< Judges 20 >
1 All the Israelites from Dan to Beersheba, including the land of Gilead, went and gathered at Mizpah before the Lord. The assembly was united in purpose.
౧అప్పుడు దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ, గిలాదు వరకూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ కదలి వచ్చారు. వారి సమాజం అంతా ఒక్క వ్యక్తిలా ఒకే ఆలోచనతో మిస్పాలో యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.
2 The leaders of all the people of every Israelite tribe took their assigned positions in the assembled army of God's people, four hundred thousand soldiers armed with swords.
౨ఈ సమావేశంలో దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కత్తియుద్ధం చేయగల నాలుగు లక్షలమంది కూడా వీరిలో ఉన్నారు.
3 The tribe of Benjamin found out that the Israelites had assembled at Mizpah. The Israelites asked, “Tell us, how could such an evil act have happened?”
౩ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశం అయ్యారని బెన్యామీనీయులు విన్నారు. ఇశ్రాయేలీయులు “ఈ దుర్మార్గపు పని ఎలా జరిగిందో చెప్పండి” అని అడిగారు.
4 The Levite, the husband of the woman who had been murdered, explained, “I and my concubine came to spend the night at the town of Gibeah in the territory of Benjamin.
౪చనిపోయిన స్త్రీ భర్త అయిన లేవీయుడు ఇలా సమాధానమిచ్చాడు. “బెన్యామీనీయులకు చెందిన గిబియాలో రాత్రి బస కోసం నేను నా ఉంపుడుగత్తెతో కలసి వచ్చాను.
5 The leaders of Gibeah came to attack me at night. They surrounded the house, intending to kill me. They raped my concubine and she died.
౫గిబియాకు చెందినవారు ఆ రాత్రి నా మీద దాడి చేశారు. నేను ఉన్న ఇంటిని చుట్టుముట్టి నన్ను చంపాలని ప్రయత్నించారు.
6 I took my concubine and cut her into pieces, and I sent these pieces of her to every part of the country that had been given to Israel, because those men had done something shameful and disgusting in Israel.
౬వాళ్ళు నా ఉంపుడుగత్తెను మానభంగం చేశారు. ఆమె చనిపోయింది. ఇశ్రాయేలీయుల్లో ఇలాంటి దుర్మార్గం, దౌర్జన్యం వాళ్ళు జరిగించారు కాబట్టి నేను ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దేశమంతటికి ఆ ముక్కలను పంపాను.”
7 So all of you Israelites have to decide here and now what you're going to do about it!”
౭“ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు చెప్పండి, మీరంతా ఇక్కడే ఉన్నారు. ఈ విషయం గూర్చి ఆలోచించి ఏమి చేయాలో చెప్పండి”
8 Everyone stood up and unitedly declared, “None of us are going home to our tents! None of us are going home to our houses!
౮అందరూ ఒక్కసారిగా ఒకే రకంగా స్పందించారు. వాళ్ళిలా అన్నారు “మనలో ఎవరూ తన గుడారానికి గానీ తన ఇంటికి గానీ వెళ్ళడు.
9 This is what we're going to do to Gilboah: we will attack it with our forces chosen by lot.
౯గిబియాకు మనం చేయాల్సిన విషయంలో ఇలా చేద్దాం. మనం చీట్లు వేసి దాని ప్రకారం గిబియా పైన దాడి చేద్దాం.
10 We'll take ten men from a hundred from all the Israelite tribes, then a hundred from a thousand, then a thousand from ten thousand, to arrange food for the army, so when the troops reach Gibeah in Benjamin, they can pay them back for all these disgusting things they've done in Israel.”
౧౦ఇశ్రాయేలీయుల్లో జరిగిన దుర్మార్గాన్ని శిక్షించడానికై బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ కోసం ఆహారాన్ని సమకూర్చడం కోసం ప్రతి గోత్రం నుండి నూరుమందికి పదిమందినీ, అలాగే వెయ్యికి వందమందినీ పదివేలకు వెయ్యి మందినీ ఏర్పాటు చేద్దాం” అని చెప్పుకున్నారు.
11 All the men of Israel were in agreement and gathered to attack the town.
౧౧కాబట్టి ఇశ్రాయేలీయుల సైన్యం అంతా ఒక్క వ్యక్తిలా ఏకీభవించారు. అంతా ఒకే ఉద్దేశ్యంతో ఆ పట్టాణానికి వ్యతిరేకంగా లేచారు.
12 The Israelite tribes also sent men throughout the territory of Benjamin, asking the people, “What are you doing about this terrible evil that has taken place among you?
౧౨ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి దగ్గరికి మనుషులను పంపారు. వారితో “మీ మధ్య జరిగిన ఈ దుర్మార్గం ఏమిటి?
13 Hand over these wicked men so we can execute them and get rid of this evil from Israel!” But the Benjamites refused to listen to what their fellow Israelites had to say.
౧౩గిబియాలో ఉన్న ఆ దుర్మార్గులను మాకు అప్పగించండి. ఇశ్రాయేలీయులపై ఈ దోషాన్ని సంపూర్ణంగా తొలగించడానికై మేము వారిని చంపుతాం” అని చెప్పించారు. కాని బెన్యామీను గోత్రం వాళ్ళు తమకు సోదరులైన ఇశ్రాయేలీయుల హెచ్చరికను పెడచెవిన పెట్టారు.
14 They left their towns and assembled at Gibeah to go and fight the other Israelites.
౧౪వారంతా తమ తమ పట్టణాల్లో నుండి యుద్ధానికి బయల్దేరి గిబియాకు వచ్చి కలిశారు.
15 That day a total of twenty-six thousand men armed with swords were called up from the towns of Benjamin, in addition to the seven hundred seasoned warriors from Gibeah.
౧౫ఆ రోజు బెన్యామీను గోత్రం వాళ్ళు తమ సంఖ్య ఎంతో లెక్క వేసుకున్నారు. గిబియా వాళ్ళు ఏడువందల మంది కాకుండా ఇతర పట్టణాలనుండి వచ్చినవాళ్ళు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు.
16 Making up part of this army were seven hundred experienced soldiers who used their left hands. All of them could fire a slingshot and not miss by even a hair's breadth.
౧౬వాళ్ళందరిలో ప్రత్యేకంగా ఏడు వందలమంది ఎడమ చేత్తో యుద్ధం చేస్తారు. వీరు ఒక ఒడిసెలలో రాయి పెట్టి తలవెంట్రుకనైనా కొట్టగల నైపుణ్యం గలవారు.
17 The Israelite army (excluding Benjamin) numbered four hundred thousand seasoned warriors, all armed with swords.
౧౭బెన్యామీనీయులు కాకుండా మిగిలిన ఇశ్రాయేలీయుల్లో కత్తియుద్ధం చేయగలిగిన వాళ్ళు నాలుగు లక్షలమంది అని లెక్క వేశారు. వీళ్ళంతా యుద్ధ నైపుణ్యం గలవాళ్ళు.
18 The Israelites went to Bethel and asked God, “Which ones of us should be the first to go and fight the Benjamites?” “Judah is to go first,” the Lord replied.
౧౮ఇశ్రాయేలీయులు లేచి బేతేలుకు వెళ్ళారు. అక్కడ దేవుని దగ్గర బెన్యామీనీయులతో యుద్ధానికి తమలో ముందుగా ఎవరు వెళ్ళాలో తెలపాలని మనవి చేశారు. అప్పుడు దేవుడు “యూదా వాళ్ళు వెళ్ళాలి” అని చెప్పాడు.
19 The next morning the Israelites left and set up their camp near Gibeah.
౧౯ఇక ఇశ్రాయేలీయులు ఉదయాన్నే లేచి యుద్ధానికి సిద్ధపడి గిబియాకు ఎదురుగా మొహరించారు.
20 Then they marched out for battle with the army of Benjamin, taking up their positions to attack Gibeah.
౨౦ఇశ్రాయేలీయుల సైనికులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళి గిబియా మీద దాడి చేయడానికి బారులు తీరారు.
21 But the Benjamites came out of Gibeah and slaughtered twenty-two thousand Israelites on the battlefield that day.
౨౧ఆ రోజున బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలీ సైనికులను చంపివేశారు.
22 But the Israelites encouraged one other to be confident, and they took up the same positions they had on the first day.
౨౨తరువాత ఇశ్రాయేలీయులు వెళ్ళి సాయంకాలం వరకూ యెహోవా ఎదుట ఏడుస్తూ ఉన్నారు. “మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి తిరిగి వెళ్ళాలా” అంటూ దేవుని నడిపింపు కోసం ప్రార్థించారు. అప్పుడు యెహోవా “యుద్ధానికి వెళ్ళండి” అని చెప్పాడు.
23 The Israelites went and cried before the Lord until the evening and asked, “Should we go and attack the Benjamites again, our relatives?” “Go and attack them,” the Lord replied.
౨౩రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.
24 So the second day they advanced to attack the army of Benjamin.
౨౪కాబట్టి ఇశ్రాయేలీయులు రెండో రోజు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి బయల్దేరారు. వారిని ఎదుర్కోడానికి బెన్యామీనీయులు
25 However, Benjamites came out of Gibeah once more and slaughtered eighteen thousand Israelites, all armed with swords.
౨౫గిబియాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయుల్లో పద్దెనిమిది వేలమందిని చంపేశారు.
26 Then all the Israelites and all their army went to Bethel, and sat crying there before the Lord. That day they fasted until evening and gave burnt offerings and friendship offerings to the Lord.
౨౬చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధం చేసేవాళ్ళే. అప్పుడు ఇశ్రాయేలీయుల సైనికులూ, ప్రజలూ అంతా వెళ్ళి బేతేలులో ప్రవేశించారు. అక్కడే ఏడుస్తూ సాయంకాలం వరకూ యెహోవా సమక్షంలో కూర్చుని ఉపవాసముండి, దేవునికి దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు.
27 The Israelites asked the Lord what to do. At that time the Ark of God's Agreement was kept there.
౨౭ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది.
28 Phinehas, son of Eleazar and grandson of Aaron, was the priest. The Israelites asked the Lord, “Should go and we fight again against our relatives from Benjamin, or not?” “Yes, go! Tomorrow I will hand them over to you,” the Lord replied.
౨౮అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకూ అయిన ఫీనేహసు ఆ రోజుల్లో ఆ మందసం దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు “మరోసారి మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్దానికి వెళ్ళాలా వద్దా” అని యెహోవా సన్నిధిలో విచారణ చేస్తూ అడిగారు. దానికి యెహోవా “వెళ్ళండి, రేపు వాళ్ళను ఓడించడానికి మీకు సహాయం చేస్తాను” అని సమాధానం ఇచ్చాడు.
29 Then the Israelites set up an ambush around Gibeah.
౨౯అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ సైనికులను మాటు పెట్టారు.
30 On the third day they took up the same positions they had as before.
౩౦మూడో రోజున ఇంతకు ముందు లాగానే ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళారు. గిబియా వారితో యుద్ధానికి సిద్ధపడ్డారు.
31 The Benjamites came out to attack them and were lured away from the town as they began to kill Israelites as they had before. Some thirty Israelites died on the battlefield and along the roads, the one that goes towards Bethel and the other that goes back towards Gibeah.
౩౧బెన్యామీనీయులు వాళ్ళని ఎదిరించడానికి పట్టణంలో నుండి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలీయులను తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్ళారు. ఇంతకు ముందులాగానే ఇశ్రాయేలీయుల్లో గాయపడ్డవాళ్ళను రాజ మార్గాల్లో చంపుతూ వెళ్ళారు. దాదాపు ముప్ఫై మందిని అలా చంపారు. ఆ మార్గాల్లో ఒకటి బేతేలుకు వెళ్తుంది. మరొకటి గిబియాకు వెళ్తుంది.
32 “We're defeating them, just like before,” the Benjamites shouted. But the Israelites said, “Let's run away from them and lure them away from the town towards the roads.”
౩౨బెన్యామీనీయులు “ఇంతకు ముందులా వీళ్ళు మనముందు నిలువలేకపోతున్నారు” అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు “మనం పారిపోతూ వాళ్ళను పట్టణంలోనుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.
33 The main army of Israelites left where they were and took up positions at Baal-tamar, while those in the ambush west of Gibeah charged out to attack from where they had been hiding.
౩౩ఇశ్రాయేలు సైనికులందరూ సిద్ధపడి బయల్తామారు అనే చోట యుద్ధం కోసం బారులు తీరారు. ఈ లోగా మాటున దాగి ఉన్న సైనికులు తాము దాగి ఉన్న స్థలం నుండి గిబియాకు పడమటి వైపునుండి వేగంగా వచ్చారు.
34 Ten thousand seasoned Israelite warriors attacked Gibeah, and the fighting was so intense the Benjamites didn't realize they were on the brink of disaster.
౩౪అప్పుడు ఇశ్రాయేలీ సైనికుల్లో నుండి ప్రత్యేకంగా ఉన్న పదివేల మంది సైనికులు గిబియా నుండి రావడంతో భీకరమైన యుద్ధం జరిగింది. కాని తాము నాశనం అంచున ఉన్నామని బెన్యామీనీయులకు తెలియలేదు.
35 So the Lord defeated Benjamin before Israel. That day the Israelites killed twenty-five thousand one hundred Benjamites, all armed with swords.
౩౫ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల ద్వారా బెన్యామీనీయులను ఓడించాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల్లో ఇరవై ఐదు వేల వంద మందిని చంపారు. వీళ్ళంతా కత్తియుద్ధం చేయడంలో శిక్షణ పొందినవాళ్ళు.
36 The Benjamites saw that they were defeated. The Israelites had fallen back before the Benjamites because they were confident the ambush they had put in place near Gibeah would be successful.
౩౬బెన్యామీను సైన్యం తమకు అపజయం కలిగిందని తెలుసుకున్నారు. ఇశ్రాయేలీ సైనికులు తాము గిబియా పైన మాటుగా పెట్టిన వారిపై నమ్మకముంచి బెన్యామీనీయులను తమపైకి రానిచ్చారు.
37 The men from the ambush raced to attack the town, and they killed everyone in it.
౩౭మాటుగా ఉన్న సైనికులు త్వరగా గిబియాలో చొరబడి పట్టణంలో ఉన్నవారినందరినీ కత్తితో చంపేశారు.
38 The agreement was that they would send up a great cloud of smoke to show the town had fallen.
౩౮ఇశ్రాయేలు సైన్యాలకూ, మాటున ఉండేవారికీ మధ్య సంకేతం ఒకటుంది. అదేమిటంటే పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయడం.
39 The Israelite army turned to attack the Benjamites, who had already killed about thirty Israelites. The Benjamites were saying, “We're completely defeating them, just like the first battle!”
౩౯ఇశ్రాయేలీయులు మొదట యుద్ధం నుండి పారిపోతున్నట్టుగా కనిపించినప్పుడు బెన్యామీనీయులు “వీళ్ళు మొదటి యుద్ధంలో ఓడిపోయినట్టు ఇప్పుడు కూడా మన చేతిలో ఓడిపోతున్నారు” అనుకుని, ఇశ్రాయేలీయుల్లో దాదాపు ముప్ఫైమందిని చంపారు.
40 However, when the Israelites saw the columns of smoke rising heavenwards to form a great cloud over the whole of the town,
౪౦కాని వెనుక ఉన్న పట్టణంలో నుండి ఆకాశంలోకి పెద్ద స్తంభంలాగా పొగ పైకి లేవడం ఆరంభించింది. అప్పుడు బెన్యామీనీ యులు వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు ఆ పట్టణమంతా పొగ నిండిపోయి కనిపించింది.
41 they turned on their enemies. The Benjamites were horrified when they saw it and realized they were doomed.
౪౧అప్పుడు ఇశ్రాయేలీయులు వెనక్కు తిరిగారు. బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని తెలుసుకుని భయకంపితులయ్యారు.
42 They turned and ran from the Israelites towards the desert, but the battle caught up with them, and the Israelites also killed those who left the towns on the way.
౪౨ఇశ్రాయేలీయుల నుండి పారిపోవడానికి ఎడారి దారి వైపుకు వెళ్దామని చూశారు, కానీ పారిపోతుండగా వారిని పట్టణంలో నుండి వచ్చిన ఇశ్రాయేలీ సైనికులు దారిలోనే చంపారు.
43 Chasing after the Benjamites, the Israelites surrounded them, easily overtaking them east of Gibeah.
౪౩ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుముట్టారు. వారి వెనకబడి తరిమారు. తూర్పు వైపున గిబియాకి ఎదురుగా నోహా దగ్గర వారిని అణచి వేశారు.
44 Eighteen thousand Benjamites were killed, all of them courageous warriors.
౪౪అక్కడ బెన్యామీనీయుల్లో పద్దెనిమిది వేలమంది మరణించారు. వీళ్ళంతా పరాక్రమవంతులు.
45 Some of the Benjamites that were left ran towards Pomegranate Rock in the desert, and the Israelites killed another five thousand men on the way. They chased another group of Benjamites as far as Gidom and killed another thousand.
౪౫అప్పుడు మిగిలినవాళ్ళు తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను బండకు పారిపోయారు. రాజమార్గాల్లో చెదరిపోయి ఉన్న మరో ఐదు వేలమందిని ఇశ్రాయెలీ సైనికులు వేరు చేసి వాళ్ళను గిదోము వరకూ వెంటాడి తరిమి వాళ్ళలో రెండు వేలమందిని చంపేశారు.
46 So that day twenty-five thousand Benjamite were killed, all armed with swords and all courageous warriors.
౪౬ఆ రోజు ఇరవై ఐదు వేలమంది బెన్యామీనీయులు మరణించారు. చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధంలో శిక్షణ పొందినవారే. యుద్ధం చేయడంలో ఆరితేరినవారే.
47 There were six hundred who ran away to Pomegranate Rock in the desert and they stayed there four months.
౪౭కాని ఆరువందలమంది ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయారు. ఆ కొండ మీద నాలుగు నెలలు ఉన్నారు.
48 The Israelites went back into the territory of the Benjamites, and going from town to town, they killed everything: people, animals, everything they found. Then they burned down every town on their way.
౪౮తరువాత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల పైకి తిరిగి వచ్చి పట్టణంలో ఉన్నవారిని పశువులనూ దొరికిన సమస్తాన్నీ కత్తితో చంపేశారు. దీనితో పాటు తాము ఆక్రమించుకున్న పట్టణాలన్నిటినీ తగలబెట్టారు.