< 2 Samuel 18 >

1 David organized the men who were with him and put commanders of thousands and commanders of hundreds in charge of them.
దావీదు తన దగ్గర ఉన్న మనుషులను లెక్కించాడు. వారిలో వెయ్యిమందిని, వందమందిని విభజించి వారిని మూడు భాగాలుగా చేశాడు.
2 David sent the army out divided into three sections. One third was commanded by Joab, one third was commanded by Abishai, son of Zeruiah, Joab's brother, and one third was commanded by Ittai the Gittite. The king told the men, “I myself will go out into battle with you.”
ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడు అబీషైకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయికు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు “నేను మీతోకూడా కలసి బయలుదేరుతున్నాను” అని వారితో చెప్పాడు.
3 But the men replied, “No, you must not go out into battle! For if we have to run away, they won't care about us. Even if half of us die, they won't care about that either. But you are worth ten thousand of us, so it's better if you stay here and send us help from the town.”
అందుకు వారు “నువ్వు మాతో రాకూడదు. మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో నువ్వు ఒక్కడివి సమానం. కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి” అని చెప్పారు.
4 “I will do whatever you think best,” the king replied. The king stood beside the gate while all his men marched out by hundreds and by thousands.
అందుకు రాజు “మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను” అని చెప్పి, గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా, వేల కొలదిగా బయలుదేరారు.
5 The king ordered Joab, Abishai and Ittai, “Treat young Absalom gently for me.” All the men heard the king giving orders to each of his commanders about Absalom.
అప్పుడు రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను పిలిచి “నా కోసం యువకుడైన అబ్షాలోము పట్ల దయ చూపించండి” అని ఆజ్ఞాపించాడు. అక్కడున్నవారంతా వింటూ ఉండగానే రాజు అబ్షాలోమును గూర్చి సైన్యాధిపతులకందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు.
6 David's army marched out to face the Israelites in battle, which was fought in the forest of Ephraim.
దావీదు మనుషులు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి మైదానంలోకి బయలుదేరారు. ఎఫ్రాయిము అడవిలో పోరాటం జరిగింది.
7 The Israelites were defeated by David's men and many were killed that day—some twenty thousand.
ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలబడలేక ఓడిపోయారు. ఆ రోజున ఇరవై వేలమందిని అక్కడ చంపేశారు.
8 The battle covered the whole countryside, and that day more died because of the forest than were killed by the sword.
ఆ ప్రాంతమంతా యుద్ధం వ్యాపించింది. ఆ రోజున కత్తి వాత చనిపోయిన వారికంటే ఎక్కువమంది అడవిలో చిక్కుకుని నాశనమయ్యారు.
9 Absalom ran into some of David's men while he was riding on his mule. As the mule went under the twisted branches of a large oak tree, Absalom's hair got caught in the tree. The mule he was riding kept going, leaving him hanging between earth and sky.
అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వస్తూ దావీదు సేవకులకు ఎదురు పడ్డాడు. ఆ కంచరగాడిద ఒక బాగా గుబురుగా ఉన్న పెద్ద సింధూర వృక్షం కొమ్మల కిందనుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము తల చెట్టుకు తగులుకుంది. అతడు పైకి ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అతని కింద ఉన్న కంచర గాడిద ముందుకు వెళ్ళిపోయింది.
10 One of David's men saw what happened, so he told Joab, “I just saw Absalom hanging from an oak tree!”
౧౦ఒక సైనికుడు అది చూసి, యోవాబు దగ్గర కు వచ్చి “అబ్షాలోము సింధూర వృక్షానికి చిక్కుకుని వేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.
11 “What! You saw him like that?” Joab said to the man. “Why didn't you kill him right then and there? I would have given you ten shekels of silver and a soldier's belt as a reward!”
౧౧అప్పుడు యోవాబు ఆ వార్త తెచ్చినవాడితో “నువ్వు చూశావు గదా, నేలమీద పడేలా అతణ్ణి ఎందుకు కొట్టలేదు? నువ్వు గనక అతణ్ణి చంపి ఉంటే పది తులాల వెండి, ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉండేవాణ్ణి” అన్నాడు.
12 But the man replied, “Even if you gave me a thousand shekels of silver, I wouldn't hurt the king's son. We all heard the king give the order to you, Abishai, and Ittai, ‘Look after young Absalom for me.’
౧౨అప్పుడు వాడు “యువకుడైన అబ్షాలోమును ఎవ్వరూ తాకకుండా జాగ్రత్తపడమని రాజు నీకూ, అబీషైకీ, ఇత్తయికీ ఆజ్ఞ ఇస్తున్నప్పుడు నేను విన్నాను. వెయ్యి తులాల వెండి నా చేతిలో పెట్టినా రాజు కొడుకుని నేను చంపను.
13 If I had disobeyed and killed Absalom—and the king finds out everything—you yourself wouldn't have defended me.”
౧౩మోసం చేసి అతని ప్రాణానికి హాని తలపెడితే ఆ సంగతి రాజుకు తెలియకుండా ఉండదు. రాజు సమక్షంలో నువ్వే నాకు విరోధివౌతావు” అని యోవాబుతో అన్నాడు.
14 “I'm not going to waste time waiting around like this with you!” Joab told him. He grabbed three spears and drove them into Absalom's heart while he was still alive, hanging from the oak tree.
౧౪యోవాబు “నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా?” అని చెప్పి, మూడు బాణాలు చేతిలోకి తీసుకుని వెళ్లి సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఇంకా ప్రాణంతో ఉన్న అబ్షాలోము గుండెకు గురి చూసి కొట్టాడు.
15 Ten of Joab's armor-bearers surrounded Absalom and hacked him to death.
౧౫యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది చుట్టుముట్టి అబ్షాలోమును కొట్టి చంపారు.
16 Then Joab blew the ram's horn, and his men stopped chasing the Israelites because Joab had signaled them to stop.
౧౬అప్పుడు ఇశ్రాయేలీయులను తరమడం ఇక ఆపమని యోవాబు బాకా ఊదించాడు. దావీదు సైనికులు తిరిగి వచ్చారు.
17 They took Absalom and threw him into a deep pit in the forest, and piled a large heap of stones over him. All the Israelites ran away to their homes.
౧౭ప్రజలు అబ్షాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు.
18 Absalom while he was alive had made a stone pillar and set it up in the King's Valley as a memorial to himself, for he thought to himself, “I don't have a son to keep the memory of my name alive.” He named the pillar after himself, and it's called Absalom's Monument even today.
౧౮అబ్షాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనక అతడు బ్రదికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతని పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్షాలోము స్తంభం అని పిలువబడుతూ ఉంది.
19 Then Ahimaaz, son of Zadok, said, “Please let me run and take the good news to the king that the Lord has vindicated him over his enemies.”
౧౯సాదోకు కొడుకు అహిమయస్సు “నేను పరుగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా తన శత్రువులను ఓడించి రాజుకు న్యాయం చేకూర్చాడన్న సమాచారం రాజుతో చెబుతాను” అన్నాడు.
20 “You're not the man to take the good news today,” Joab replied. “You can do it some other time, but don't do it today, because the king's son is dead.”
౨౦యోవాబు “ఈ రోజున ఈ కబురు చెప్పకూడదు. మరో రోజు చెప్పవచ్చు. ఎందుకంటే రాజు కుమారుడు చనిపోయాడు కనుక నేడు ఈ కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు” అని అతనితో చెప్పాడు.
21 So Joab said to a man from Ethiopia, “Go and tell the king what you have seen.” He bowed to Joab and ran off.
౨౧తరువాత కూషువాడిని పిలిచి “నువ్వు వెళ్లి నువ్వు చూసినదంతా రాజుకు తెలియజెయ్యి” అని చెప్పాడు. అప్పుడు కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.
22 Ahimaaz asked Joab again, “Never mind what happens, please let me run too, after the Ethiopian!” “Son, why do you want to run—you won't get anything for it?” Joab replied.
౨౨సాదోకు కొడుకు అహిమయస్సు “కూషువాడితో నేను కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు” అని అడిగాడు. యోవాబు “కుమారా, నువ్వెందుకు వెళ్ళాలి? నీకు బహుమానం వచ్చే ప్రత్యేకమైన సమాచారం ఏదీ లేదుకదా” అని అతనితో అన్నాడు.
23 “Doesn't matter, I want to run anyway,” he said. “Fine, start running!” Joab told him. Ahimaaz took the route over flatter ground and overtook the Ethiopian.
౨౩అప్పుడు అతడు “ఏమైనా సరే, నేను పరుగెత్తి వెళ్తాను” అన్నాడు. అందుకు యోవాబు “సరే వెళ్ళు” అని చెప్పాడు. అహిమయస్సు మైదానపు దారిలో పరుగెత్తుకుంటూ కూషీవాడి కంటే ముందుగా చేరుకున్నాడు.
24 David was sitting between the inside and outside gates. The watchman climbed up to the roof of the gateway by the wall. He looked out, and saw a man running by himself.
౨౪దావీదు రెండు గుమ్మాల మధ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. కాపలా కాసేవాడు గుమ్మంపైనున్న గోడమీదికి ఎక్కి చూసినప్పుడు ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఒకడు కనబడ్డాడు. కాపలా కాసేవాడు గట్టిగా అరుస్తూ రాజుకు ఈ సంగతి చెప్పాడు.
25 So he shouted down to tell the king. “If he's by himself then he's bringing good news,” the king replied. As the first runner got closer,
౨౫రాజు “వాడు ఒంటరిగా వస్తున్నట్టైతే ఏదో కబురు తెస్తున్నాడు” అన్నాడు. వాడు పరుగెత్తుకొంటూ దగ్గరికి వచ్చాడు.
26 the watchman saw someone else running, and he shouted down to the gatekeeper, “Look! There's another man running by himself!” “He'll also be bringing good news,” said the king.
౨౬కాపలా కాసేవాడికి పరుగెత్తుకుంటూ వస్తున్న మరొకడు కనబడ్డాడు. వాడు “అదిగో మరొకడు ఒంటరిగా పరుగెత్తుకొంటూ వస్తున్నాడు” అని గుమ్మం వైపు తిరిగి రాజుతో చెప్పాడు. రాజు “వాడు కూడా ఏదో కబురు తెస్తున్నాడు” అన్నాడు.
27 “The first man seems to me to be running like Ahimaaz, son of Zadok,” said the watchman. “He's a good man,” he king replied. “He'll bring good news.”
౨౭కాపలా కాసేవాడు దగ్గరికి వస్తున్న మొదటివాణ్ణి చూసి “వాడు సాదోకు కొడుకు అహిమయస్సు అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. అప్పుడు రాజు “వాడు మంచివాడు, మంచివార్తే తెచ్చి ఉంటాడు” అన్నాడు.
28 Ahimaaz shouted out greetings to the king, Then he came and he bowed facedown before the king. “Blessed be the Lord your God!” he said. “He has defeated the men who rebelled against Your Majesty!”
౨౮అంతలో అహిమయస్సు “రాజా, జయహో” అని గట్టిగా రాజుతో చెప్పి, రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి “నా యేలిన వాడవైన రాజా, నిన్ను చంపాలని చూసిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం” అన్నాడు.
29 “How is young Absalom? Is he alright?” the king asked. Ahimaaz answered, “It was very chaotic when your officer Joab sent me, your servant. I really don't know what was happening.”
౨౯అప్పుడు రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అహిమయస్సు “నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూసాను గానీ అది ఏమిటో నాకు తెలియదు” అని చెప్పాడు.
30 “Stand to one side and wait,” the king told him. So Ahimaaz stood to one side and waited.
౩౦అప్పుడు రాజు “నువ్వు అవతలికి వెళ్లి నిలబడు” అని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు పక్కకు జరిగి నిలబడ్డాడు.
31 Right then the Ethiopian arrived and said, “Your Majesty, listen to the good news! Today the Lord has defeated all those who rebelled against you!”
౩౧అంతలో కూషీవాడు వచ్చి “మా ఏలికవైన రాజా, నేను నీకు మంచి సమాచారం తెచ్చాను. ఈ రోజు యెహోవా నీ మీదికి దండెత్తిన వారందరినీ ఓడించి నీకు న్యాయం చేకూర్చాడు” అని చెప్పినప్పుడు
32 “How is young Absalom? Is he alright?” the king asked. The Ethiopian replied, “May what has happened to the young man happen to Your Majesty's enemies, and to everyone who rebels against you!”
౩౨రాజు “బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అప్పుడు కూషీవాడు “మా ఏలినవాడవు, రాజువు అయిన నీకు కీడు చేయాలని నీ మీదకు దండెత్తినవాళ్ళందరికీ ఏమి జరిగిందో ఆ బాలుడికి కూడా అదే జరిగింది” అన్నాడు.
33 The king broke down. He went up to the room over the gate and cried. As he walked, he sobbed out, “My son Absalom! My son, my son Absalom! I wish I'd died instead of you, Absalom, my son, my son!”
౩౩అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ “అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా” అని కేకలు వేస్తూ “అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా” అని విలపిస్తూ ఉన్నాడు.

< 2 Samuel 18 >