< Zechariah 4 >

1 Then the angel I had been talking to returned and got my attention, like waking someone from sleep.
అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోతున్న ఒకణ్ణి లేపినట్లు నన్ను లేపాడు.
2 “What do you see?” he asked me. “I see a lampstand made of solid gold with a bowl at its top having seven lamps on it, each with seven lips.
“నీకు ఏమి కనిపిస్తుంది?” అని నన్ను అడిగాడు. నేను “బంగారు దీపస్తంభం నాకు కనిపిస్తుంది. దీపస్తంభం మీద ఒక నూనె పాత్ర ఉంది. దీపస్తంభానికి ఏడు దీపాలు, ఒక్కో దీపానికి ఏడేసి గొట్టాలు కనిపిస్తున్నాయి.
3 I also see olive trees, one to the right and one to the left of the bowl.”
దీపస్తంభానికి కుడి పక్కన ఒకటి, ఎడమ పక్కన ఒకటి చొప్పున రెండు ఒలీవ చెట్లు కనబడుతున్నాయి” అని చెప్పాను.
4 Then I asked the angel I was talking to, “What are these, my lord?”
తరువాత నేను నాతో మాట్లాడుతున్న దూతతో “స్వామీ, ఇది ఏమిటి?” అని అడిగాను.
5 “Don't you know what these are?” the angel replied. “No, my lord,” I responded.
అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత “ఇదేమిటో నీకు తెలియదా” అని అడిగాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అన్నాను.
6 Then he told me, “This is the Lord's message to Zerubbabel: Not by might, nor by power, but by my spirit, says the Lord Almighty.
అప్పుడు ఆ దూత నాతో ఇలా చెప్పాడు. “జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. నీ శక్తి వల్లనైనా, నీ బలం వల్లనైనా ఇది జరగదు. కేవలం నా ఆత్మ వల్లనే ఇది జరుగుతుంది” అని సేనల ప్రభువు యెహోవా చెప్పాడు.
7 Even obstacles as big as mountains will be flattened before Zerubbabel. Finally he will bring out the capstone to shouts of ‘Blessings on it!’”
మహా పర్వతమా, నువ్వు ఏపాటి దానివి? జెరుబ్బాబెలును అడ్డగించాలని ప్రయత్నించే నువ్వు నేలమట్టం అవుతావు. కృప కలుగు గాక, కృప కలుగు గాక అంటూ ప్రజలు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా అతడు పై రాయి తీసుకుని ఆలయంపై పెట్టిస్తాడు.
8 Then the Lord gave me another message.
యెహోవా వాక్కు మళ్ళీ నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
9 Zerubbabel with his own hands laid the foundations for this Temple, and it will be completed the same way. Then you will know the Lord Almighty has sent me.
“జెరుబ్బాబెలు తన చేతులతో ఈ ఆలయం పునాది వేశాడు. అతడు ఈ కార్యం ముగిస్తాడు. అప్పుడు ఇదే సేనల ప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడని నువ్వు తెలుసుకుంటావు.
10 For who dares look down on this time of small beginnings? They will be happy when they see the plumb line in Zerubbabel's hand. “The seven lamps represent the eyes of the Lord which see all over the world.”
౧౦స్వల్పమైన పనులు జరిగే కాలాన్ని ఎవరు తృణీకరిస్తారు? లోకమంతా సంచారం చేసే యెహోవా ఏడు కళ్ళు జెరుబ్బాబెలు చేతిలో ఉన్న గుండునూలును చూసి సంతోషిస్తాయి.”
11 Then I asked the angel, “What are the two olive trees that stand to the right and the left of the lampstand?”
౧౧నేను ఆ దూతను “దీపస్తంభానికి రెండు వైపులా ఉన్న ఈ రెండు ఒలీవచెట్ల భావం ఏమిటి?”
12 And I also asked him, “What are the two olive branches from which the golden oil pours out from through golden pipes?”
౧౨“రెండు బంగారపు కొమ్ముల్లో నుండి బంగారు నూనె కుమ్మరించే ఒలీవ చెట్లకున్న రెండు కొమ్మల భావం ఏమిటి?” అని అడిగాను.
13 “Don't you know?” the angel replied. “No, my lord,” I responded.
౧౩అప్పుడు అతడు నాతో “ఇవి ఏమిటో నీకు తెలియదా?” అన్నాడు. నేను “స్వామీ, నాకు తెలియదు” అని చెప్పాను.
14 “These are the two who have been anointed who stand by the Lord of all the earth,” he replied.
౧౪అతడు “వీరిద్దరూ సర్వలోకనాధుడైన యెహోవా దగ్గర నిలిచి తైలం పోసే సన్నిధాన సేవకులు” అని చెప్పాడు.

< Zechariah 4 >