< Psalms 69 >
1 For the music director. To the tune “Lilies.” A psalm of David. God, please save me, because the water is up to my neck!
౧ప్రధాన సంగీతకారుని కోసం. శోషన్నీము (కలువల రాగం) అనే రాగంలో పాడవలసినది. దావీదు కీర్తన దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి.
2 I'm sinking deeper into the mud—there's no solid ground for me to stand. I find myself in deep water; floods wash over me.
౨లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి.
3 I'm so tired of screaming out for help my throat is totally raw. My eyes are worn out looking for my God to help me.
౩నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి.
4 Those who hate me for no reason are more than the number of hairs on my head. Many enemies try to destroy me by telling lies. How can I give back what I didn't steal?
౪ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.
5 God, you know how foolish I am! My sins are not hidden from you.
౫దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు.
6 Don't let those who trust you be ashamed because of me, Lord God Almighty. Don't let those who follow you be disgraced because of me, God of Israel.
౬దేవా, సేనల ప్రభువైన యెహోవా, నీ కోసం ఎదురు చూసే వారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారు నా మూలంగా అవమానం పాలు కానీయకు.
7 For your sake I put up with the insults; my face shows my embarrassment.
౭నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది.
8 I have become a foreigner to my brother Israelites; a stranger to my very own brothers.
౮నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను. నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను.
9 My devotion for your house is burning me up inside; the insults of those who insulted you have fallen on me.
౯నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి.
10 I wept and I fasted, but they mocked me;
౧౦నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది.
11 I mourned in sackcloth, but they laughed at me.
౧౧నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు.
12 People sitting by the town gate gossip about me. I'm the subject of rude songs sung by drunks.
౧౨నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు.
13 But my prayer is to you, Lord, believing this is a good time to respond to me. God, in your wonderful trustworthy love, answer me with your sure salvation.
౧౩యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి.
14 Please rescue me from the mud—don't let me sink! Save me from those who hate me and from drowning in the deep waters!
౧౪ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు.
15 Don't let the flood waters wash over me. Don't let the deep waters pull me down. Don't let the grave close over me.
౧౫వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు.
16 Please answer my prayers, Lord, for you are good and love me with your trustworthy love; because of your kindness, please help me.
౧౬యెహోవా, నీ నిబంధన కృపలోని మంచితనాన్ని బట్టి నాకు జవాబివ్వు. అధికమైన నీ కృపను బట్టి నావైపు తిరుగు.
17 Don't turn away from me, your servant. Please answer me quickly because I'm in trouble.
౧౭నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు. నేను నిస్పృహలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు.
18 Come here and rescue me; set me free from my enemies.
౧౮నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు. నా శత్రువులను చూసి నన్ను విడిపించు.
19 You—you know my shame, my disgrace, my humiliation. You see everything my enemies are doing.
౧౯నాకు నింద, సిగ్గు, అవమానం కలిగాయని నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు.
20 Insults have broken my heart—I am so sick there is no cure. I looked for some sympathy, but there was no one! Nobody showed me any compassion.
౨౦నింద వలన నా హృదయం బద్దలైంది. నేను ఎంతో కృశించిపోయాను. నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గానీ ఎవరూ లేరు. ఓదార్చే వారి కోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించ లేదు.
21 Instead they gave me bitter herbs to eat and vinegar to drink.
౨౧వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు. నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.
22 May the table set before them become a trap for them, a net that catches them, bringing punishment.
౨౨వారి సంపద వారికి ఉరి అవుతుంది గాక. క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుంది గాక.
23 May their eyes become blind so they cannot see, and may their backs always be bent low in dejection.
౨౩వారు చూడలేకపోయేలా వారి కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక. వారి నడుములకు ఎడతెగని వణకు పుడుతుంది గాక.
24 Pour out your judgment on them; chase them down in your fierce anger.
౨౪వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించు. నీ కోపాగ్ని వారిని ఆవరిస్తుంది గాక.
25 Let the places where they live be deserted. Let their homes be abandoned.
౨౫వారి నివాసం నిర్జనం అవుతుంది గాక. వారి గుడారాల్లో ఎవరూ నివాసం ఉండరు గాక.
26 For they persecute those you have punished, and make it even more painful for those you have disciplined.
౨౬నువ్వు దెబ్బ కొట్టిన వాణ్ణి వారు బాధిస్తున్నారు. నువ్వు గాయపరచిన వారి వేదన గూర్చి వారు కబుర్లాడుతున్నారు.
27 Punish them for the evil they have done. Don't acquit them.
౨౭ఒకదాని తరవాత ఒకటిగా అపరాధాలు వారికి తగలనివ్వు. నీ నీతిగల విజయంలోకి వారిని చేరనివ్వకు.
28 Blot out their names from the Book of Life. Don't let them be listed with those who do right.
౨౮జీవగ్రంథంలో నుండి వారి పేరు చెరిపివెయ్యి. నీతిమంతుల జాబితాలో వారి పేర్లు రాయవద్దు.
29 But I am suffering and in physical pain. God, please save me and keep me safe.
౨౯నేను బాధలో, వేదనలో మునిగి ఉన్నాను. దేవా, నీ రక్షణ నన్ను లేవనెత్తు గాక.
30 I will praise God's character in song; I will say how incredible he is and how thankful I am.
౩౦దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను.
31 The Lord is happier with this than with offering animals as sacrifices: cattle, or bulls with horns and hooves.
౩౧ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం.
32 The humble will see this and be happy. May God encourage everyone who comes to him.
౩౨దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక.
33 God hears the poor, and he does not ignore his people who are in prison.
౩౩అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు.
34 Praise him heaven and earth, the seas and everything that lives in them!
౩౪భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక.
35 For God will save Zion, and rebuild the cities of Judah. They will live there and own the land.
౩౫దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది.
36 The descendants of those who follow him will inherit the land, and those who love him will live there.
౩౬ఆయన సేవకుల సంతానం దాన్ని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసిస్తారు.