< Exodus 35 >
1 Moses summoned all the Israelites and told them, “This is what the Lord has ordered you to do:
౧మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినట్టు మీరు జరిగించవలసిన నియమాలు ఇవి.
2 Six days you can work, but the seventh day is to be a holy Sabbath of rest to the Lord. Anyone who does any work on the Sabbath day must be killed.
౨మొదటి ఆరు రోజులు మీరు పని చెయ్యాలి. ఏడవ రోజు మీకు పరిశుద్ధమైనది. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఆ రోజు పని చేసే ప్రతివాడూ మరణ శిక్షకు పాత్రుడు.
3 Don't even light a fire in any of your homes on the Sabbath day.”
౩విశ్రాంతి దినాన మీరు మీ ఇళ్ళలో ఎలాంటి వంటకాలు వండుకోకూడదు.”
4 Moses also told all the Israelites, “This is what the Lord has commanded:
౪మోషే ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో ఇంకా ఇలా చెప్పాడు. “యెహోవా ఆజ్ఞాపించినది ఏమిటంటే,
5 Collect an offering to the Lord from what you have. Everyone who wants to should bring an offering to the Lord: gold, silver, and bronze;
౫మీలో మీరు యెహోవా కోసం అర్పణలు, కానుకలు పోగుచేయండి. ఎలాగంటే, యెహోవా సేవ కోసం కానుకలు ఇవ్వాలనే మనసు కలిగిన ప్రతివాడూ బంగారం, వెండి, ఇత్తడి లోహాలు,
6 blue, purple, and crimson thread; finely-woven linen and goat hair;
౬నీలం, ఊదా, ఎర్రరంగు నూలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు, తుమ్మకర్ర,
7 tanned ram skins and fine leather; acacia wood;
౭దీపాలు వెలిగించడానికి నూనె,
8 olive oil for the lamps; spices for the anointing oil and for the aromatic incense;
౮అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు,
9 and onyx stones and gemstones for making the ephod and breastpiece.
౯ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, చెక్కిన రత్నాలు తీసుకురావాలి.
10 All your skilled craftsmen are to come and make everything the Lord has commanded:
౧౦ఇంకా, నైపుణ్యం, జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినట్టు ఈ పనులు చేయాలి.
11 the Tabernacle with its tent and covering, its clips and frames, its crossbars, posts, and stands;
౧౧ఆ పనులేవంటే, ఆయన నివాసం, నివాస మందిరం ఉండే గుడారం, దాని పైకప్పు, కొలుకులు, పలకలు, అడ్డ కర్రలు, స్తంభాలు, దిమ్మలు.
12 the Ark with its poles and atonement cover, and the veil to hang over it;
౧౨మందసం పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణా పీఠం మూత, దాన్ని మూసి ఉంచే తెర,
13 the table with its poles, all its equipment, and the Bread of the Presence;
౧౩సన్నిధి బల్ల, దాన్ని మోసే కర్రలు, దానిలోని సామగ్రి, సన్నిధి రొట్టెలు,
14 the lampstand of light with its equipment and lamps and olive oil to provide lighting;
౧౪వెలుగు కోసం దీప స్థంభం, దాని సామగ్రి, దానిలో ఉండాల్సిన దీపాలు, దీపాలకు నూనె.
15 the altar of incense with its poles; the anointing oil and aromatic incense; the screen for the Tabernacle entrance and all its accessories;
౧౫ధూపవేదిక, దాన్ని మోసే కర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు, మందిరం ద్వారానికి తెర.
16 the altar of burnt offering with its bronze grate, its poles and all its utensils; the basin plus its stand;
౧౬బలులు అర్పించే దహన బలిపీఠం, దానికి ఉండే ఇత్తడి జల్లెడ, దాన్ని మోసే కర్రలు, దాని సామగ్రి, గంగాళం, దాని పీట.
17 the curtains of the courtyard with its posts and bases, and the curtain for the courtyard entrance;
౧౭ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మలు, ప్రవేశ ద్వారానికి తెర.
18 the tent pegs for the Tabernacle and for the courtyard, as well as their ropes;
౧౮నివాస మందిరం కోసం, ఆవరణ కోసం మేకులు, వాటికి తాళ్లు.
19 and the woven clothes for serving in the holy place: the sacred clothing for Aaron the priest and for his sons to serve as priests.”
౧౯పవిత్ర స్థలం లో సేవ చేయడానికి నేసిన వస్త్రాలు, అంటే, యాజకుడుగా సేవ చెయ్యడానికి అహరోనుకు, అతని కొడుకులకూ పవిత్ర వస్త్రాలు అనేవి.”
20 The Israelites left Moses,
౨౦ఇశ్రాయేలు ప్రజల సమూహమంతా మోషే ఎదుట నుండి వెళ్ళిపోయారు.
21 and all those who felt moved to do so and who had a willing spirit came and brought an offering to the Lord for the work making the Tent of Meeting, for everything required for its services, and for the sacred clothing.
౨౧తరువాత ఎవరి హృదయం వాళ్ళను ప్రేరేపించినట్టు వాళ్ళంతా సన్నిధి గుడారం కోసం, దానిలోని సేవ అంతటికోసం, పవిత్ర వస్త్రాల కోసం అర్పణలు తెచ్చి యెహోవాకు సమర్పించారు.
22 So everyone who was willing, both men and women, came and presented their gold as a thanks offering to the Lord, including brooches, earrings, rings, and necklaces—all kinds of gold jewelry.
౨౨తమ హృదయాల్లో ప్రేరణ పొందిన స్త్రీలు, పురుషులు యెహోవాకు బంగారం సమర్పించిన ప్రతి ఒక్కరూ పైట పిన్నులు, పోగులు, ఉంగరాలు, కంకణాలు, వివిధ రకాల బంగారం వస్తువులు తీసుకువచ్చారు.
23 Everyone who had blue, purple, and crimson thread, finely-woven linen, goat hair, tanned ram skins, and fine leather, contributed them.
౨౩ఇంకా, నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, డాల్ఫిన్ తోళ్లు వీటిలో ఏవేవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకువచ్చారు.
24 Those who could present an offering of silver or bronze brought it as a gift to the Lord. Everyone who had acacia wood for any part of the work donated it.
౨౪వెండి, ఇత్తడి సమర్పించిన ప్రతి ఒక్కరూ యెహోవాకు కానుకలు తెచ్చారు. సేవలో ఏ పని కోసమైనా ఉపయోగపడే తుమ్మకర్ర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు దాన్ని తెచ్చారు.
25 Every woman skilled in spinning with her hands brought what she had spun: blue, purple, or crimson thread, or finely-woven linen.
౨౫నైపుణ్యం గల స్త్రీలు తమ చేతులతో వడికిన నీలం, ఊదా, ఎర్ర రంగు దారాలు, సన్నని నార, నూలు తీసుకు వచ్చారు.
26 All the women who were willing to use their skills spun the goat hair.
౨౬నేర్పు గల స్త్రీలు తమ జ్ఞానహృదయంతో ప్రేరణ పొంది మేక వెంట్రుకలు వడికారు.
27 The leaders brought onyx stones and gemstones to make the ephod and breastpiece,
౨౭నాయకులు ఏఫోదు కోసం, వక్షపతకం కోసం లేత పచ్చలు, వెలగల రాళ్ళూ రత్నాలు,
28 as well as spices and olive oil for lighting, for the anointing oil, and for the aromatic incense.
౨౮అభిషేక తైలం, పరిమళ ద్రవ్య ధూపం వేయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చారు.
29 All the Israelite men and women who were willing brought a freewill offering to the Lord for all the work in making what the Lord through Moses had ordered them to do.
౨౯మోషేను చెయ్యమని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలు ప్రజల్లో తమ మనస్సులలో నిర్ణయించుకున్న పురుషులు, స్త్రీలు తమ ప్రేరణను బట్టి వాళ్ళంతా తమ ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు అర్పించారు.
30 Then Moses told the Israelites, “The Lord chosen by name Bezalel, son of Uri, son of Hur, from the tribe of Judah.
౩౦మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు,
31 He has filled him with the Spirit of God giving him ability, creativity, and expertise in all kinds of craftsmanship.
౩౧“వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి.
32 He can produce designs in gold, silver, and bronze,
౩౨రత్నాలు సానబెట్టి పొదగడంలో, చెక్కలను కోసి నునుపు చేయడంలో నిపుణుడు.
33 he can cut gemstones to place in settings, and he can carve wood. He is a master of every craft.
౩౩అతనికి ఆయన అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, జ్ఞానం, నైపుణ్యం ప్రసాదించాడు. అతణ్ణి దేవుడు తన ఆత్మతో నింపాడు.
34 The Lord has also given him and Oholiab son of Ahisamach, from the tribe of Dan, the ability to teach others.
౩౪అతడు, దాను గోత్రానికి చెందిన అహీసామాకు కొడుకు అహోలీయాబు ఇతరులకు ఈ పనులు నేర్పించడానికి సామర్ధ్యం కలిగినవాళ్ళు.
35 He has equipped them with skill to do all kinds of work as engravers, designers, embroiderers in blue, purple, and crimson thread, and finely-woven linen, and as weavers—in fact as skilled designers in all kinds of different crafts.
౩౫వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”