< Jeremiah 18 >
1 This message came to Jeremiah from the Lord:
౧యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.
2 Go down right away to the potter's house. I will give you my message there.
౨“నువ్వు లేచి కుమ్మరి యింటికి వెళ్ళు. అక్కడ నా మాటలు నీకు చెబుతాను.”
3 I went down to the potter's house and saw him working at his potter's wheel.
౩నేను కుమ్మరి ఇంటికి వెళితే అతడు తన సారె మీద పని చేస్తున్నాడు.
4 But the pot that he was making from the clay went wrong. So he made it into something different as he thought best.
౪అయితే కుమ్మరి బంకమట్టితో చేస్తున్న కుండ అతని చేతిలో విడిపోయింది. అందుచేత అతడు తన మనస్సు మార్చుకుని తనకిష్టమైనట్టు మరో కుండ చేశాడు.
5 The Lord's message came to me, saying,
౫అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు,
6 People of Israel, declares the Lord, can't I deal with you just like this potter does with his clay? I hold you in my hand just like clay in the potter's hand, people of Israel.
౬“ఇశ్రాయేలు ప్రజలారా! ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా?” ఇది యెహోవా వాక్కు. “బంక మట్టి కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు.
7 At one time it could happen that I announce that a nation or a kingdom is going to be uprooted, torn down, and destroyed.
౭దాన్ని వెళ్ళగొడతాననీ పడదోసి నాశనం చేస్తాననీ ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ నేను చెబుతున్నాను.
8 However, if that nation I warned gives up its evil ways, then I will change my mind regarding the disaster I was about to bring.
౮ఏ రాజ్యం గురించి నేను చెప్పానో ఆ రాజ్యం దుర్మార్గం చేయడం మానితే నేను వారి మీదికి రప్పిస్తానని నేననుకున్న విపత్తు విషయం నేను జాలిపడి దాన్ని రప్పించను.
9 At another time I could announce that I'm going to build up and give power to a nation or a kingdom.
౯ఒక దేశం గురించి గానీ రాజ్యం గురించి గానీ ‘నేను కడతాను, లేకపోతే సుస్థిరం చేస్తాను’ అని చెప్పినప్పుడు,
10 But if it does evil in my sight and refuses to listen to my voice, then I will change my mind regarding the good I had planned for it.
౧౦ఆ ప్రజలు నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేస్తే దానికి చేయదలచిన మేలు చేయకుండా ఆపుతాను.”
11 So tell the people of Judah and those living in Jerusalem that this is what the Lord says: Watch out! I am preparing disaster for you, and working out a plan against you. All of you, give up your evil ways. Live right and act right!
౧౧కాబట్టి నువ్వు వెళ్లి యూదావారితో యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, మీ మీదికి విపత్తు రప్పించబోతున్నాను. మీకు విరోధంగా ఒక ఆలోచన చేస్తున్నాను. మీరంతా ఒక్కొక్కరు మీ దుర్మార్గాన్ని విడిచి మీ విధానాలనూ ప్రవర్తననూ మార్చుకోండి.”
12 But they'll say, “We just can't! We'll do whatever we want. Each of us will stubbornly follow our own evil thinking.”
౧౨అందుకు వాళ్ళు “మేము తెగించాము. మేము మా సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తాం. మేము ఒక్కొక్కరం మా హృదయంలోని దుర్మార్గం ప్రకారం ప్రవర్తిస్తాం” అంటారు.
13 Consequently this is what the Lord says: Ask around the nations—has anybody ever heard anything like this? Virgin Israel has acted really badly.
౧౩కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, రాజ్యాలను అడిగి తెలుసుకోండి. ఇలాంటిది ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.
14 Does the snow of Lebanon ever disappear from its rocky mountain-tops? Do its cool waters that flow from such distant sources ever dry up?
౧౪లెబానోను పర్వతం మీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరం నుంచి పారే చల్లని వాగులు ఇంకిపోతాయా?
15 But my people have rejected me! They burn incense to useless idols which trip them up, making them leave the old roads in order to walk down unmade paths instead of the highway.
౧౫నా ప్రజలైతే నన్ను మర్చిపోయారు. పనికిమాలిన విగ్రహాలకు వాళ్ళు ధూపం వేశారు. వాళ్ళ తమ మార్గాల్లో తడబాటు చెందారు. పురాతన దారులను విడిచిపెట్టి డొంక దారుల్లో నడవాలనుకుంటున్నారు.
16 They have turned their country into a horrific wasteland, a place that will always be treated with contempt. People passing by will be shocked, shaking their heads in disbelief.
౧౬వాళ్ళ దేశం పాడైపోతుంది. అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది. ఆ దారిన వెళ్లేవాళ్ళంతా వణికిపోతూ తమ తలలూపుతారు.
17 Like a strong wind from the east I will scatter them before the enemy. I will turn my back on them and not look at them when their time of trouble comes.
౧౭తూర్పుగాలి చెదరగొట్టినట్టు నేను వాళ్ళ శత్రువుల ఎదుట వాళ్ళను చెదరగొడతాను.
18 Some people decided, “We need a plan to deal with Jeremiah. There'll still be priests to explain the law, there'll still be wise people to give advice, and there'll still be prophets to give prophecies. Let's organize a smear campaign against him so we don't have to listen to a word he says.”
౧౮అప్పుడు ప్రజలు ఇలా అన్నారు. “యిర్మీయా మీద కుట్ర పన్నుదాం రండి. యాజకులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు. తెలివిగలవాళ్ళు సలహాలివ్వకుండా ఉండరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడు ప్రకటించే మాటలేమీ పట్టించుకోకుండా మన మాటలతో అతన్ని ఎదుర్కొందాం రండి.”
19 Lord, please pay attention to what's happening to me! Listen to what my accusers are saying!
౧౯యెహోవా, నా మొర విను. నా విరోధుల రభస విను.
20 Should good be paid back with evil? Yet they have dug a pit to trap me! Remember how I stood before you to plead on their behalf, to stop you being angry with them?
౨౦వాళ్ళు నా ప్రాణం తీయాలని గుంట తవ్వారు. వాళ్లకు నేను చేసిన మేలుకు బదులు వాళ్ళు నాకు భయంకరమైన కీడు చేయాలా? వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ మీదనుంచి నీ కోపం తప్పించడానికి నీ ఎదుట నేను నిలబడి వాళ్ళ గురించి మాట్లాడిన సంగతి గుర్తుంచుకో.
21 But now may their children starve; may they be killed by the sword. May their wives lose their children and their husbands; may their husbands die from disease; may their young men be killed in battle.
౨౧కాబట్టి వాళ్ళ పిల్లలను కరువుపాలు చెయ్యి. వాళ్ళను కత్తికి అప్పగించు. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయేలా వితంతువులయ్యేలా చెయ్యి. వాళ్ళ పురుషులు చావాలి. వాళ్ళ యువకులు యుద్ధంలో కత్తితో చావాలి.
22 May cries of agony be heard from their houses when you suddenly bring invaders to attack them, because they dug a pit to capture me and hid traps to catch me as I walk along.
౨౨నన్ను పట్టుకోడానికి వాళ్ళు గొయ్యి తవ్వారు. నా కాళ్లకు ఉచ్చులు వేశారు. వాళ్ళ మీదికి నువ్వు అకస్మాత్తుగా దండెత్తే వాళ్ళను రప్పించడం వలన వారి ఇళ్ళలోనుంచి కేకలు వినబడాలి.
23 But Lord, you know about all their plots to try and kill me. Don't forgive their wickedness; don't wipe away their sin. Bring them down! Deal with them when you're angry!
౨౩యెహోవా, నన్ను చంపడానికి వాళ్ళు చేసిన కుట్ర అంతా నీకు తెలుసు. వాళ్ళ అపరాధాలనూ పాపాలనూ క్షమించవద్దు. వాళ్ళ పాపాలు నువ్వు తుడిచి వేయవద్దు. వాళ్ళు నీ ఎదుట కూలిపోవాలి. నీ ఉగ్రత కురిపించే సమయంలో వారికి తగిన శాస్తి చెయ్యి.