< Proverbs 30 >

1 These are the words of Agur, son of Jakeh. An oracle. This is what the man says, God, I'm really tired, I'm worn out.
ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట.
2 I'm so stupid I'm not really a man; I can't even think like a human being.
నిశ్చయంగా మనుషుల్లో నావంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు.
3 I have not learned wisdom; I have no knowledge of the Holy One.
నేను జ్ఞానాన్ని అభ్యసించలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు.
4 Who has gone up to heaven, and come down? Who holds the winds in the palm of his hands? Who has wrapped up the waters in his cloak? Who has set the earth's boundaries? What is his name, and what is his son's name? Are you sure you don't know?
ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా?
5 Every word God says has been proved true. He defends everyone who comes to him for protection.
దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు.
6 Don't add anything to his words, or he will criticize you and you'll be shown to be a liar.
ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.
7 God, I want to request two things from you. Please don't refuse to let me have them before I come to die.
దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు.
8 Keep me from being false, help me not to tell lies. Don't make me poor or rich; just provide me with the food I need.
వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు.
9 Otherwise if I have plenty of money, I may give up on you, saying, “Who is the Lord?” while if I'm poor I may steal and bring the name of my God into disrepute.
ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.
10 Don't slander a servant to his master, or he will curse you and you'll suffer for it.
౧౦దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు.
11 There are some who curse their fathers and do not bless their mothers.
౧౧తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది.
12 There are some who see themselves as pure but they're still filthy—they have not been washed.
౧౨తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది.
13 There are some who think themselves so high and mighty, and who look down on others.
౧౩కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా!
14 There are some who have teeth like swords, incisors like knives, ready to devour the poor from the earth, the needy from society.
౧౪దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.
15 The leech has two daughters who cry out, “Give me! Give me!” There are three things that are never satisfied, four that never say, “Enough!”:
౧౫జలగకు ఇవ్వు, ఇవ్వు అనే పేరున్న కూతురులిద్దరు ఉన్నారు. తృప్తిలేనివి మూడు ఉన్నాయి. చాలు అని పలకనివి నాలుగు ఉన్నాయి.
16 The grave, the womb that doesn't become pregnant, the earth thirsty for water, and the fire that never says, “Enough!” (Sheol h7585)
౧౬పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. (Sheol h7585)
17 People who ridicule their fathers and despise obedience to the mother will have their eyes pecked out by wild ravens and eaten by young vultures.
౧౭తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి.
18 These three things are amazingly hard for me, four things I just can't understand:
౧౮నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి.
19 The way an eagle soars in the sky, the way a snake slides over a rock, the way a ship sails across the sea, the way a man and a woman fall in love.
౧౯అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.
20 This is the way of a woman who commits adultery: she eats, she wipes her mouth, and then says, “I haven't done anything wrong!”
౨౦వ్యభిచారిణి మార్గం కూడా అలాటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది.
21 Three things make the earth tremble, there are four things it can't support:
౨౧భూమిని వణకించేవి మూడు ఉన్నాయి, అది మోయ లేనివి నాలుగు ఉన్నాయి.
22 a slave becoming a king, a stupid person eating like a pig,
౨౨అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు,
23 an unbearable woman getting married, and a maidservant taking her mistress's place.
౨౩పెళ్లి చేసుకున్న గయ్యాళి గంప, యజమానురాలికి హక్కు దారైన దాసి.
24 There are four things on earth that are small, but very wise:
౨౪భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి.
25 Ants—they're not strong, but they work hard all summer storing up food.
౨౫చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి.
26 Hyraxes—they don't have much power, but they make their homes in the rock.
౨౬చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినా అవి బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి.
27 Locusts—they don't have a king, but they all march in line abreast.
౨౭మిడతలకు రాజు లేడు అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.
28 Lizards—you can catch them in your hands, but they live in the king's palace.
౨౮నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు. అయినా రాజ గృహాల్లో అది ఉంటుంది.
29 There are three things that are glorious to watch as they walk, four that look dignified as they move:
౨౯డంబంగా నడుచుకునేవి మూడు ఉన్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి.
30 The lion, supreme among wild animals, who isn't frightened of anything.
౩౦అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం,
31 The strutting starling, the male goat, and a king with his army.
౩౧బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు.
32 If you have been foolishly boasting about yourself, or if you've been planning to do something wrong, stop and put your hand over your mouth.
౩౨నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో.
33 Just as churning milk produces butter, and twisting someone's nose makes it bleed, so stirring up anger causes arguments.
౩౩పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.

< Proverbs 30 >