< 1 Corinthians 13 >

1 Though I speake with the tongues of men and Angels, and haue not loue, I am as sounding brasse, or a tinkling cymbal.
నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను.
2 And though I had the gift of prophecie, and knewe all secrets and all knowledge, yea, if I had all faith, so that I could remooue mountaines and had not loue, I were nothing.
దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే.
3 And though I feede the poore with all my goods, and though I giue my body, that I be burned, and haue not loue, it profiteth me nothing.
పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు.
4 Loue suffreth long: it is bountifull: loue enuieth not: loue doeth not boast it selfe: it is not puffed vp:
ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు.
5 It doeth no vncomely thing: it seeketh not her owne things: it is not prouoked to anger: it thinketh not euill:
అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు.
6 It reioyceth not in iniquitie, but reioyceth in the trueth:
ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది.
7 It suffreth all things: it beleeueth all things: it hopeth all things: it endureth all things.
అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
8 Loue doeth neuer fall away, though that prophecyings be abolished, or the tongues cease, or knowledge vanish away.
ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.
9 For we knowe in part, and we prophecie in part.
ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము.
10 But when that which is perfect, is come, then that which is in part, shalbe abolished.
౧౦అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి.
11 When I was a childe, I spake as a childe, I vnderstoode as a childe, I thought as a childe: but when I became a man, I put away childish thinges.
౧౧నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను.
12 For nowe we see through a glasse darkely: but then shall wee see face to face. Nowe I know in part: but then shall I know euen as I am knowen.
౧౨అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను.
13 And nowe abideth faith, hope and loue, euen these three: but the chiefest of these is loue.
౧౩ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.

< 1 Corinthians 13 >