీకులతో కన్నుమూసి తన పాలనలో 41 వ సంవత్సరంలో చనిపోయాడు.
14 And they buryed him in one of his sepulchres, which he had made for him selfe in the citie of Dauid, and layed him in the bed, which they had filled with sweete odours and diuers kindes of spices made by the arte of the apoticarie: and they burnt odours for him with an exceeding great fire.
౧౪ప్రజలు నిపుణత గలవారు సిద్ధం చేసిన సుగంధ, పరిమళ ద్రవ్యాలతో నిండిన పాడె మీద అతణ్ణి ఉంచారు. దావీదు పట్టణంలో అతడు తన కోసం తొలిపించుకొన్న సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని గౌరవార్థం గొప్ప అగ్నిజ్వాల రగిలించారు.